Telugu Global
Arts & Literature

శాంతి

శాంతి
X

చీకట్లో నిద్రిస్తున్న

చిన్నారి పువ్వు ఎదలో

దాక్కున్న పరిమళం శాంతి!

గానం లో ఘనీభవించి

కనిపించక, వినిపించే

కన్నీటి చుక్క శాంతి

అనంత శూన్య సముద్రంలో

రాత్రి విసిరిన

చీకటి చుక్కలవల శాంతి!

తీక్షణ సూర్య తాపాన్ని

పడగట్టి వెన్నెల సారాన్ని

భూమికిచ్చే

చంద్రుడు శాంతి!

-సౌభాగ్య

First Published:  1 March 2023 12:55 PM IST
Next Story