ఎడమచేతి వాటంతో పనిచేసేవారి దినోత్సవం. అంటే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అన్నమాట.
Author: Telugu Global
యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది, పశువులకు కూడా తాగు నీళ్ళు, ఆహారం లేక పాల ఉత్పత్తులు పడిపోయాయి. చివరకు ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం మంచి నీళ్ళపై ఆంక్షలు విధించింది.
భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా తాగటం వలన ఒక సిగరెట్ పది సిగరెట్లకు సమానం అవుతుంది.
మిడ్ నైట్ చిల్డ్రన్ నవలతో బుకర్ ప్రైజ్ అందుకున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ లో చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్ స్టిట్యూట్ లో ప్రసంగించేందుకు వచ్చారు సల్మాన్ రష్దీ. స్టేజ్ పై ఉన్న ఆయన తన ప్రసంగానికి సిద్ధమవుతున్న వేళ ఆయనపై ఓ దుండగుడు సడన్ గా దాడి చేశాడు. కత్తితో పొడిచాడు, దీంతో సల్మాన్ రష్దీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఏ ఆస్పత్రిలో ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రష్దీ, బ్రిటన్‌లో స్థిరపడ్డారు. గ్రీమ్స్ అనే నవలతో ఆయన సాహితీ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1981లో మిడ్ నైట్ చిల్డ్రన్ నవల ఆయనకు ప్రపంచ ఖ్యాతి…
ట్విట్టర్‌తో వివాదం ఎటూ తేలకపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాలో సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.
వాట్సప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.
నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా థియేటర్లలోకి వచ్చింది. తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ..
జాన్సన్స్ టాల్కం బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలడంతో ఆ సంస్థపై వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల బాధలు తట్టుకోలేని కంపెనీ 2023 కల్లా ప్రపంచవ్యాప్తంగా బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
క్రిప్టో కరెన్సీ వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భారత్ లో 7.3 శాతం ప్రజలు క్రిప్టో కరెన్సీ ని వినియోగిస్తున్నారని UN ఓ నివేదికలో పేర్కొంది.
వాట్సాప్ తీసుకొచ్చిన లేటెస్ట్ అప్ డేట్స్‌లో గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ అవ్వడం, ఆన్ లైన్ స్టేటస్ కస్టమైజేషన్స్, వ్యూ వన్స్ మెసేజ్ లాంటి సరికొత్త ఫీచర్లున్నాయి.