కాటుక లేని
నా…. కళ్ళు
కలువ కళ్ళు కావు
మీనాక్షిని ….
అంతకన్నాకాదు !
కలలు రాని కళ్ళు ….
ఈ కనుల….
కనుపాపలు
తడిసే…..
కన్నీటి సంద్రంలో….
కాలానికి ఎదురీదే
పనిలో…..
కదల లేక….
చూస్తున్నాయి….
శూన్యం వైపు….
ఈ నిశీధి రాతిరిని….
దాటి …..
రేపటి వెలుగుల
ఉదయం కోసం…..
ఎప్పుడెప్పుడాఅని
ఎదురుచూస్తున్నాయి..
నా కళ్ళు…!!
-సరళ శ్రీ లిఖిత ( లిక్కి )