స్ఫూర్తి ప్రదాత
మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు.ఇంట్లో అందరం బాబ్జీ అని పిలిచేవాళ్ళం.నాకన్నా నాలుగేళ్లు పెద్దవాడు.ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వలన బంధువులు దయాదాక్షిణ్యాలతో చదువుకోవటం ఇష్టం లేక AU లో రెండవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువు వదులుకొని సెకెండరీగ్రేడ్ ట్రైనింగ్ లో చేరిపోయి 19 ఏట టీచరుగా ఉద్యోగం మొదలెట్టాడు.
1965 నుండీ 1985 వరకూ వందకి పైగా కథలు అన్ని పత్రికల్లోనూ ప్రచురితం అయ్యాయి.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడు.
నాకు సాహిత్యం పట్ల అభిరుచి కలగటానికి బాబ్జీ కూడా కారణం.అతని ప్రభావం నేను జీవనవిధానం లోనూ, ఉద్యోగ జీవితం లోనూ ఎక్కువ గా అనుసరించాను.
ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒకరి చేతికింద చేయి చాపకుండా ఉండటం మొదటినుంచీ పాటించాను.
ఉద్యోగంలో స్వీయ క్రమశిక్షణ, సమయపాలనా పాటించటం.ఉపాధ్యాయుడు తానే ఆలస్యంగా వెళ్తే విద్యార్ధిని గద్దించే హక్కు లేదనేది,అన్నయ్య నుండే నేర్చుకున్నాను.ఆ విధంగా నా ఇరవై అయిదేళ్ళ సర్వీస్ లో లేటు రిజిస్టర్ లో సంతకం చేసే అవసరం రాకుండా ఉద్యోగం చేసాను.
ఏదైనా పరిస్థితుల్లో ఆలస్యం ఐతే అర్థం పూట సెలవు పెట్టి క్లాసులు తీసుకునేదాన్ని.
చిన్నన్నయ్య నిబద్ధత గల రచయితే కాక నిబద్ధత గల ఉపాధ్యాయుడుకూడా అతను నాకెప్పుడూ స్పూర్తి ప్రదాత.రాఖీ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుని నివాళి అర్పిస్తున్నాను.
-శీలా సుభద్రాదేవి