Telugu Global
Arts & Literature

వివిధ కవుల...సప్తపదులు

వివిధ కవుల...సప్తపదులు
X

ఎల్లలు

కల్లలు

పిల్లలకి లేవన్న జ్ఞానధునికి అభివందన జల్లులు.

-శారద

( వనస్థలి హైదరాబాద్ )

xxxxxxxxxx

సతి

పతి

దారి తప్పిన మారును జీవన గతి

-అర్చన కోవూరు

హైదరాబాద్

xxxxxxxxxx

దశ

దిశ

ఏర్పరచుకొని శ్రమిస్తే ఎoదుకు రాదు మహర్దశ

- గిడుగు లక్ష్మిదత్తు

సికిందరాబాద్

xxxxxxxxxx

ఆలన

లాలన

అమ్మకు మాత్రమే చేతనైన అనురాగ పాలన!

-శ్రీమతి భారతీకృష్ణ

హైదరాబాద్

xxxxxxxxxx

ఈడు

జోడు

కుదిరితేనే పెండ్లి -ముచ్చట నాడు నేడు

-ఎన్ ఆర్ తపస్వి

చెన్నై

xxxxxxxxxx

వయసు

సొగసు

పెరగొచ్చు తరగచ్చు నిలకడగా నిలపాలి మనసు

-డాక్టర్ వై వి సుబ్రహ్మణ్యం

సికిందరాబాద్

xxxxxxxxxx

సర్దుబాటు

దిద్దుబాటు

లేని జనావళికి ‌ జీవితమే అంతులేని నగుబాటు!!

- కె కె తాయారు

( మదనపల్లి)

xxxxxxxxxx

ఆకాశగంగ

పాతాళగంగ

ఏది లభ్యమైనా రైతులకు తీరుతుంది బెంగ !

-తులాల. సవరమ్మ

శ్రీకాకుళం

xxxxxxxxxx

ఉచితం

ఆయాచితం

ఆశించి- ఓట్లేస్తే..అవుతుంది.. ఆర్ధికవ్యవస్థ -సతమతం.

- సామర్ల రమేష్ బాబు

మంగుళూరు, కర్నాటక

xxxxxxxxxx

పాలు

చేలు

మనుజుల మనుగడకు ఆదినుండి ఇవే ఆనవాలు!

--యన్. కే.నాగేశ్వరరావు

పెనుగొండ. ప.గో.జిల్లా.

xxxxxxxxxx

మబ్బు

జబ్బు

ఇవి రెండూ క్రమ్ముకుంటే జనం తబ్బిబ్బు.

-సరస్వతి పొన్నాడ

హైదరాబాద్.

xxxxxxxxxx

మతిమరుపు

కొసమెరుపు

చరమాంకాన అనుకోని అతిధికి మనసే పరుపు

-డా రమణ యశస్వి ,

గుంటూరు

xxxxxxxxxx

రాళ్లు

నీళ్లు

బంధాన్ని మోస్తూ జీవిస్తున్నాయి

ఎన్నో ఏళ్ళు!

-గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

xxxxxxxxxx

నీతి

రీతి

తప్పకుండా పాటించే జాతికే దక్కాలి ఖ్యాతి

- వి .నాగమణి

హైదరాబాద్

First Published:  14 July 2023 5:09 PM IST
Next Story