నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) నిర్వహించిన సీసీటీఎన్‌ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ చాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. పోలీస్ అప్లికేషన్ విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. తెలంగాణ పోలీస్ తయారు చేసిన సైబర్ క్రైం అనాలసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టం -Cycaps (సైకాప్స్) టూల్ కు ప్రశంసలు లభించాయి. ఈ సైకాప్స్ టూల్ సృష్టి కర్త.. ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ దేవేందర్ సింగ్. […]
Author: Telugu Global
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు. ఈ పథకాన్ని కేసీఆర్ మాసనపుత్రికగా చెబుతుంటారు టీఆర్ఎస్ నేతలు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చారనే వాదనలూ ఉన్నాయి. ఈ ఖరీఫ్ కు సంబంధించి ఇంకా రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో పడలేదు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.వెంటనే రైతు బంధు […]
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఒకసారి క్రెడిట్ కార్డుకి అలవాటైపోయాక దాన్నుంచి బయటపడడం చాలాకష్టం. అయితే చాలాసమయాల్లో క్రెడిట్ కార్డు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భరోసాగా ఉంటుందనే ఆలోచనతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. కానీ రానురాను క్రెడిట్ కార్డు ఒక అలవాటుగా మారుతుంది. అవసరంలేని ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ.. లేనిపోని ఆర్థిక భారాన్ని […]
కొవిడ్ టీకా ని దేశ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇదో బృహత్తర కార్యక్రమం అని పదే పదే ప్రకటించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. బూస్టర్ డోస్ టైమ్ కి దాదాపుగా చేతులెత్తేసింది. బూస్టర్ డోస్ ఇస్తున్నామని ప్రకటించినా కేవలం 60 ఏళ్లు పైబడినవారికే ఉచితం అని, మిగతావాళ్లంతా ప్రైవేటు కేంద్రాల్లో బూస్టర్ డోసు తీసుకోవాలనే నిబంధన విధించింది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో బూస్టర్ డోస్ ల కేటాయింపులు దాదాపుగా ఆగిపోయాయి. పోనీ కేంద్రం వద్ద టీకా నిల్వలు […]
హైదరాబాద్ సహా తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు హైదరాబాద్, మెదక్ ప్రాంతాలకు విస్తారంగా వ్యాపించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ అంతటా వ్యాపిస్తాయని చెప్పింది. ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే బుధవారం కురిసిన వర్షాలకు జంటనగరాలతో పాటు రాష్ట్రంలో పలు […]
టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో రెండు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించే ఆఖరాటకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు రెండుజట్లకూ చావోబతుకో అన్నట్లుగా మారింది. ఆత్మవిశ్వాసంతో […]
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కార్మిక బీమా ఆస్పత్రులు (ఈఎస్ ఐ) ఆస్పత్రులు ఏర్పడనున్నాయి. వీటి కోసం రామగుండం, సంగారెడ్డి, శంషాబాద్‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇప్పటపికే కోరిందని కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఒక్కో ఆస్పత్రిని వంద పడకల సామర్ధ్యంతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రామచంద్రాపురం, నాచారంలో ఇప్పటికే సిద్ధమైన ఆసుపత్రులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ […]
నేటి సమాజంలో వేషానికే నాగరికత తప్ప భావాల్లో ఇంకా అనాగరిక ఆలోచనలే కనబడుతున్నాయి. పైకి ఆథునికులమని చెప్పుకునే కుటుంబాల్లో కూడా ఇంకా పరువు పట్టుకుని వేలాడుతూ అమాయకులైన ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పరువు హత్యలు ఎక్కువవుతూ మానవత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా రాప్తాడులో మరో పరువు హత్య జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కనగానపల్లికి చెందిన చిట్ర మురళీ కృష్ష(27)పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పెనుకొండలోని […]
భారత్ – దక్షిణాఫ్రికాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ నీకో రెండు, నాకో రెండు అన్నట్లుగా సాగుతోంది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన కీలక నాలుగో టీ-20 సమరంలో ఆతిథ్య భారత్ అతిపెద్ద విజయంతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది. దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ షో… సిరీస్ చేజారకుండా ఉండాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో కీలక టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగి..20 ఓవర్లలో […]
అగ్నిపథ్ అల్లర్లతో ఓవైపు రైల్వే స్టేషన్లు తగలబడిపోతున్నాయి, మరోవైపు అమాయకులైన యువకుల ప్రాణాలు కూడా పోయాయి. అయినా కేంద్రం మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదంటోంది. పథకం అమలు చేసి తీరతామంటున్నారు కేంద్ర మంత్రులు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారం లాంటి అవకాశం అని అన్నారు రాజ్ నాథ్ సింగ్. త్వరలోనే అగ్నిపథ్ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వెంటనే యువత అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓవైపు నిరసనలు జరుగుతున్నా.. మరోవైపు యువతకు సన్నద్ధం […]