'సప్తపదులు'
మడి
తడి
అంటుంటే మరి దాటలేవు అస్పృశ్యపు దడి
- ఆర్ .వి.శామ్యూల్ (మెదక్ )
.*************
ఎండాకాలం
వర్షాకాలం
ఎంతకాలం ఉంటాయో తెలియట్లేదు ఈ కలికాలం
-బాలసుబ్రహ్మణ్యం మోదుగ
(గుంటూరు)
************
సెల్లు
సొల్లు
జీవితంలో ఆనందాల్ని,అనుబంధాల్ని చేస్తాయి నిల్లు.
- యార్లగడ్డ శ్రీరంగలక్ష్మి,
(విజయవాడ-8)
***************
బడి
గుడి
ఉన్న ఊరిలో ఎంతో సందడే సందడి
- ఎమ్.హేమలత
(విశాఖపట్టణం)
****************
నమస్కారం
సంస్కారం
ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ సహృదయ సత్కారం
-గుండాన జోగారావు
(సింహాచలం)
**************
స్వార్థం
అనర్థం
పరోపకారమే కావాలి మనిషి జీవితానికి పరమార్థం!
- సి.హెచ్.బృందావన రావు
(అహమ్మదాబాద్)
**************
కూడు
గూడు
లేని బడుగు జీవులకు తప్పదు గోడు
-తెలికిచెర్ల విజయలక్ష్మి
(హైదరాబాద్)
************
తమస్సు
మనస్సు
నీ లోలోపలికి చొచ్చుకుపో
దొరుకుతుంది తేజస్సు.
-ఆసు కవిత
( హైదరాబాదు)
**************
నిప్పు
ఉప్పు
కలిసినట్టున్న దాంపత్యం అందరికీ ఆసాంతం పెనుముప్పు
- శాంతమూర్తి
(హైదరాబాద్)
**************
సప్తపది
జీవనమది
ఏడు - పదాలు కలిసి నడయాడే సుధామధురమది
- ఆకెళ్ళ
సూర్యనారాయణ మూర్తి
(హైదరాబాద్)