ఆర్ద్రత నిండిన కళ్ళతో!...(కవిత)
BY Telugu Global15 Dec 2022 11:20 PM IST
X
Telugu Global Updated On: 15 Dec 2022 11:20 PM IST
ఆలోచన మేల్కొంది!
కలాలన్నీ ఆయుధాలై!
ఉద్యమిస్తున్నాయి!
శ్వేత పత్రంపై
గతి తప్పిన భవితను
బ్రతుకు పోరు చేసే జనత ను
రెక్కపట్టి ఒక్కలాగ
ఈ భువిపై నిలపాలనీ
అవినీతిని అంతమొందించాలని
అన్యాయంపై ధ్వజమెత్తాలనీ
అరాచకుల మదం అణిగే దాకా
మొత్తాలనీ
ముగ్ధమోహనంగా ముదిత
ఈ జగాన ఆదిశక్తిగా కీర్తింపబడాలనీ
నేతల ఊహల్లో నిదురోతున్న శాంతిని సైతం ఈడ్చుకు రావాలనీ
నోటుతోటి ఓటును కొనే
దౌర్భాగ్యం చావాలనీ
మందు భావనను
మటుమాయం చెయ్యాలనీ
బోసినవ్వుల బాలల్లో
బాల కార్మిక వ్యవస్థ
యోచన రాకూడదని
బాపూజీ కలలు కన్న
రామరాజ్యం రావాలనీ
ప్రజాస్వామ్య మెపుడూ
నేతల బ్రాంతుల్లో ఒదిగుండదనీ
గంట కొట్టి బజాయించి
గర్వంగా చెబుతూ
ఆర్ద్రత నిండిన కళ్ళతో
అక్షరాల్ని వెతుక్కుంటున్నాను
- దోసపాటి సత్యనారాయణ మూర్తి
Next Story