స్వేచ్ఛ
BY Telugu Global19 Aug 2023 11:40 PM IST
X
Telugu Global Updated On: 19 Aug 2023 11:40 PM IST
కడలి అలల పుట్టి, గగనానికెగసి,
నీలిమబ్బుగ మారి, నీరు సంతరించి,
చిరుగాలి తాకంగ, తొలకరిగ మారి,
జలజలా నేల జారేను నేను!
స్వేచ్ఛగా నింగి కెగసిన నేను,
రాలేన యిసుకతిన్నెల నింకి పోవ.
పూరేకుల దాగి , వొదిగి సమసేన ?
స్వాతి చినుకుగ మారి ముత్తెమై మెరసేన?
మరల కడలి కలసి, కరగి పోయిన వేళ
అస్తిత్వమేది? ఆకృతి ఏది ?
ఎంచి చూడగ , నిజమైన విలువ ఏది ?
విధాత కరుణన కురిసిన ఈ చిన్ని చినుకు కు
సంపూర్ణ స్వేచ్ఛయే, పరిణితి కాద !!
స్వాతంత్ర్య మే, చిన్నిచినుకు మనోవాంఛయైన
మనిషి మనికేల పరతంత్ర మగుట న్యాయము?
మనిషి మనిషి కి నడుమ మమతల బంధముండ
మరి వేరె స్వర్గద్వారాల వెదకుటేల ??
⁃ ఉమ. ఇయ్యుణ్ణి.( US)
Next Story