మాటల మంచె మీద నిలబడి
పాటను వడిసెల రాయిని చేసి
జనం హక్కుల పంటను కాపాడిన వాడా!
………..
విలుకాడా!
నీ వింటికి నారి నౌతాను
పాటకాడా!
నీ తెల్లని ముతక పంచెకు
ఎర్రె ర్రని అంచు నౌతాను
ఆటగాడా!
కదం తొక్కే నీ
కాలి గజ్జెల్లో
ఒక చిరు మువ్వ నౌతాను
…………
ప్రజాకవి
మహా వాగ్గేయకారుడు
గద్దర్ అమర్ రహే !
– శిఖామణి