Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    రేపటికోసం

    By Telugu GlobalNovember 28, 20224 Mins Read
    రేపటికోసం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆరోజు

    శాంతించిన వరుణుడు..

    మండుతున్న భాస్కరుడు

    ఉక్కపోత వాతావరణ సమయాన

    కానిస్టేబుల్స్ వచ్చి రాజుని స్టేషనుకు తీసుకెళ్ళారనితెలిసింది. వెంటనే నాలుగు కిలోమీటర్ల దూరమున్న పోలీస్ స్టేషనుకొచ్చాడు స్కూల్ హెడ్ మాస్టర్ సుందరరావు.

    “భయపడకుండా చెప్పమ్మా, ఇతనేనా” నిర్ధారణకోసం జరిగాడు. ఎస్పై హరీష్ ఆవునంటూ భయంగాతలూపింది ప్రణతి, ఆమెవంక కోపంగా చూసి, “నన్నెందుకు తీసుకొచ్చారు సార్ అడిగాడు రాజు.

    “చేసిందంతా చేసి ఏమైందని అడుగుతావేరా దొంగ సచ్చినోడా !నాలుగు దెబ్బలు పడితేగాని బుద్ధి రాదు వెధవకి “ఆవేశంతో అతని జుట్టు పట్టుకుంది ప్రణతి తల్లి.

    “ఆగండి !నేను మాట్లాడుతున్నాను కదా! ఏరా, నిజంచెప్తావా లేదా ” ఆమె నుంచి విడదీసి గద్దించి అడిగాడు ఎస్సై .

    “దేని గురించి అడుగుతున్నారో నాకు తెలీదు సార్ !”చెరిగిన తలను ఒక చేత్తో సరిచేసుకున్నాడు రాజు.

    సుందరరావుకు అక్కడేం జరుగుతుందో అర్ధం కాలేదు.

    అయోమయం చెందడం ఆపేసి రంగంలోకి దిగాడు.

    “ఏరా రాజు. ఏం చేశావ్” అడిగాడు సుందరరావు.

    “ఈ పిల్లని అఘాయిత్యం చేశాడు. సార్” చెప్పాడు ఎస్సై .

    రాజు ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగినోడే…బాధ్యతలేకుండా జులాయిగా కాలం గడిపిన వాడే !

    అలాగని ఆడపిల్లల జోలికి వెళ్ళిన దాఖలాలు మాత్రం లేవు. అతన్నో దారిలోకి తీసుకురావడానికి వరసకు

    బావ అయిన సుందరరావు నడుం బిగించాడు. తాను పనిచేసే స్కూల్ పక్కనే ఉన్న బాలికల వసతి గృహంలోవంటమనిషికి సహాయంగా తన పలుకుబడిని

    ఉపయోగించి నియమించాడు. గత మూడేళ్ళలోఅతనిపై ఎటువంటి ఫిర్యాదూ లేదు. అలాంటిదిప్పుడు…

    సుందరరావుకు నమ్మబుద్ధి కాలేదు. కానీ, అక్కడిపరిస్థితిని చూస్తుంటే నమ్మబుద్ధి కానిదేదో జరిగిందనే

    అనిపిస్తోంది.

    “ఏమ్మా ప్రణతీ !ఏం జరిగిందో చెప్పమ్మా…. “తన నమ్మకాన్ని పరీక్షించుకోపదానికి అడిగాడు సుందరరావు,

    తమ స్కూల్ హెడ్ మాస్టారే అడుగుతుండడంతో చెప్పాలో, వద్దో నని తల్లిదండ్రులవైపు చూసింది. ప్రణతి

    “ఇంతదాకా వచ్చింది. ఎంత దాకైనా వెళ్లక తప్పదని ధైర్యంగా నిజం చెప్పమన్నారు ఆమె తల్లిదండ్రులు,

    కాళరాత్రి కళ్ళముందు మెదిలింది.

    *. *. *

    “నిన్న సాయంత్రం వర్షంలో బాగా తడిసిపోయాం సార్. అప్పుడు వార్డెన్ లేదు.

