శ్రీ రంగ నీతి - విదుర స్మృతి
కుడి కన్నదిరితే అదృష్టమేదో
పొద్దున్నే తలుపుతడుతుందేమో
అని తలపుల తలుపులు తెరిచినా
ఏమీ గోచరించలేదు
దృష్టము కానిది అదృష్టం అని
ఆయనెవరో
గోపాలం గారు చెప్పినట్టు గుర్తు ...
క్యూంకీ ...
ఏ అదృష్టమూ నా పిలుపునందుకోలేదని తెలిసిపోయింది ...
కాసేపటికే
ఎడం కన్ను అదిరితే
ఏదన్నా అపశకునమేమో అని
భయం తో ఒణికి పోయా
క్షణకాలం మాత్రమే
క్యూంకీ ???
కష్టం నష్టం
చెడూ కీడూ
అలవాటైన ప్రాణాలే
నా సర్కిల్ లో అందరివీ
అంతలోనే పెద్దబాలశిక్ష లో
బల్లి పాటుకు ఫలములూ
శకునాలు
గుర్తొచ్చి అప్రయత్నంగానే
చిన్న నవ్వొచ్చి భయాన్ని తోలేసింది ...
కొలువుకొచ్చి నిన్ను కొలవలేదని
కొరవున్న నీలాంటి
కొరివి దెయ్యాలతో నాకు
పని లేదు ...
క్యూంకీ ...
కొలవడానికి
దర్జీ గారి మెడలోనో
మేస్త్రి గారి చేతిలోనో
ఉన్న కొలబద్దనీ
శెట్టిగారి కొట్లో ఉన్న
త్రాసునీ కాను ...
నా వ్రాత బాగుందా లేదో
కొలిచే భారమితివి
నువ్వు కావని
నా రాత ఎలా ఉండాలో నిర్దేశించే
విధాతవీ నువ్వు కావని
అప్పులిప్పించే తాబేదారువి
నీకేం తెలుసు
కొలువు కొలమానం ఏంటో ...
అయినా నువ్వో పుడింగివి
క్యూంకీ ...
తుం భీ ఏక్ ధన్వాన్ థే ...
నీకు ఎదుటి వాళ్ళ
ఎక్స్పీరియన్స్ ని
గౌరవించడం అస్సలు రాదేమో
గానీ
నీ పాత తుప్పు పట్టిన డబ్బా మీద
దబా దబా బాదితే వచ్చే
రోత పుట్టించే మోతల మీద
నువ్వు పవర్ పాయింట్ వాడి
కోసే కోతలమీదా
ప్రేమ ఏ మాత్రం తగ్గని
నార్సిసిస్ట్ వి నువ్వని
తేలిపోయింది
బియాండ్ ఎనీ డౌట్
క్యూంకీ ...
నీ ప్రపంచంలో ఉన్నది
నువ్వు మాత్రమే ...
నీకు తెలియందేంటంటే
యు ఆర్ ఎ లోనర్
నీకెవ్వరూ తోడు లేరూ ...రారూ...
రోహిత్, కన్ణయ్య
నగరాల నరాల్లో
జవ జీవాలు నింపారు
నువ్వు న్యూస్ చానెళ్ళ మదిలో
మధుర-స్మృతి గా మిగలాలని
గుక్క తిప్పుకోకుండా
అనర్గళంగా చేసిన షో
అస్కార భాస్కరం లా మెరిసి
మిరుమిట్లు గొలిపింది
అమర్ ఒకటో కృస్ణుడిగా వచ్చినా
రోణిత్ మూడో కృష్ణుడైనా
అక్కడ ఫ్లూట్ వాయించిన
ఠాకూర్జీ ఎవరో మాకు తెలుసు
క్యూంకీ ...
ఆంతర్యం అర్ణవమైతే
ఆవేశం అంబరమైతే
అర్ణవ్ అప్పుడే అక్కరకొస్తాడు
రాహుల్ రాహువు
నోట్లో చిక్కుతాడు ....
నీకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలూ పాటలూ సంగీతం
అస్సలక్కర్లేదని ఆ డబ్బా చూసే
మా ఇడియట్స్ అందరికీ తెలుసు
క్యూంకీ...
శంకర శాస్త్రి గారు అప్పుడెప్పుడో
మాధవా అని ముద్దుగా పిలిచే
రామలింగయ్య గారికి చెప్పినట్టూ ...
తులసీ తులస్ మొక్కంత
పవిత్రురాలురా, మాధవా !!!
కానీ అది 'వాడే'
ముందు వరకే
అని ఆయనకప్పుడు తెలీదు
ఈయనకిప్పుడు తెలియక్కర్కేదు
- సాయి శేఖర్