Telugu Global
Arts & Literature

భరాగో గా పిలువబడిన ప్రముఖ రచయితభమిడిపాటి రామగోపాలం 13 వ వర్ధంతి ఇవాళ

భమిడిపాటి రామగోపాలం (ఫిబ్రవరి 6, 1932 -ఏప్రిల్ 7, 2010)

భరాగో గా పిలువబడిన ప్రముఖ రచయితభమిడిపాటి రామగోపాలం 13 వ వర్ధంతి ఇవాళ
X

జీవితంలో చాలా ఆటుపోట్లు చూసిన

భరాగో కబుర్లు సరదాగానూ, కులాసాగానూ ఉండేవి. లౌక్యులే అయినా,

అవసరమైన చోట్ల నిర్మొహమోటంగానూ ఉండగలరు. ఆయన చిన్నతనంలో ఒక

కథని ఖాసా సుబ్బారావుగారు ప్రచురించారుగాని, పారితోషికం ఏమీ

ఇవ్వలేదట. ఇదేమని దబాయించి ఉత్తరం వ్రాసి మరీ ఆయన పారితోషికం

తెప్పించుకొన్నారట ఆయన మంచి స్నేహశీలి. భానుమతి, బాపు, రమణల

దగ్గరనుంచి వైజాగ్లో చిన్నాచితుకు మనుషులవరకు అందరితోనూ

సన్నిహితసంబంధాలుండేవి ఆయనకు. అయన కథా సంపుటి 'ఇట్లు మీ విధేయుడు '1991 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది

సాహిత్యమన్నా, సంగీతమన్నా అమిత ఇష్టం; ముఖ్యంగా పాత

సినిమాపాటలంటే.

పాడటం సరదా -

భానుమతిగారి పాటని

ఆమె గొంతులోపాడి

ఆమెకే వినిపించారట ఒకసారి. మంచి గ్రంథాలయం ఉండేది

ఆయన దగ్గర;

కొన్నేళ్ళక్రితం టోకుగా అమ్మేశారు.

పుస్తకాలు ప్రచురించటంలో

భరాగో దిట్ట.

చాలా మంచి సంపాదకుడు.

జ్యేష్ట ఫౌండేషన్ పేర చాలా కార్యక్రమాలు నిర్వహించి,

చాలా పుస్తకాలు

ప్రచురించారు. ఉత్తరాంధ్రలో ఎవరు సావెనీరు వేయాలన్నా ముందు

ఆయనదగ్గరకే వెళ్ళేవారని అనిపించేది. సావెనీర్లే కాదు; స్మారక

సంచికలూ ,ఆత్మకథలు, కథలు, నవలలు వగైరా ఏవైనా (ఆఖరికి

తంజనగరంశ్రీతేవప్పెరుమాళ్ళయ్యవ్యాఖ్యతో వెలువడిన వసుచరిత్ర

ఎడిషన్తో సహా) ఆయన చేయిపడితే అందంగా, అచ్చుతప్పులు లేకుండా,

అవసరమైన ఫొటోలు, బొమ్మలు, వివరాలు వివరంగా నింపుకొని సొంపుగాబయటకు వచ్చేవి. గత రెండు దశాబ్దాల్లో వచ్చిన చాలా తెలుగు పుస్తకాల

వెనుక భరాగోగారి చేయి ఉంది.

ఆయన ఆత్మకథలో చివరిరోజులగురించి వ్రాయలేదు కాని, కష్టాలు ఆయన్ని

కడదాకా వదలలేదు. కుమార్తె వివాహం జరిగిన కొన్నిరోజులకే అల్లుడు

ఆక్సిడెంట్లో మరణించారు; సహచరిణి సత్యభామగారు ఆయన్ను ఒంటరివాణ్ణి

చేసి కాలధర్మం చెందారు. ఆర్థ్రైటిస్ వల్ల మంచం దిగలేని పరిస్థితి;

వ్రాద్దామంటే చేతులు సహకరించవు. ఐతే ఆయన మేధ మాత్రం చివరివరకూ

చురుకుగానే ఉండేది; కష్టాలూ, అనారోగ్యమూ ఆయన పనుల్ని ఏమాత్రమూ

ఆపలేకపోయాయి. ఎప్పుడు ఆయనతో మాట్లాడినా ఆయన ఆత్మస్థైర్యానికీ,

మొక్కవోని ఉత్సాహానికీ అందరికీ ఆశ్చర్యం వేసేది.

ఆయన మరణం తెలుగు సాహిత్యానికి నిజంగా లోటే.ఇది వారికి స్మృత్యంజలి

First Published:  7 April 2023 1:20 PM IST
Next Story