విశ్వనాథ వారు అనువదించిన... వివేకానందుని యతిగీతము
భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. స్వాతంత్ర్యము అనేది మత సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది. ఉత్తిష్టత:జాగృత ప్రాప్య వరాన్నిబోధత" అన్న కఠోపనిషత్ వాక్యాలు వివేకానందులు రాసిన యతి గీతానికి ప్రేరణ. "లెండు, గురిని ముట్టువరకు ఆగకుడు"
అనిన మూల సూత్రమే ఇందుకు స్ఫూర్తి. పాటతో నిద్రించు జనతను మేల్కొనుమని హెచ్చరించడమే వివేకానందుని 'యతిగీతం'ధ్యేయం.
ఒకసారి మద్రాసు రేడియో స్టేషను లో రామకృష్ణా మిషన్ కు చెందిన నిర్వికల్పానంద స్వామి విశ్వనాథ సత్యనారాయణగారికి తారస పడ్డారు. నిర్వికల్పానందులు పూర్వాశ్రమం లో విశ్వనాథ వారి విద్యార్థి. మాటలలో స్వామి విశ్వనాథ వారిని వివేకానందుల వారి "the song of sanyaasin " ను తెలుగులో అనువదింపుమని కోరారు . ఆ సమయానికి స్వామి వారివద్ద ఆగీతం ఉంది. అదే తడవుగా చెట్టు కింద కూచుని విశ్వనాథ తెలుగు పద్యాన్ని చెప్పడం,నిర్వికల్పానందులు రాసుకోడం జరిగింది. విశ్వనాథ వారనువదించిన యతి గీతం 1945 ,1956 నాటి రెండవ ముద్రణలను అనుసరించింది. జువ్వాడి గౌతమ రావు గారు,వివేకానందుల వారి 137 వ జయంతి రోజు 2000 జనవరి 12. న దానిని ప్రచురించారు. ఈ గీతాన్ని 12 జనవరి 2013 లో వివేకానందుని 150 వ జయంతి సందర్భం గా జవంగుల వెంకటేశ్వర రావు గారు తెలుగు వారికి అర్పించారు. విశ్వనాథ వారి అనువాదాన్ని భారతి మొదలైన పత్రికలలో ప్రచురించారు.
స్వామీ వివేకానందుడు మానవ లోకానికి అందించిన మహత్తరమైన కానుక 'యతి గీతం'. వారు ఈగీతాన్ని మూలత:ఆంగ్లం లో రచించారు. 1895 జూలై ఆగస్టు నెలలలో,
న్యూయార్క్ అమెరికా లోని "Thousand Island Park, New York, in July, 1895". లో కావించిన ఉపన్యాస మాలికలో ఈ గీతాన్ని రచించారు. యతుల కు ఉండవలసిన బౌద్ధిక ,ఆంతరిక ప్రవృత్తులను గూర్చి మార్మికంగా చెప్పారు. ఈ యతి గీతము, భారత దేశం లోని యోగులందరికీ, నిత్య పారాయణ గీతం గా మారింది.
ఈ గీతం కేవల ఆధ్యాత్మికం గానే కాక దేశ భక్తి భావనకు ఓత ప్రేతమైన ప్రతీకగా భాసించింది.
దేశాభ్యుదయానికి దేశ పునరుత్థానానికి అను క్షణం పరితపించిన స్వామి భావనలు అక్షర రూపాన్ని పొందాయి. యువకుల అంతస్సత్వాన్ని జాగృతం చేయడానికి వివేకానందుడు ఈ గీతం లోని ప్రతి అక్షరాన్ని ఉద్ధరించాడు . వారు జీవించిన అత్యల్ప వ్యవధి లో తర తరాలకు కావలసిన ఆధ్యాత్మిక, బౌద్ధిక సంపదను యువకులకు అందించారు. నిస్స్వార్థమైన ఆత్మ చేతన దేశ స్వాతంత్ర్యానికి మూలమని ఉద్ఘోషించారు.
మూలంలో 13 stanza లలో ఉన్న ఈ గీతాన్ని విశ్వనాథ వారు 12 సీస పద్యాలు ఒక శార్దూలం లో అనువదించారు. మూలంతో తులనాత్మకం గా చూస్తే ఇది భావానువాదానికి చక్కని ఉదాహరణ నిస్తుంది. అనుసృజనలో అనువాదకుని భావనా స్వాతంత్ర్యం తగిన గాంభీర్యత లోనే సరళతా సిద్ధి ని సాధించడం లోనూ, దేశీయతా వాక్కులను అనుసంధానించడం లోనూ ,సందర్భోచితమైన సూక్తులను సామెతలను జోడించడం లోనూ వ్యక్తమౌతుంది.
ఉదాహరణకు కొన్ని వాక్యాలను గ్రహిద్దాం
ఈ గీతం ధీర శాంత విమల చిత్తం లో ఉద్భవించినదని, ముందుగానే పాఠకుల మనో భూమికను లోక వాసనలను తుడిచిన నిశ్చల చిత్తంగా సిద్ధం చేసారు.
Wake up the note! the song that had its birth
Far off, where worldly taint could never reach,---
Sing high that note, Sannyâsin bold! Say—
"Om Tat Sat, Om!" అనే వాక్యాలను పలికించురా , రువార -మేచు తంత్రీ సుధా కంఠమెత్తి జ్ఞాన -వియదమోఘాధ్వములు పల్లవించునట్లు అని మొదటి చివరి వాక్యాలను పద్యం లోని చివరి పాదాలుగా మార్చారు . ధీర సన్యాసి అంటూ సంబోధించారు.
Bonds that bind thee down,
Of shining gold, or darker, baser ore ;
Love, hate—good, bad—and all the dual throng,
Know, slave is slave, caressed or whipped, not free ;
For fetters, though of gold, are not less strong to bind ;
బానిస ఎపుడైన బానిసయే ,శృంఖలమ్ములేవేన్ శృంఖలమ్ముల యగు,
బంగరు తో జేయ బడ్డట్టి సంకెలల్
పట్టి చేతులు ముద్దు పెట్టుకోవు,
ధీర సన్యాసి విద్రిచి విదిర్చి కొమ్ము అంటూ "వట్టి చేతులు ముద్దు పెట్టుకోవు అని సరసంగా అనువదిస్తూనే "
చివరకు సాధు సచ్చిత్కళా ప్రదీప్త సవిన్మహాజ్యోతి తీర్చునట్లు అని గంభీరంగా కొరడాతో ఝుళిపిస్తారు.
Let darkness go;-it drags
From birth to death, and death to birth, the soul.
He conquers all who conquers self. Know this
And never yield, Sannyâsin bold! Say—కాంతి కాదది చీకట్ల పుట్ట, -మాయ లేడి -ధీర సన్యాసి లొంగకు మౌర దాని -
హరిణ మాత్త మారీచమైన ప్రతిభ -సీత చెంగటనే వధ చేయు దాని -అని పూర్వ పురాణ ఉదాహరణతో జాతీయతను పలికించారు --ఇలా అనువాద రుచిరమైన ఈ గీతాన్ని అందరూ తప్పక చదివి, దేశ స్వాతంత్ర్యానికి మూలంగా ఆత్మ బంధనాలను వదిలించుకోవాలి.
తీవ్రమైన వేడి లో ,చలిలో దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించాలి. వ్యకినిష్ట ను దేశ ప్రేమకు అంకితం చేయాలి.
- శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల
(వర్జినియా. యు.ఎస్)