Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    తెలుగుకవితాసరోవర స్వర్ణహంస శేషేంద్ర

    By Telugu GlobalMay 30, 20233 Mins Read
    తెలుగుకవితాసరోవర స్వర్ణహంస శేషేంద్ర
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ

    1927 అక్టోబర్ 27నపుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. తండ్రి సుబ్రహ్మణ్య శర్మ .తల్లి అమ్మాయమ్మ .గుంటూరు శేషేంద్రశర్మ గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీపొందారు. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

    శేషేంద్ర శర్మ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన – రెండింటిలో సమాన ప్రతిభావంతులు. ప్రపంచ సాహిత్యం మీద,భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయంవున్న శేషేంద్ర వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు .ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి. “నా దేశం-నా ప్రజలు” 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.

    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు. నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.

    బంధుమిత్రులకు శేషేంద్ర వైవాహేతర సంబంధాలగురించి మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కుటుంబీకుడు. తన పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించే వాడు. ఎన్ని సమస్యలతో సతమతం ఔతున్నా పిల్లల్ని, మనవళ్ళని, మనమరాళ్ళని చూస్తే ఆయన్ని ఎక్కడలేని సంతోషం ఆవహించేది .

    ఆగస్టు 2021 లో గుంటూరు వనమాలి, శేషేంద్ర శర్మ పెద్ద కొడుకు, రాసిన పుస్తకం “శేషేంద్ర వెలుగు నీడల్లో – నాన్నతో నా అనుభవాలు” ఎమెస్కోలో ప్రచురించ బడింది. వనమాలి ఈ పుస్తకంలో తన తండ్రి అసమాన ప్రతిభను, ఆయన అందాన్ని, ఆయన జీవితంలోని ముఖ్యమైన, బాహ్య ప్రపంచానికి ఇప్పటి వరుకూ తెలీని సంఘటనల్నీ, బాల్యంనుంచి మరణం వరకు జరిగిన జీవన పరిణామకథని, అధికార వర్గంతో నిర్విరామంగా జరిగిన పోరాటాన్ని ఒక నవల రూపంలో రాయడమే కాక భార్య జానకి దాంపత్యంలో అనుభవించిన ఆఘాయిత్యాల్ని, ఆమెకి జరిగిన అన్యాయాన్ని కూడా వివరించారు

    “నాదొక చిత్రమైన జీవితం”, అనేవారు శేషేంద్ర తరచుగా. ఆయన ప్రతిభవల్ల సమ్మోహితులైన అభిమానులు, అదేకారణంచేత అధికారవర్గాలలో పుట్టుకొచ్చిన శత్రువులు – ఈ రెండు ధ్రువాల మధ్య ఈ కవి జీవితం గడిచింది. 1968 విశ్వసాహితి నిర్వహించిన కవితాగో ష్ఠులలో శేషేంద్ర శర్మ, ఇందిరాదేవి ధనరాజ్ గిర్ల మధ్య ఏర్పడ్డ పరిచయం, ప్రణయంగా మారింది. ఇద్దరు సం. 1970 హళేబీడులో బంధుమిత్రులసమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకున్నారు. పరిచయం తొలిదశలో ఇద్దరూకలిసి రచించిన వ్యాసాలని, సాహిత్యవిశ్లేషణల్ని జంటగా సభాసదులకు వినిపించేవారు. అనతికాలంలో ఇందిరాదేవి స్వాభిలాషని పక్కకి నెట్టి తన శక్తిసామర్థ్యాలని పూర్తిగా శేషేంద్ర గ్రంథప్రచురణలకు ధారపోసింది, “ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరం“ అనే ప్రచురణసంస్థని స్థాపించి భారీ ధనవ్యయంతో నిర్విరామంగా శేషేంద్ర గ్రంథాలని అన్నిటినీ ఇంగ్లీష్ తర్జుమాసహితంగా ప్రచురించుటయే గాక, ఇతగాడి కుటుంబభాధ్యతలను అన్నింటినీ తనవిగా పరిగణించింది .ఆమె పడ్డ శ్రమ వల్లనే శేషేంద్ర రచనలు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయబడ్డాయి .కానీ శేషేంద్ర మరణానంతరం శేషేంద్ర చిన్నకొడుకు సాత్యకికీ కోర్టువారు ఇచ్చిన తీర్మానం వల్ల శేషేంద్రశర్మ గ్రంధాలమీది ప్రచురణ హక్కులు లభించాయి.

    శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశారు.ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. అది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాట.

    శేషేంద్ర 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించాడు. శేషేంద్రకు ఇద్దరు కుమారులు(వనమాలి ,సాత్యకి ),ఇద్దరు కుమార్తెలు(వసుంధర,రేవతి) ఉన్నారు.తెలుగు సాహిత్యప్రపంచంలో ,అందునా కవిత్వ రంగంలో శేషేంద్ర ముద్ర శాశ్వతమైనది.ఈ 2023 మే 30మంగళవారం గుంటూరు శేషేంద్రశర్మ 16 వ వర్థంతి .వారికి స్మరణీయ నివాళులు .

    seshendra sharma Telugu Kavithalu
    Previous Articleవేగస్ నరం బాగా పనిచేస్తే… ఎన్నో ఆరోగ్యలాభాలు
    Next Article పువ్వెడు వసంతం కోసం (కవిత)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.