Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    నవతరం-అంతరం (కథానిక)

    By Telugu GlobalDecember 1, 20227 Mins Read
    నవతరం-అంతరం (కథానిక)
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    “ఫడేల్” ……

    “భళ్ళు” మంటూ అద్దం పగిలిన పెద్ద శబ్దం

    వంటగదిలో పనిలో తలమునకలుగా ఉన్న ఉష, ఆఫీసు గదిలో క్లయింట్ కాల్ లో ఉన్న మృత్యుంజయ్, హాల్లో వీడియో గేం ఆడుకుంటున్న పదేళ్ళ శ్రీశాంత్ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

    “మృత్యూ! ఉషా”! “……ఇలారండిరా! ….. ” .. విజయమ్మ అరిచిన అరుపుకి అదిరిపోతూ ఉష చేతిలో గరిటె సింకులో పడేసి, స్టవ్వు కట్టేసి పరిగెట్టింది.

    మృత్యుంజయ్ స్కైప్ పాజ్ చేసి ఆదరాబాదరా తల్లిగొంతు వినిపించిన వేపు పరుగులాంటి నడకతో చేరాడు.

    అప్పటికే అక్కడకి చేరి నడుంమీద చేతులేసుకుని ఆరిందాలా సమీక్షిస్తున్నాడు శ్రీశాంత్!

    చిందరవందరగా పడున్న అద్దం ముక్కల మధ్య, కోపంగా చేతులో తులసిపూసల తావళం తిప్పుతూ విజయమ్మ, సగం పైగా పగిలిపోయి వికృతంగా నిలబడ్డ వార్డ్ రోబ్ అద్దం, విరబోసుకున్న జుట్టుతో, జేవురించిన మొహంతో, దెయ్యంపట్టిన దానిలా మంచానికి మధ్య కూర్చుని ” త్రిష”… ఉషా, మృత్యుంజయల పదహారేళ్ళ కూతురు.

    నోరుతెరిచి కోపంగా ఏదో అనబోతున్న మృత్యుంజయని మాట్లాడనీయకుండా తనే అందుకుంది విజయమ్మ.

    ” చూడే ఉషా! అసలు నేనేమన్నానని దానికంత కోపం. ఆ వెధవ జట్టుని అలా ఒదులుకోకుండా జడేసుకోమన్నాను. పొద్దున్నుంచీ ఏవేవో క్రీంలు పట్టిస్తోంది జుట్టుకు. మొహం మీద పడేటట్టు ఇంత జుట్టు కత్తిరించింది. బారెడు జుట్టు ఏవో లేయర్స్ అని మూరెడు చేయించింది. రోజుకో షాంపూ, కండీషనర్ మారుస్తుంది. దాని బాత్రూంనిండా జుట్టురంగులూ, క్రీములే. దీని వయసెంత? చదివే చదువేంటి? వేసే వేషాలేంటి? “

    “శుభ్రంగా కుంకుడుకాయలు కొట్టించిస్తా, ఆ క్రీములు కడుగు ముందు”.. అన్నానని నోటికొచ్చినట్టు వాగుతూ, అదిగో ఆ ఇత్తడి ఫ్లవర్ వేజ్ విసిరికొట్టింది.

    బంగారం లాంటి అద్దం ముక్కలు చేసిపెట్టింది. “

    ఆవిడ వాక్ప్రవాహానికి అడ్డేస్తూ ఉష ” ఏంటిది త్రిషా! ఏం పనిది? ఇలాగేనా బిహేవ్ చేసేది?

    బామ్మ నీ మంచికి చెప్తే , దానికంత కోపం తెచ్చుకోవాలా?

    తప్పమ్మా! చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావ్! చిన్నప్పుడెంత వినయంగా ఉండేదానివి.

    ఇప్పుడెందుకంత అగ్రెసివ్ అవుతున్నావో అర్ధం కావడం లేదు.

    ఐ యాం సో డిసప్పోయింటెడ్”….. అంటున్న ఉషని చూసి విజయమ్మ చాలా డిసప్పాయింటయిపోయింది.

    కనీసం సాచిపెట్టి లెంపకాయేనా కొడుతుందంటే , కూర్చుని పిల్లకి నీతిబోధ చేస్తుందేంటి ఈ పిల్ల

    ఆశగా కొడుక్కేసి చూసింది రియాక్షన్ కోసం.

    పరమ సాధుజీవి మృత్యుంజయ. అచ్చం తండ్రిలాగే! ఒకపక్క ఉష అద్దం ముక్కలు శుభ్రం చేస్తుంటే, వాటిలోంచి దాటుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి కూతురి పక్కన కూర్చున్నాడు.

