Telugu Global
Arts & Literature

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

అమెరికాలో చికిత్స పొందుతూ మృతి

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
X

ప్రముఖ తబలా విద్వాంసుడు, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఇకలేరు. అమెరికాలోని శాన్‌ ఫ్రాన్‌సిస్కోలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తీవ్రమైన బ్లడ్‌ ప్లెజర్‌ తో బాధ పడుతున్న జాకీర్‌ హుస్సేన్‌ ను కుటుంబ సభ్యులు రెండు వారాల క్రితం ఆస్పత్తిలో చేర్పించారు. ముంబయిలో జన్మించిన జాకీర్‌ హుస్సేన్‌ తన తండ్రి అల్లారఖా బాటలోనే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు.హిందుస్థాని క్లాసికల్‌ మ్యూజిక్‌ తో పాటు జాజ్‌ ఫ్యూజన్‌ లో నైపుణ్యం సొంతం చేసుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2023లో పద్మభూషన్‌ పురస్కారాలను ఇచ్చి గౌరవించింది.

First Published:  16 Dec 2024 7:27 AM IST
Next Story