రోడ్డు (కవిత)
ఈరోడ్డుఎక్క డికిపోతుంది?
ఏమో! ఎక్క డికి పోదు ..
ఇక్క డే వుంటుంది..
నేను పుట్టినప్పటినుంచి
చూస్తూనే ఉన్నా ను..
ఇక్క డే ఉుంది..
ఎండకు ఎo డి వానకు తడిసి
చలికి బీటలు పడుతుంది..!
పాపo !
ఎన్నా రక్తపు మడుగులు చూసిుంది
మరెన్నో సమ్మె లు లూటీలు కాచింది అనాధ ఆడబిడ్డల ప్రసవాలకి
ఆసరాగా నిలిచిుంది..
ఏదిక్కూ లేని జీవచ్ఛవాలకు
ఆశ్రయాన్నిచ్చింది
అంతే మరి !
మoచికి ఎన్నడూ గుర్తింపువుండదుగా..
ఇంతచేస్తూ వున్న
తనమీదపోతున్న
లారీలు బస్సు ల ఆటుపోట్లకి
తట్టుకుంటుంది
కష్టాల కొలిమిలో
కాలి పోతూనే వుంటుంది.
అయిదేళ్లకొక్కసారి
నాయకులు మారుతున్నా
పదేళ్ళకయినా
కొత్తబట్టలు పెట్టరు -రోడ్డు వేయరు. గతకుల బతకులకి
ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన
రోడ్డు నెవడూ పట్టించుకోడు
మౌనo గా వుంటూ
మహర్షిని తలపిస్తుంది
త్యాగనిరతి కలిగి
గమ్యాలను చేరుస్తుంది
అoదుకే అది రోడ్డు కాదు..
అనాధల బెడ్డు అoటాను.
వెరీ వెరీ గుడ్ అనుకుం టాను
- శరత్ చంద్ర (కృష్ణ పోట్లచెరువు)