    బామ్మమాటలు వినిపించకుండా చెవులు మూసుకుని, బుర్రొంచుకుని కూర్చున్న కూతుర్ని మెల్లగా ” ఏంట్రా తల్లీ? ఇదంతా” అన్నాడు.

    అంతే చెలియలికట్ట తెగినట్టు ఒక్కసారి భోరుమంది త్రిష.

    వెక్కివెక్కి ఏడుస్తున్న కూతురిని చూసేసరికి గుండె నీరయ్యింది తండ్రికి. అలా తండ్రి భుజంమీద తలవాల్చి ఏడుస్తున్న త్రిషను పొదివిపట్టుకుంది ఉష.

    విజయమ్మకి బీపీ పెరిగిపోతోంది ఈ దృశ్యం చూస్తుంటే.

    ” ఆడపిల్లకి బుద్ధిచెప్పుకోకుండా దానినెలా ఓదారుస్తున్నారో ఇద్దరూ!

    అది ఇలాగే వేషాలేసి దారితప్పితే తెలిసొస్తుంది”….

    పెరిగిపోతున్న కోపంతో విసవిసా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ.

    వెళ్తూ వెళ్తూ , ” నాతో రారా శ్రీ! కధ చెప్తా. కనీసం నువ్వేనా తీరువుగా పెరుగుదువు!” అంటూ మనవడిని కూడా లాక్కుపోయింది.

    ఉష, మృత్యుంజయ్ మొహాలు చూసుకున్నారు నిస్సహాయంగా.

    మొదట్లో అప్పుడప్పుడూ ఉండే బామ్మా, మనవరాళ్ల గొడవలు ఈమధ్య తీవ్రస్థాయికి చేరిపోయాయి.

    ఇదిగో ఈ రోజు మరింత వయలెంటుగా!!

    మృత్యుంజయ్ కూతుర్ని ఏడుపాపి ఫ్రెషప్ అయ్యి రమ్మని చెప్పి, తన పనిలోకి వెళ్ళిపోయాడు.

    ఉషకూడా ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది.

    భోజనాలబల్ల దగ్గర అంతా ముభావంగానే భోజనాలు ముగించారు. ఒక కాన్ఫరెన్స్ కాల్ ముగించుకుని డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు మృత్యుంజయ.

    తల్లిని, ఉషనీ, త్రిషనీ, డ్రాయింగ్ రూంలోకి పిలిచాడు.

    ఎప్పుడూ లేనిది కొడుకు కొంచెం సీరియస్ గా ఉండడం చూసి చిన్న జంకుకలిగింది విజయమ్మకు.

    “అయినా తనేం తప్పు చేసిందని భయపడడానికి. మరీ నిలదీస్తే తనని కాకినాడ పంపేయమని చెప్తా!!

    మరీ కుర్రముండతో అడ్డమయిన మాటలూ పడాల్సొస్తోంది”.. కళ్ళలో నీరూరింది పెద్దామెకి.

    ” బాబోయ్! ఇప్పుడు ప్రవచనం మొదలెడతాడేమో నాన్న!!

    అడగనీ!! నాకేం భయం! ఈ ముసలిది రోజూ చేస్తున్న ఫస్ ..నేనూ చెప్తా”…అనుకుంటోంది త్రిష.

    అమ్మయ్యా! ఇప్పటికయినా ఈయన రంగంలోకి దిగుతున్నారు. ఛస్తున్నా వీళ్ళిద్దరి గొడవల మధ్య.

    బిజినెస్ మీద కాన్ సెంట్రేట్ చెయ్యలేకపోతోంది తను సరిగ్గా!! ఒకరిని సపోర్టు చేస్తే ఇంకోళ్ళకి కోపం.

    అయ్యో! పెద్దామె బామ్మ మంచికే కదా చెప్తోందని గ్రహించే వివేకం దీనికిలేదు. ఏదో కుర్రపిల్ల. చిన్నవయసు సరదాలు. కొన్నాళ్ళుపోతే అదే

    తెలుసుకుంటుందిలే అని ఈయనా అనుకోరూ. మధ్యలో నేను శాండ్ విచ్ అయిపోతున్నా””… ఇది ఉష అంతరంగం.

    అక్కకి నాలుగు పడితే నవ్వుకుందామని రహస్యంగా మనసులో అనుకుంటూ తమ్ముడుగాడు.మొత్తం కుటుంబం అంతా సోఫాల్లో కుదురుకున్నాకా మృత్యుంజయ్ మొదలుపెట్టాడు.

