Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    వాగ్ధోరణే పరిణామ హేతువు

    By Telugu GlobalFebruary 22, 20233 Mins Read
    వాగ్ధోరణే పరిణామ హేతువు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులు అవుతారు.

    అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు. సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు.

    ‘ఎందుకిలా జరుగుతోంది’అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని.

    మాట్లాడడం అనేది జీవన కళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు – అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవసంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నయి.‘వాగ్ఘి సర్వస్వ కార్యణమ్’ అంటోంది శాస్త్రం.

    ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్లో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు. వాక్కు మన సంస్కారాన్ని చాటి చెబుతుంది.

    వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఆదినుండి వాక్సంస్కారంపై ఎన్నో మంచి విషయాలను పేర్కొన్నారు .

    ‘వాగ్విదాం వరః’, ‘వాక్య కోవిదః’, ‘మృదుభాషీ’, ‘మధురభాషీ’, ‘పూర్వభాషీ’, ‘స్మితభాషీ’, అంటూ ఉత్తమ వాగ్లక్షణాలను చక్కగా తెలియజేశారు.

    మాటలో స్పష్టత, నిష్కపటత్వం ప్రధానం. ఒక్కొక్కసారి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, మాట్లాడడం మన స్వభావం అని గొప్పగా చెప్పుకుంటూంటాం. కానీ అవతలివారు అదే నిక్కచ్చితనం మనపట్ల చూపిస్తే సహించగలమా?

    బాధించే విధంగా సత్యాన్ని కూడా పలుకరాదు. ప్రయోజనం ప్రధానం. అలాగని అబద్ధం చెప్పనవసరం లేదు. నిజం చెబితే ప్రమాదమనే చోట తటస్థవైఖరి క్షేమం.

    మాట్లాడే నైపుణ్యం గురించి మన శాస్త్రాల ఆధారంగా గమనిస్తే ఈ పేర్కొన్న విషయాలు స్పష్టమౌతాయి.

    *మాట అవతలి వారికి ఉద్వేగం కలిగించకూడదు.

    *అవతలి వారి పేరును పలికి సంభాషిస్తే, వారికి ఆదరంగా వుంటుంది.

    *మనమే ముందు మాట కలపడం స్నేహానికి, కార్యసాఫల్యానికి ముఖ్యం.

    *ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడడం ‘మధుర’వాక్కు అనిపించుకుంటుంది.

    *కసిరికొట్టినట్లుగాను, వెకిలితనంతోను మాట్లాడడం శత్రువులను పెంచుతుంది.

    *అతి సంక్షిప్తమూ, అతి విస్తారమూ – రెండూ పనికిరావు.

    *ఉచ్చారణ తేటగా ఉండాలి.

    *చిరునవ్వుతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం అవతలి వారిని వినేటట్లు చేస్తుంది.

    *వడివడిగా పలకడం, అతి నెమ్మదిగా నాన్చడం – రెండూ రాణించవు.

    *సద్గ్రంథపఠనం, మంత్రజపం, మౌనం – ఇవి మాటకి శక్తినిస్తాయి.

    *ఎప్పుడూ సకారాత్మకంగా (Positive) మాట్లాడడం శ్రేష్ఠం.

    *మన గురించి మనమే ప్రశంసించుకుంటూనో, అలాగని అతి వినయంతో హీనపరుచుకుంటూనో మాట్లాడడం నిరాదరణకు గురి చేస్తుంది.

    *ఒక విషయంపై మాట్లాడేటప్పుడు దానిపై అవగాహన కలిగి ప్రారంభించాలి.

    *తక్కువ సమయంలో విషయాన్ని స్పష్టంగా, సానుకూలంగా చెప్పగలిగే రీతిని అలవరచుకోవాలి.

    *ప్రతికూల పరిస్థితుల్లో భీతి, ఉద్వేగం, శత్రుత్వం లాంటివి మాటల్లో ప్రకటిస్తే అది ప్రమాదహేతువౌతుంది. మనం దుర్బలత్వాన్ని చూపిస్తే, అది ఎదుటివాడిలో తెగింపును పెంచుతుంది.

    *అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం – రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.

    *ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.

    *శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూరవాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం – అంటోంది మహాభారతం. గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.

    *మనసా, వాచా, కర్మణా – ఈ త్రికరణాలలో రెండవదైన ‘వాక్కు’ అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట. శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో సుప్రసిద్ధం.

    *మాటల్లో సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.

    ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా ‘ఒరేయ్’, ‘ఏమిరా’ అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.

    అదేవిధంగా – కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ, వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.

    ఎంత దగ్గరివారినైనా సవరించదలచుకుంటే ఏకాంతంలో మృదువుగా చెప్పాలి గానీ, “నీ మేలుకోరి చెబుతున్నాను” అంటూ పదిమందిలో విమర్శించడం, మందలించడం తగదు.

    తీవ్రమైన కోపం, అసహనం కలిగినప్పుడు హఠాత్తుగా అనుచిత కఠినభాషణ రావడం సహజం.

    కానీ అటువంటి ఉద్వేగాలు కలిగినప్పుడు నిగ్రహించుకొని మౌనాన్ని వహించడమో, ఆ సంఘటననుండి దూరంగా వెళ్ళడమో మంచిది.

    (ఈ విషయాలు గుర్తుంచుకుని ఆచరిస్తే ‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంద’న్న సామెత ఎంత యదార్థమో తెలుస్తుంది .’మౌనేన కలహం నాస్తి’ అని కూడా గుర్తుంచుకోవాలి )

    -సామవేదం షణ్ముఖ శర్మ

    Samavedam Shanmukha Sarma
    Previous Articleసౌందర్య వేదాంతం
    Next Article I-T ‘సర్వే’ తర్వాత BBC కి మద్దతుగా నిల్చిన బ్రిటిష్ ప్రభుత్వం
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.