ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన మోడీకి సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. భీమవరంలో విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోడీ వచ్చారు. అక్కడే ఆయనకు వీడ్కోలు పలికిన వైఎస్ జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఏపీకి హక్కుగా రావల్సిన నిధులు, గ్రాంట్లతో పాటు విభజన హామీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా జగన్ అందులో ప్రస్తావించారు. తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి […]
Author: Telugu Global
యురోపియన్ ఎండోమెట్రియోసిస్ లీగ్ (ఈఈఎల్ ).. అనే సంస్థ లండన్ లో… వచ్చే నవంబరులో ఎండోమెట్రియోసిస్ అనే అనారోగ్యానికి సంబంధించి ఒక మాస్టర్ క్లాస్ ని నిర్వహించాలని తలపెట్టింది. మహిళలకు వచ్చే అనారోగ్యం ఇది. గర్భ సంచి లోపల పెరగాల్సిన ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి వెలుపల పెరగటం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే… ఇది కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. మహిళల అనారోగ్యాలకు చికిత్స చేసే […]
ప్రధాని మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరంకు హెలీకాప్టర్‌లో వెళ్లిన మోడీ.. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే హెలీకాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయంలో ఆయన హెలీకాప్టర్ చూసి కొంత మంది నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. డజన్ల కొద్ది బ్లాక్ బెలూన్స్ మోడీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చుట్టూ ఎగురుతుండటంతో పోలీసులతో పాటు […]
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో పర్యటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు, బ్రిటిషర్లను ఎదిరించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని.. అక్కడికి కొంత దూరంలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. భీమవరం సభలో కూడా ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యావత్ భారతావనికే […]
తాను అందరివాడిని అని చెప్పుకుంటున్నా కూడా పవన్ కల్యాణ్ కాపు ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకునేవారు. 2024లో పవన్ తిరుపతివైపు చూస్తున్నారనే లెక్కలు కూడా ఇందులో భాగంగానే బయటకు వచ్చాయి. ఇటీవల వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ చర్చలు కూడా దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే కాపులంతా పవన్ వెంటే ఉన్నారా..? ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారా..? జనసేనకోసం కష్టపడితే రేపు పవన్, […]
– ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది – 8 ఏళ్లలో రాష్ట్రానికి చాలా నిధులు ఇచ్చాం – త్వరలో మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతోంది – రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే జాతీయం చేస్తాం – తెలుగు భాషలో మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను అందించనున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ది చెందుతున్నాయి. అందుకు డబుల్ ఇంజిన్ సర్కార్లే కారణం. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే […]
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మామయ్యనని.. ముద్దులు పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారని, ఇప్పుడా ముద్దుల మామయ్య ఎక్కడికెళ్లిపోయారని సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన-జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముద్దుల మామయ్య ఫీజు చెల్లించకపోవడంతో.. పేద విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారని విమర్శించారు. జగన్ కుమార్తె మాత్రం విదేశాల్లో చదువుకుంటోందని, సీఎం కుమార్తె గురించి మాట్లాడటానికి తనకు సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా జరగడంలేదని చెప్పారు […]
ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది. […]
పుర్రెకో బుధ్ది, జిహ్వకో రుచి అంటారు. ఎవరి పిచ్చి వారికానందం అన్నది కూడా నానుడి ! పెళ్లి అంటే ఎక్కడైనా వధూవరుల ముసిముసి నవ్వులు, బాజా భజంత్రీలు, బంధుగణం మధ్య మధ్య వరుడు వధువు మెడలో తాళికట్టడాలు మామూలే ! కానీ ఇక్కడో పెళ్లి పూర్తి వెరైటీగా, విచిత్రంగా జరిగింది. దీనిగురించి చెప్పుకోవాలంటే మెక్సికో వెళ్లాల్సిందే ! అక్కడి ఓక్సాకా అనే చిన్న గ్రామ మేయర్ ఒకరు ఎక్కడా లేనట్టు ఓ మొసలిని ‘పెళ్లి’ చేసుకున్నాడు. నమ్మశక్యం […]
8 ఏళ్ల పాలనలో బహుశా ప్రధాని మోదీ ఈ స్థాయిలో ర్యాగింగ్ ఎక్కడా ఎదుర్కొని ఉండరు. హైదరాబాద్ పర్యటనలో, అందులోనూ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో మోదీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా హోర్డింగ్ లు, ప్లకార్డ్ లు పట్టుకుని వీధుల్లో నిలబడే మనుషులకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అవును.. ఇప్పుడు హైదరాబాద్ లో మోదీని టార్గెట్ చేస్తూ వేసిన హోర్డింగ్ లు […]