ఎదురు తిరిగితే సెడిషన్
మిన్నకుంటే పెర్డిషన్
దాడులకీ ఆగని ఎడిషన్
ఇదీ నేటి పొలిటికల్ మిషన్ …
విద్యా కేంద్రాలు విహ్వలలవుతున్నా
అధికార కేంద్రాలు ప్రజ్వలలవుతున్నా
నిర్జించే విద్యార్థులు
గర్జించే వజ్రాయుధులై
పశ్నిస్తే దేశద్రోహం …
పెల్లుబికిన ధర్మాగ్రహం …
అన్నిటికీ స్పందించే ఢిల్లీ
ఎన్నటికీ తోడుండే తల్లి
మూడు కళ్ళు లేని
పోరాట యోధులు ఎలుగెత్తితే
ఆరాట నాథులు అగరొతొత్తులూదితే
ప్రజాస్వామ్యం కొద్ది సేపు ఒణికింది
గణతంత్రం ఘన తంత్రం వినిపించింది …
చదువుల నెలవులు
ఇలా ఉండనివ్వండని
నిర్దయులను వేడుకోడం మానేశాయ్
దుర్దినాలతో ఆడుకోడం మొదలెట్టాయ్
– సాయి శేఖర్