ఇంగితజ్ఞానం
ఇంగితజ్ఞానం (common sense) అంటే ఏమిటి?
ఇంగితజ్ఞానం గురించి చెబుతూ 'భక్తుడివైనంత మాత్రాన మూర్ఖుడివి కాకూడదు' అని అంటారు
శ్రీరామకృష్ణులు.
ఒకశిష్యుడు బజారుకు వెళ్ళి మూకుడు ఒకటి కొనుక్కొస్తాడు.దానికి పగులు ఉండడం చూసిన శ్రీరామకృష్ణులు శిష్యునికిచీవాట్లు పెడతారు. అప్పుడు ఆ శిష్యుడు 'దుకాణం యజమాని
నామాలు పెట్టుకుని కూర్చున్నాడు. అందువల్ల అతడు భక్తుడనుకున్నాను. కానీ అతడు మోసం చేస్తాడనుకోలేదు'
అని సమాధానం చెప్పాడు.
ఎవరయినా మననుంచి కోరుకునేది ‘ఇంగితజ్ఞానం'.ఈ కాలంలో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మాటలు వింటున్నాం.
సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటని ఒకతణ్ణి అడిగితే 'గుడ్ మార్నింగ్, థాంక్యూ' అని చెప్పడం అన్నాడు.
'మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు కూర్చోమనాలి...పెద్దల ఎదుట కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు...’
అని అమ్మ మనకు చెప్పేది. కానీ ఈ రోజుల్లో వీటినినేర్చుకోవడం కోసం సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఇంట్లో తల్లితండ్రులు ఇంగితజ్ఞానం గురించి పిల్లలకు చెప్పకపోవడమే!
అయితే మనం పిల్లలకు 'ఎప్పుడూ నిజం చెప్పాలి' అనిచెబుతాం. కానీ నిజం చెప్పకపోతే కలిగే నష్టాలేమిటి, చెబితేవచ్చే లాభాలేంటి అన్న విషయం వారికి వివరించం. 'అందరూఎలా ఉండాలో చెబుతారు, ఏం చేయాలో చెబుతారు కానీ ఎందుకు చెయ్యాలో చెప్పరు' అని అంటారు స్వామివివేకానంద.
ఇంగితజ్ఞానంలో అనేక అంశాలు ఉన్నాయి. అందులో'ప్రేమ' అనే విషయాన్ని గురించి చూద్దాం :
తరగతి గదిలో ఒక విద్యార్థిని ఉపాధ్యాయురాల్ని 'ప్రేమ'అంటే ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు అందుకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించి
పిల్లలందర్నీ బయటకు వెళ్ళి మీకు ప్రేమను కలిగించేదేదో దాన్ని తీసుకు రమ్మని చెప్పింది.
విద్యార్థులు ఒక్కొక్కరు తమకు నచ్చిన పువ్వులూ, వస్తువులు తీసుకొని వచ్చారు. "టీచర్. నాకు ఈ గులాబీ పువ్వు అంటే ఎంతో ఇష్టం" అని ఒకరు, నాకు"ఫలానా పక్షి అంటే ఇష్టం" అని మరొకరు ఇలా విద్యార్థులందరూ తమకు ఇష్టమైన వాటి గురించి చెప్పసాగారు.
అందులో ఒక విద్యార్థిని మాత్రం ఏమీతీసుకురాలేదు,మాట్లాడకుండా కూర్చుంది. అప్పుడు టీచర్ ఆ విద్యార్థినిని'నువ్వు ఏమీ తీసుకురాలేదా, నీలో ప్రేమను కలిగించినవస్తువేదీ లేదా’ అని అడిగింది.
అప్పుడు ఆ అమ్మాయి "టీచర్!నేను ఒక పువ్వును చూశాను. అది చాలా అందంగా ఉంది.ఎంతో సువాసన వెదజల్లుతోంది. కానీ దాన్ని కొమ్మ నుంచి తుంచితే దాన్నుంచి నేను మాత్రమే ఆనందాన్ని పొందగలను. మిగతా ఎవరూ కూడా ఆ పువ్వు అందాన్ని చూడలేరు, దాని సువాసనను ఆస్వాదించలేరు కదా! అందుకని నేను తీసుకురాలేదు”.
"తరువాత ఒక పక్షి పిల్లను చెట్టు కింద చూశాను. దాన్నితీసుకువద్దామని వెళ్ళేసరికి కొమ్మమీద తల్లి పక్షి దీనంగాచూస్తూ కనబడింది. అప్పుడు ఆ పక్షిపిల్లను అక్కడే వదిలివస్తుంటే ఆ పక్షి నావైపు ఎంతో ఆదరంతో చూసింది. ఆ పక్షి ఆనందాన్ని చూసినప్పుడు నాలో ఎంతో ఆనందం కలిగింది. కానీ ఆ ఆనందాన్ని మీకు ఇవ్వలేను కదా, దాన్ని చూపించలేనుకదా" అని అన్నది.
ప్రేమ అనేది ఒక అనుభూతి. మనంఇతరులనుప్రేమించినప్పుడే దాని విలువ తెలుస్తుంది.ఈ ప్రేమ అనే సాఫ్ట్వేర్ను మన హృదయాల్లో
నెలకొల్పినప్పుడేఇంగితజ్ఞానంతో వ్యవహరించగలం. అప్పుడే ఏ పనిలోనైనా నైపుణ్యాన్ని సాధించ గలం.