    ” అమ్మా! చిన్నప్పుడు నీ ఒడిలో పెరిగిన త్రిష నీతో ఇంత రెబెల్ లా మాట్లాడడం నాకూ చాలా కష్టంగా ఉంది. నువ్వు నన్నూ, చెల్లినీ ఎంత క్రమశిక్షణతో పెంచావో నాకు తెలుసు.

    ఈరోజు ఒక పెద్దబేంకులో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నానంటే అదంతా నువ్వు వేసిన బాటే.

    కానీ ఆరోజులు కాదుకదమ్మా ఇప్పుడు. వీళ్ళు చదివే ఇంటర్నేషనల్ బళ్ళలో అన్నిరకాల సంస్కృతుల

    వాళ్ళూ ఉంటారు. వీళ్ళంతా ఒకరకంగా మాట్లాడడానికీ,

    డ్రస్సింగ్ కీ అలవాటుపడతారు.

    అందరూ ఇంచుమించు ఒకేలా ఉండడానికి ప్రయత్నిస్తారు.

    ఒకేలాంటి మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, టీవీ షోలు చూడడం చేస్తారు. ఒకళ్ళను చూసి ఒకరు నేర్చుకుంటారు మంచయినా, చెడ్డయినా. వీళ్ళలో ఎవరు తేడాగా ఉన్నా వాళ్ళని కలుపుకోరు. అవమానించరు కానీ దూరం జరిగిపోతారు. ఏ సరదాలయినా ఈ కొన్నిరోజులే. ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్తే వీటన్నిటికీ అంత టైం ఉండదు కూడా వాళ్ళకి.

    ఎందుకు మన కోలనీలో ఒకప్పుడు లక్షణంగా ఉండే ఆడపిల్లలు ఇప్పుడు జుట్లు కత్తిరించుకుని, మోడర్న్ డ్రస్సులేసుకుని ఉండడం లేదా? మళ్ళీ పండగలూ, పబ్బాలొస్తే సాంప్రదాయంగాతయారవుతున్నారు.అన్ని పద్ధతులూ పాటిస్తున్నారు.

    ఇంతలో ఉష అందుకుంది. “అత్తయ్యా! మీరూచదువుకున్నవారే! మీకు తెలీనిదేమీ కాదు ఇదంతా.

    ఈ టీనేజ్ లో వీళ్ళకి ఫ్రెండ్స్ చెప్పింది తప్పా ఇంకేమీ ఎక్కదు. వాళ్ళే ఎప్పుడో పాఠాలు నేర్చుకుంటారు. మనమేం చెప్పినా శత్రువులవ్వడమే తప్ప ప్రయోజనం ఉండదు”…. అంటూ కినుకగా కూతురి కేసి చూసింది ఉష.

    ” అదికాదురా మృత్యూ! ఎవరో అలా ఉన్నారని మనమెందుకు మనపిల్లని అలా ఒదిలేయాలి? చూస్తున్నావుగా రోజులెలా ఏడుస్తున్నాయో! అవ్వకూడనిదేమైనా అయితే అందరూ కట్టకట్టుకుని ఏడవాలి”… కొంచెం కోపంగా, కొంచెం ఆవేదనగా అంది విజయమ్మ.

    ” ఇదే నాన్నా! రాత్రీపగలూ! ఏదో చేసేస్తారూ! ఏదో అయిపోతావు.

    మిలియన్స్ ఆఫ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. అందరికీ ఏమన్నా అయిపోతుందా! అయినా నాన్నా! నేనెక్కడికి పోతున్నాను? మేక్సిమమ్ ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీలకీ, మాల్ కీ, కే ఎఫ్ సీ కీ, క్రీంస్టోన్ కీ అంతే కదా.

    మా క్లాస్ మేట్స్ కొంతమంది పబ్స్ క్కూడా పోతారు. నాకసలు అలాంటి ఇంటరస్టే లేదు. అండ్ మోరోవర్ మా గార్ల్స్ అండ్ బోయ్స్ ఫ్రెండ్లీగా ఉంటాం. వాట్స్ రాంగ్ ఇన్ దట్. !’

    కలిపి చదువుకున్నప్పుడు ఇట్స్ వెరీ కామన్. మొన్న ఆశీశ్ కాల్ చేస్తే ఈవిడ నా మొబయిల్ ఆన్సర్ చేసి, ఎన్ని క్వొశ్చిన్స్ వేసిందోనంట.

