సప్తపదులు
చంద్రయానం
వైనం
శాస్త్రవేత్తల విజయానికి భారతప్రజల హర్ష- నీరాజనం
-పి. యన్.భాను ప్రకాష్
బి హెచ్ ఇ ఎల్ , హైదరాబాద్
xxxxx
2
చంద్రయానం
విజ్ఞానం
దేశ -కీర్తి ప్రతిష్ఠ పెంచిన వైనం
డా చిట్యాల రవీందర్
హైదరాబాద్
xxxxx
౩
చంద్రయానం
జీవనయానం
చూసిన మార్పుల్లో భాగం కావడం
ఘనాతిఘనం
-ఎ.వెంకటరావు
కోకాపేట
xxxxx
4
గలగలా
మిలమిలా
మెరిసిన మణిపూర్ - జాత్యాహంకారంతో విలపిస్తోంది విలవిలా
-వి.విజయకుమార్
హైదరాబాద్
xxxxx
5
నగలు
వగలు
శ్రావణమాసం స్త్రీలకు దక్కితే
మగాళ్లకు - మాత్రం శనగలు!
-యన్.కే.నాగేశ్వరరావు
పెనుగొండ
xxxxx
6
సుధలు
వ్యధలు
జీవన యవనికపై కనిపించీ కనుమరుగయ్యే కథలు!
-పివిబిశ్రీరామమూర్తి
విజయనగరం
xxxxx
7
స్పష్టం
అస్పష్టం
మధ్య భేదము అభేద్యమైతే గమ్యం విస్పష్టం
-రాధకృష్ణ కర్రి
విజయవాడ
xxxxx
8
ఆస
అడియాస
ఒడిదుడుకుల నడుమ సంతులనమే మనిషికి దిలాసా
-కాళీపట్నపు శారద
హైదరాబాద్
xxxxx
9
సన్యాసి
సన్నాసి
అందరిని వదలుకున్నాడొకడైతే
అందరు వదిలేసినోడో నిర్వాసి!
-డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్ నగర్.
xxxxx
10
చుక్కలు
దిక్కులు
ఏకాంత సమయాన అంతరంగాన సృష్టిస్తాయెన్నో చమక్కులు!
-గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
xxxxx
11
దుర్గమ్మ
కృష్ణమ్మ
విజయవాడ నగరానికి అండాదండా అందమూచందమూ మీరేనమ్మ!
-కోపూరి పుష్పా దేవి
విజయవాడ
xxxxx
12
క్షేమం,
క్షామం
జగతిలో సహజం.
ఐకమత్యం పాటిస్తే -సంక్షేమం .
-డాక్టర్ వై వి సుబ్రహ్మణ్యం
సికిందరాబాద్
xxxxx
13
అంతఃకరణ
అనుసరణ
ఉన్నతంగా వుంటే సంఘంలో పొందవచ్చు ఆదరణ
-శాంతమూర్తి
హైదరాబాద్
xxxxx
14
గాధ
బాధ
చెప్పేటప్పుడు ఊకొట్టేవారు ఉంటే తీరిపోదా "వ్యధ"
1కె.వి.లక్ష్మణరావ౧
మానేపల్లి గ్రామం
xxxxx
15
తాటిచెట్టు
ఈతచెట్టు
ఎత్తయినవే అయినా అవి ఇవ్వవు నీడపట్టు
తిరుమల వెంకట స్వామి u
హైదరాబాద్