Telugu Global
Arts & Literature

చూస్తూనే ఉందామా ? ( కవిత)

చూస్తూనే ఉందామా ? ( కవిత)
X

ప్రేమకు త్యాగం మారు పేరని

పాత సిద్ధాంతాల్ని కొట్టేస్తూ

వికటిస్తే యాసిడ్ అభిషేకం

తప్పదనే

అజ్ఞానుల అకృత్యాలు

ప్రబలిపోతున్నా

చూస్తూనే ఉందామా

రాజకీయ ఉబలాటంలో

బంద్ లు ధర్నాలు

విద్యార్థుల ఇక్కట్లు

అనవసర విషయాలకి

బలి అవుతున్నా

చూస్తూనే ఉందామా

భారతీయతను మంటకలిపి

స్త్రీత్వం పైట తొలగించి

తైతెక్కలాడుతున్నా

చూస్తూనే ఉందామా

ఇన్నాళ్లిలా! ఎన్నేళ్లిలా?

తప్పును ఖండించని నోళ్ళకు

వ్యతిరేకించని మనసుకు

చేష్టలుడిగిన కళ్ళకు

బుద్ధి చెప్పే దిశలో

ఈ వ్యవస్థ అవస్థని నిరసిస్తూ నరనరానికీ పనికల్పిస్తూ

వేల వేల పాదాలకు నడక నేర్పే రహదారిగా మారాలి

నవ సమాజ స్థాపనకు

నడుము కట్టాలి !

-యలమర్తి అనూరాధ

First Published:  10 May 2023 12:58 AM IST
Next Story