    నాకు స్కూల్ లో ఎంత ఇన్ సల్ట్ అయిపోయిందో.

    నా బేగ్ లోంచి మొబైల్ తీస్తుంది.

    మెస్సేజులు చదువుతుంది.

    ఫేస్ బుక్ చెక్ చేస్తుంది.

    ఎవరయినా స్టేటస్ పెడితే దానికేవో అర్ధాలు తీస్తుంది. బామ్మా మీకాలం ఇంగ్లీష్ కాదు అంటే అవన్నీ బూతులంటుంది.

    ఆఖరికి లాక్ పెట్టుకుంటే “….అదిగో ఏదో అఫైర్ వెలగపెడుతున్నావ్ అంటుంది. అమ్మా! నువ్వేచెప్పు. నా రేంక్ లో చేంజ్ ఒచ్చిందా?

    నేను చదువుకుంటున్నా. టెన్నిస్ కెడతా. సంగీతం ఒక్కటే ప్లస్ టూ అని బ్రేక్ తీసుకున్నా. అయినా నేను , కుముదా సాధన చేస్తూనే ఉంటాం.

    ఇంకెలా చచ్చిపోవాలి నేను?

    ఓ గోనెగుడ్డో, బురకానో వేసుకుని, తలకింత ఆవదం పట్టించుకుని, మొహానికింత పసుపు రాసుకునుంటే ఈవిడ శాంతిస్తుంది” కచ్చగా చూస్తూ తండ్రికి తన వాదన వినిపించింది త్రిష.

    ” చూసావురా! ఎంత రెక్ లెస్ గా మాట్లాడుతోందో. ఆ డ్రస్సింగ్ టేబుల్ నిండా ఎన్ని క్రీములూ, సెంట్లు, డియోలు, గోళ్ళరంగులు.

    ఆ బట్టలు చూసావా? చింకి, చీకిపోయిన జీన్సు.ఆ షార్టులు, పొట్టి గవున్లు. పేంట్లు నిండుగా వేసుకోవచ్చు నేనేమీ చుడీదార్లూ, ఓణీలూ వేసుకోమనలేదే”

    ” ఆ…. అవీ వేసుకుంటున్నాగా గుళ్ళకీ, పెళ్ళిళ్ళకూ. అయినా తృప్తిలేదు నీకుబామ్మా! బట్టలు సుఖం ఇవ్వాలి. నేను అందంగా ఉంటాను. నాకు అలా ఉండడం ఇష్టం. రైట్ టు లివ్ అని మనకో హ్యూమన్ రైట్ ఉంది బామ్మా.

    నేను ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా నాకు నచ్చినట్టు బతికే హక్కు నాకుంది. ఏమంటావ్ అమ్మా? “

    ” నోరు ముయ్యమంmఅంటూ షార్ప్ గా బదులిచ్చింది ఉష.

    విజయమ్మకి కోడలులో నచ్చే గుణం అదే. పక్షాలు తీసుకోదు.

    ఎవరిది న్యాయం అనుకుంటే వాళ్ళ పక్షం మాట్లాడుతుంది

    ” అదికాదురా మృత్యూ!……..”

    ” బామ్మా! ఫర్ హెవెన్స్ సేక్ డోంట్ కాల్ మై ఫాదర్ మృత్యు.

    చాలా ఆక్వార్డ్ గా ఉంటోంది.

    జయ్ అని పిలు కావాలంటే”….

    అంత కోపంలోనూ నవ్వొచ్చేసింది ఉషకీ, మృత్యుంజయ కీ.

    ” నాకొడుకు! నా ఇష్టం.

    ఇరవై నాలుగ్గంటలూ ఆ చెవిలో ఇయర్ ఫోన్సూ, గదిలో పెద్ద రొదలాగా మ్యూజిక్ ప్లేయరూను. బుర్రపిచ్చెక్కిపోదురా?

    ” నాన్నా! షీ యీజ్ ఎగ్సాజరేటింగ్. నాకు ఇళయరాజా , రెహమాన్, బాలమురళీ వింటుంటే సూధింగ్ గా ఉంటుంది. చదువు బాగా ఎక్కుతుంది. సమ్ టైమ్స్ వెస్టర్న్ వింటా. డాడీ! దిస్ ఈజ్ ట్రెండ్!! మీకర్ధం కాదూ! “

    మెడచుట్టూ చున్నీ చుట్టుకుని, త్రిష నేలమీద పడుంది. కాలు స్ప్రైన్ అవ్వడంతో లేవలేక కింద పడివుంది.

