Telugu Global
Arts & Literature

వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం
X

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.

వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి.

దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం.

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తాం. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.

జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు.

పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మ‌వారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది.

శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు ఆచరించి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది.వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు.

సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం

-------------------

ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను.

పూర్వాంగం చూ.

శ్రీ మహాగణపతి లఘు పూజ చూ.

పునః సంకల్పం |

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం ||

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |

నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా ||

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే

సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి || ౧

ఆవాహనం ||

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్స్థలాలయే |

ఆవహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవహయామి || ౨

సింహాసనం ||

సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే |

సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి || ౩

అర్ఘ్యం ||

శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం |

అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహ్యతాం హరివల్లభే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి || ౪

పాద్యం ||

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం |

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి || ౫

ఆచమనీయం ||

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం |

గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి || ౬

పంచామృత స్నానం ||

పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం |

పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి ||

శుద్ధోదకస్నానం ||

గంగాజలం మయాఽనీతం మహాదేవశిరస్స్థితం |

శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి || ౭

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రయుగ్మం ||

సురార్చితాంఘ్రి యుగళే దుకూలవసనప్రియే |

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి || ౮

ఆభరణాని ||

కేయూర కంకణా దివ్యే హార నూపుర మేఖలాః |

విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి || ౯

మాంగళ్యం ||

తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం |

మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి ||

గంధం ||

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం |

గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి || ౧౦

అక్షతాన్ ||

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శూభాన్ |

హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి

- బి.మనస్విని

First Published:  25 Aug 2023 12:59 PM IST
Next Story