Telugu Global
Arts & Literature

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం!!

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం!!
X

ముద్దుగుమ్మా! వయ్యారి భామా!

సంక్రాంతి లక్ష్మీ! రావమ్మా!

మా సంక్రాంతి లక్ష్మీ! రావమ్మా! "ముద్దుగుమ్మా"

రంగవల్లులు దీర్చిన ముంగిలి

సస్యలక్ష్మీ శోభల దీప్తీ!

కొత్త కోడలు అందెల రవళీ!

స్వాగతాలే నీకు తల్లీ!

ఆహ్వానాలే అమృతవల్లీ!! "ముద్దుగుమ్మా"

ముద్దబంతీ పూవుల బరచీ

గొబ్బెమ్మల తమ ముంగిట నిలిపీ

పరికిణి వోణీ కృష్ణ వేణులతో

కలువ కన్నులా మధురోహలతో.............ఓ ఓ ఓ…

ఒప్పుల కుప్పలు తెలుగు పడుచులూ

సంక్రాంతి లక్ష్మీ రావమ్మా యని

స్వాగత గీతిక లాలపింపగా! "ముద్దుగుమ్మా"

వీధి వాడల

హరి కీర్తనలూ ....కృష్ణార్పణం!...

గంగిరెద్దుల బసవన్నల సడి!

పాడిపంటల సిరి సంపదలా

తెలుగు నాడు నీ పుట్టినిల్లుగదె? "ముద్దుగుమ్మా"

( గీతం )

రచన: డా. మురళీ కృష్ణ

అహోబిల వఝ్ఝల

First Published:  14 Jan 2023 9:35 PM IST
Next Story