రాళ్ళలో ఉన్న నీళ్ళు -వీళ్ళ కళ్ళకే తెలుసు
BY Telugu Global21 Jun 2023 9:14 PM IST
X
Telugu Global Updated On: 21 Jun 2023 9:14 PM IST
రాతియుగపు మనుషుల రూపాలు
శిల్పారామాల్లో కనిపిస్తుంటాయి.
వాళ్ళ సజీవ ప్రతిరూపాలు నడక
బాటల పక్కన చతికిలబడి
కనిపిస్తుంటాయి.
కష్టం అదే! అప్పటిదే!!
కడుపు కూటి కోసం వేట.
రాళ్లు కొట్టే కాదు,
రెక్కలు ముక్కలు చేసుకుంటూ బడుగుల జీవితం..
బండరాళ్ళ కంటే ఘన పాషాణం.
బల్లకట్టు జీవితాలకి,
రాళ్లు కొట్టి కాయలు గట్టిన చేతులకి, విశ్రాంతి ఎక్కడ ? భరోసా ఎక్కడ?
చేతికి నోటికి చేరువ కాని ముద్ద కోసం ..
ఇంటి పనిముట్లు కారుచౌకగా
ఏసీ మాల్స్ లో
కారు' చౌకగా దొరుకుతుండగా.. ఎండలో మాడి మసిబారిన
బొగ్గు లాంటి మనుషుల కాయకష్టం- ఎవరికి ఇష్టం ?
ఏటికి ఎదురీదడం ఆపి,
నీటి వాలు సులువు మార్గం పట్టండి.
రాతి యుగం
గడిచిపోయి రోబోల కాలం నడుస్తోంది అని గుర్తించండి.
మరబొమ్మలకు,
మనిషితనం నేర్పామే..
మరి మనుషుల నుండి
మంచితనం దూరం
కాకుండా కాపాడుకోవద్దూ..
-మల్లేశ్వరరావు ఆకుల (తిరుపతి)
Next Story