    దానిమీద పడిపోయిన బల్లమీద బల్ల. మా గుండెలు ఆగిపోయాయి.

    దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి పడుకోపెట్టి,

    అది రాసిన ఉత్తరం తెరిస్తే దాన్నిండా అది పడిన అవమానాలు,

    ముసలమ్మ బట్టలు వేయించిన తండ్రిని ద్వేషిస్తూ ఏవేవో……”

    ఉష ఏడుస్తున్నట్టుంది . మాట్లాడలేకపోతోంది.

    విజయమ్మ గద్గద స్వరాన “ఉషా “”ఉషా” అని పిలుస్తోంది.

    కొన్ని క్షణాలకు తెప్పరిల్లిన ఉష కొనసాగించింది.

    ” అప్పుడే ఇద్దరం

    నిశ్చయించుకున్నాం.

    తనకెలా ఉండాలని ఇష్టమో అలానే ఉండనివ్వాలని. ఆ భరోసాయే తనకిచ్చాము. కానీ అది ఆధునికత ఇష్టం పడుతుందేమో కానీ తన బాధ్యతలు మరిచిపోవడం లేదు.

    బాగా సంగీతం నేర్చుకుంటోంది.

    ఫస్ట్ రేంక్ లో ఉంటుంది.

    అందుకే అత్తయ్య! ఆ పిల్లని గాజుబొమ్మలా కాపాడుతాం.

    ఆ బల్లలు కిందపడకపోతే అది మనకి దక్కేది కాదు.

    మరోమాట అత్తయ్యా! నేను, తను త్రిషను బాధ్యత లేకుండా ఒదిలేయట్లేదు. అది ఎప్పుడు పార్టీకెళ్ళినా నేనో, ఆయనో కొంతదూరంలో కారాపుకుని కూర్చుంటాం అది ఒచ్చే వరకూ.

    మధ్యమధ్యలో ఫోనులు చేస్తూ.

    దానిని వేరే స్నేహితులు దింపినా దాన్నే ఫాలో అవుతూ!

    ఇంత అవసరమా? పిల్లను కట్టడిగా పెంచితే చాలు కదా అనుకోచ్చు మీరు. కానీ మాకూ తెలీదత్తయ్యా పిల్లల్ని ఎలాగ పెంచాలో.

    వాళ్ళకెలాగిష్టమో అలా పెరిగిపోతున్నారు. కావలసినవి ఇచ్చేస్తున్నాం. మేము ఏ తరంలో ఇమడలేని పేరెంట్స్ మి.”

    ఉష ఫోన్ కట్ చేసేసింది.

    త్రిష భవిష్యత్ ఎలా ఉందో చూడాలనుందా. సరే ఛలో అమెరికా!!!!

    <><><><><>

    వీల్ చైర్లో కూర్చుని మహారాణిలా , కోడలితో పాటూ అమెరికాలో దిగిన ఢెభ్భై అయిదేళ్ళ బామ్మగారిని ఆప్యాయంగా కావలించుకుని, కార్లో భర్తతో పాటూ తన ఇంటికి తెచ్చింది పాతికేళ్ళ త్రిష.

    నీలం జీన్స్ మీద పొడుగాటి కుర్తీ, దానిమీద లేయరింగ్ గా రెండు చొక్కాలూ, మెడకో స్టోలు, చిన్న నల్లబొట్టు, ,బేండుతో బంధించిన కురులు.

    ఇల్లంతా అద్దంలా మెరిసిపోతూ. చక్కటి పాలరాయి వినాయకుడికి రంగురంగుల గులాబీలు, చిన్న దీపం. పేషియోలో తులసిమొక్క. టేబిల్ మీద ఘుమఘుమలాడుతూ అందంగా పేర్చిన వంటకాలు.

    గర్వంగా మనవరాలికేసి చూసుకుంటూ కోడలి చేయి ప్రేమగా నొక్కింది విజయమ్మ.

    “మీ కోసం మూడువారాలు సెలవు పెట్టేసానమ్మా”…అంటూ తల్లితో చెప్పి, ” నీ దిష్టే తగిలింది బామ్మా! ఈ చలిదేశంలో ఇన్నిబట్టలేసుకుని తిరగాల్సి ఒస్తోంది”.

    పకపకా నవ్వింది త్రిష.

    శృతికలిపాడు ఆమెజీవిత సహచరుడు.

    – వోలేటి శశికళ

    Telugu Kathalu Telugu Poets
    Previous Article#జీవితం
    Next Article రెండు హిట్లతో సక్సెస్ ట్రాక్‌లోకి బాలీవుడ్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.