    లోపలికి రాకపోతే వార్డెనుకు చెబుతానన్నాడు అన్నయ్య .భయంతో లోపలికి వెళ్ళిపోయాం. అన్నయ్య మమ్మల్ని అదోలా చూశాడు.ఏంటని అడిగాo “ఏం లేదులే, వెళ్లి స్నానం చేసి రండి” అని పంపించేశాడు. పడుకునే ముందు మా గదికొచ్చి పిలిచాడు సార్ ! “భయం నిండిన కళ్ళతో రాజు వంకచూసింది.

    ఆమెలో సృష్టించబడిన గత రాత్రి తాలూకు జ్ఞాపకాలుఆమె కళ్ళద్వారా తేటతెల్లమవుతున్నాయి. ఒకరకమైన ఆందోళన, ఒంట్లో వణుకు ఆమెను చెప్పనివ్వకుండాఅడ్డుకుంటున్నాయి. “చెప్పమ్మా.. తర్వాతేమైంది?”

    కొనసాగించమన్నాడు సుందరరావు,

    “జలుబు చేసిందని, ఒళ్ళంతా వేడిగా ఉందని,తలనొప్పి కూడా ఉందని జండూబాముతో రుద్దమన్నాడు సార్! నాకు భయమేసింది. నిద్రొస్తోందని లోపలకుపోతుంటే వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు సార్!

    ఒక్క సారిగాభయంతో అరిచాను. మా ఫ్రెండ్స్ అందరూలేవడంతో వదిలేశాడు. “బల్లిని చూసి ఎందుకు భయపడతావ్ ! భయపడకు. వెళ్ళి పడుకో అన్నాడు సార్” ఆ సంఘటన గుర్తుకొచ్చి తల్లి నడుం చుట్టూ చేయి వేసింది ప్రణతి.

    “ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా తల్లీ ! నాకు చెప్తే వాడి తాట తీసేవాడిని కదా, మళ్ళీ ఇటువంటి పిచ్చి పనులు చేసేవాడు కాదు. చిన్నవిషయమే అన్నట్లు మాట్లాడాడు సుందరరావు. అతని మాటలకు అడ్డు తగిలాడు ఎస్సై హరీష్.

    “వీడేం చేశాడో తెలిస్తే మీరే బట్టలూడదీసి కొడతారు” అన్నాడు. ఎస్పై .

    “ఇంకేం చేశాడు. సార్?” సుందరరావులో గుండె దడ మొదలైంది.

    “ఏం చేశాడా ? పిల్లలందరూ ఎవరి రూముకు వాళ్ళు వెళ్లి పడుకున్నా అక్కడే గుంటనక్కలా కాపుకాశాడు. ఆ అమ్మాయి బాత్రూం కెళ్ళడం చూసి వెనకనుంచొచ్చి నోరు మూసేశాడు. గట్టిగా కర్చిఫ్

    కట్టేశాడు. ఆ పిల్లని లాక్కొని వెళ్లి బాత్రూం తలుపు వేసేశాడు. పనయ్యాక ఎవ్వరికీ చెప్పొద్దని, చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయంతో ఎటువంటిపరిస్థితుల్లో ఉందోనని కూడా పట్టించుకోకుండా ఆ అర్ధరాత్రి వేళ ఇంటికి పారిపోయింది. ” కోపంగా రాజు వంక చూశారు ఎస్సై .

    సుందరరావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రాజు కుదురు తక్కువ మనిషని తెలుసు కానీ, అలా చేశాడు అంటుంటేనే నమ్మలేక పోతున్నాడు. తప్పు చేయని వాడైతే ఎదుటివారు వేసే నిందల్ని ఖండించాలి. కానీ రాజు మౌనంగా ఉన్నాడు.

    “పిల్లలు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళు స్వర్గంలోఉంటే వీళ్ళు ఇక్కడ నరకంలో ఉన్నారని పిస్తుంది. ఎంత నరకం అనుభవించిందో పాపం, ఆవేదన చెందాడు హరీష్ . మౌనాన్ని వీడాడు రాజు.

