బ్రతుకుపోరులో
బలవుతున్న అతివలు
భయంతో పరుగులెత్తి
బతుకుతున్న మహిళలు
భీకర రాకాసి మూకల కామ కేకలకు
భీతిళ్ళుతున్న మహిళలు
బాధలెన్నో గుండెలో
బయటికి తను చెప్పలేక
బిక్కుబిక్కుమంటూ
బతుకుతున్న వనితలు..!!
బడికి వెళ్దామంటే భయం
బార్లు దారి పొడవనా వుంటు
బయటకు అడుగిడినాక గమ్యం చేరేదాక
భయం భయం అడపడుచుల అణువణువునా!!
బ్రతకాలని ఆరాటంలో
బండి వేసుకొని కూరలమ్మే అమ్మను సైతం
బలిసి ఆకలిగా చూసే పశువుల చూపులకు
బలి అవుతున్న చెల్లెలు ఎందరో..!!
భయపడకండి అమ్మలారా
బాట వెంట ఈ కుక్కలు అరుస్తుంటయ్
బలాన్నంతా ఉపయోగించి
బ్రతుకు పోరులో
బాధ్యత గా అడుగేయండి.!!
భయపడితే
భూతాల్లా వెంటపడతారు
బాటా చెప్పుతో
బదులివ్వండి
బద్మాష్ లు పారిపోయేదాకా..!!
**********
పోలోజు రాజ్ కుమార్
హైదరాబాద్
9959056095