పగటి పూట కూడా మత్తుగా ఉంటే కచ్చితంగా దాని గురించి ఆలోచించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.
Author: Telugu Global
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఓటింగ్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తొలి రౌండ్ లో విజయం సాధించారు .
వాక్ స్వేచ్చ గురించి, మానవహక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలపై ఉపాన్యాసాలు ఇస్తూ ఉంటారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, చమురు, మెడిసిన్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేషన్ ప్రకారం పోస్తున్నారు. ఏప్రిల్ నుంచి దేశంలో అధ్యక్షుడు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజపక్స కుటుంబం కారణంగానే దేశం ఇంత అప్పుల్లో కూరుకొని పోయిందని శ్రీలంక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే గొటబయ సోదరుడు మహింద రాజపక్స ఎప్పుడో ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో విక్రమ […]
భోరుమంటూ బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక.. బ్రిటన్ ఇప్పుడు ఈ పోస్టులో కొత్త ముఖం కోసం వేచి చూస్తున్న వేళ… రేసులో నేను ముందున్నానంటూ రిషి సూనక్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ళ ఈ నేత తానే ఈ పదవికి తగినవాడినని అంటున్నారు. తన ఇండియన్ ఆరిజిన్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఫొటోలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పీఎం పదవికి తనకే అర్హత ఉందని ఆయన ప్రచారం పారంభించారు. […]
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక ఇక ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు ఉంటారనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియన్ ఆరిజిన్ అయిన (భారత సంతతికి చెందిన) రిషి సునాక్ పేరు పదేపదే వినిపించింది. ఇది భారతీయులకు గర్వ కారణమని కూడా పొంగిపోయాం.. కానీ తాజా లెక్కలు దీనికి అనుగుణంగా లేవు. బోరిస్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ ని ఈ పదవి వరించవచ్చునని తెలుస్తోంది. కేర్ టేకర్ గా ఇప్పటికీ ఆయన ఈ […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. నారా సిటీలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. ఒక్కసారిగా గన్ షాట్స్ శబ్దం వినిపించాయని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షింజో అబేని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన షింజో అబే.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా […]
వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో […]
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం. అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్‌లో ‘సాఫ్రాన్’ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ […]
వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి రెండురోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తుగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రస్థాయి సమావేశానికి నేతలు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఇటీవలే టీడీపీ మహానాడు […]