    “నాకేం తెలీదు సార్ ! వీళ్ళు అల్లరి చేసినప్పుడు రెండు దెబ్బలు వేస్తాను కర్రతో కొడితే దెబ్బెక్కువ తగులుతుందని చేత్తో కొడతాను. దాంతో నా మీద కక్ష కట్టారు . నిన్న భాగా వర్షం వచ్చింది. ఆ వర్షం లో తడుస్తూ ఆడవద్దని చెప్పాను. నా మాట వినకుండా ఎక్కువ సేపు ఆడారు.

    అందుకే రెండు తగిలించాను .కోపంతో ఇలా కంప్లయింట్ చేసింది. ఈ పిల్లే వాళ్లకు గ్యాంగ్ లీడర్ సార్.”అంటూ ఖండించాడు రాజు .అనుమానంగా చూశాడు హరీష్ .ఎవరు నిజం చెపుతున్నారో తెలీని ద్వైదీభావానికి గురయ్యాడు సుందరరావు.

    జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎస్.సి. ఆర్ బీ),గణాంకాల ప్రకారం దేశంలో పిల్లలపై అత్యాచారం ఘటనలు రోజు రోజుకు వేలల్లో నమోదవుతున్నాయి.

    ఎఫ్.ఐ .ఆర్ నమోదు చేసిన మూడు నెలల్లోపు కేసువిచారణ పూర్తి చేయాలని ప్రభుత్వంఆదేశాలు జారీ చేయడంతో అందుకు నడుం బిగించి పాటుపడుతున్నవ్యక్తి ఎస్సై హరీష్

    ప్రణతి ‘ఇతనే’ అంటుoది. కాదు అని రాజు అంటున్నాడు . ఈ కేసునెలా పరిష్కరించాలో అని ఆలోచించ సాగాడు హరీష్

    *. *. *

    ఎంత బుద్ధి తక్కువ పని చేశావురా? మనం మంచి చేస్తే నలుగురూ మనల్ని కీర్తిస్తారు. తప్పు చేస్తే అదే నలుగురు ఛీ కొడతారు. ” అని చెవినిల్లు కట్టుకుని చెప్పాను . అయినా అవి నీ చెవికెక్కలేదు.

    స్కూలుకి పక్కన హాస్టల్ ఉందని, నా దగ్గరిగా కుదురుగా ఉంటావని పనిప్పిస్తే నువ్వు చేసే పని ఇదా ?

    బంధం ఆలోచించకుండా తీసుకెళ్ళి లోపలేయండి సార్!

    ఈడికి పదే శిక్షను చూసి ఇలాంటి వాళ్ళంతా బుద్ధితెచ్చుకోవాలి. ” ప్రణతికి అండగా నిలిచాడు.

    సుందరరావు. దాంతో అతన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు పల్లెటూరని, ఎవ్వరికీ చెప్పుకోలేరని వీడింతదుర్మార్గానికి ఒడి కట్టాడు. ధైర్యంగా వీళ్ళు కంప్లయింట్ ఇవ్వబట్టి విషయం బయటపడింది. లేకపోతే ఇంకెంతమందిని బలత్కారం చేసేవాడో ఆలోచనలకే అందడం లేదు.

    ఇలాంటివి జరిగినప్పుడు మా దృష్టికి తీసుకు రాకుండా పరువు ప్రతిష్టలంటూ కూర్చుంటే మీ పిల్లల బతుకులే నాశనమవుతాయి. ఇంతమంది జీవితాలతో ఆడుకున్న ఈ కామాంధుడిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు” మాటిచ్చారు ఎస్పై హరీష్ ఎస్సై మాటలు గ్రామస్థుల్లో ఆలోచనలను రేకెత్తించాయి. ఇకపై ఎలా మెలగాలో నిర్ధారించుకోసాగారు. సుందరరావు చెప్పింది నిజమేనని, చేతులుకాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదని పశ్చాత్తాపం చెందాడు రాజు.

     -దొండపాటి కృష్ణ

    Dondapati Krishna Repati Kosam
    Previous Articleరెండేళ్ల విశ్వాoధకారం
    Next Article CM KCR to inaugurate BR Ambedkar Telangana Secretariat Complex on Jan 18
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.