Author: Telugu Global

కేటీఆర్.. ఈ పేరు చెప్తే చాలు సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు గుర్తు పట్టేస్తారు. ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు తీసుకొని రావడంలో ఎంతో కృషి చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేశారు. అప్పటి నుంచి ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అహర్నిశలు రాష్ట్రం కోసం పని చేస్తూనే ఉన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా.. చాలా మంది కేటీఆర్ మంత్రిగా తెలంగాణకు చేసిన సేవను మాత్రం పొగడకుండా ఉండలేరు. ఐటీ అంటే కేటీఆర్ అనేలా ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. తండ్రి చాటు కొడుకు అనే మాట నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కేటీఆర్ పుట్టినరోజు ఇవాళ.రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిదీ విభిన్నశైలి. వారి ఆలోచనా ధోరణి కూడా వేర్వేరుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ…

Read More

టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.

Read More

విపరీతమైన‌ ఎండలు, వేడి గాలులతో యూరప్ మండిపోతోంది. ప్రజలు చల్లని ప్రాంతాలకు పోవడానికి విమానాశ్రయాలకుపరుగులు తీస్తున్నారు. దాంతో అక్కడి విమానాశ్రయాలు రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి.

Read More

భారత దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారని కెనడాకు చెందిన 50 మంది మేధావులు ఆ‍ందోళన వెలిబుచ్చారు. తీస్తా సెతల్వాద్, శ్రీ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Read More

శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నంతపని చేశాడు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపాడు. పార్లమెంటు ఎదుట నిరసన తెలుపుతున్న ప్రజలపై అర్దరాత్రి సైన్యం, పోలీసులు దాడి చేశారు. నిరాయుధ నిరసనకారులపై లాఠీలు జుళిపించారు. టెంట్లను కూల్చేశారు. వందలమంది నిరసనకారులను నిర్బంధించారు. అధ్యక్ష కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఏర్పాటు చేసిన అన్ని టెంట్లను సైన్యం ధ్వంసం చేసింది. రణీల్ విక్రమ సింఘే అధ్యక్షుడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గొటబయ రాజపక్సేకు మద్దతుదారైన రణిల్ అధ్యక్షుడైతే శ్రీలంకకు ఒరిగేదేం లేదని కాబట్టి ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. శాంతి యుత నిరసనలు తెలపడానికి తమకు అవకాశం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి నుంచీ నిరసనల పట్ల వ్యతిరేకంగా ఉన్న రణిల్ విక్రమసింఘే తాను అధికారంలోకి రాగానే నిరసనలను అణిచివేస్తానని బహిరంగంగానే ప్రకటించి ఇప్పుడు అన్నంత పని చేశాడు. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చాడు. శాంతి భద్రతలకు భంగం…

Read More

కరణ్ జోహార్ సమంత వ్యక్తిగత జీవితంపై పలు ప్రశ్నలను అడిగాడు. ముఖ్యంగా విడాకులపై పలు ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చింది. నాగచైతన్యతో తాను విడిపోవడం సామరస్యంగా జరగలేదని సమంత ఆ షోలో పేర్కొంది.

Read More

ఆరు దేశాల క్రీడాకారులు, ఇతర సిబ్బందికి హోటల్స్, రవాణా ఏర్పాటు చేయడం కష్టమవుతుందని.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలను రెడీ చేయడం కూడా వీలుపడదని ఏసీసీకి చెప్పింది.

Read More

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన అధ్యక్షుడవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ దేశ ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. విక్రమసింఘే రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇవ్వాళ్ళ పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

Read More