ఆత్మ బంధువు అన్నయ్య
సీ || అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన - అన్నయ్య అనురాగ మంబరమగును
అన్నయ్య కురిపించు అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు మొసగు
సాదరంబగు మామ సోదరున్ సందిట -బాలార్కుని కిరణ ఆప్యాయ మొలికెడు అన్నయ్య పిలుపన్న -మలయానిలమ్ముగ మదిని తోచు
ఆ.వె.|| అన్నయన్న పిలుపు ఆనంద ప్రదమగున్ - రక్త బంధ యనురక్తి యనగ సోదరులిక ప్రేమ సుంత పంచిన చాలు - కాన వచ్చు అని
కనుల తృప్తి .
అన్నయ్య కిడగను అగ్రాధిపత్యము -పెద్ద కొడుకనెడు పేరు నిలుపు
వరుసగ గృహమున గురుతర బాధ్యతల్ నిర్వహించగ కడు నేర్పు చూపు
కష్ట సుఖమ్ములు కాదు లాభ నష్ట ముల్ -సహన సంపద తోడె
అనుజుల నడిపించ నాదర్శ మార్గమ్ము-అసమాన ప్రతిభను అవధరించు
తే .గీ.|| వినయ సంపన్నులైన వారు విద్య నేర్చి -ప్రగతి పదమున ప్రతిభ తో పరుగు లిడుచు
లక్ష లార్జించు చుండగ లక్షణముగ-కురియ నానంద
బాష్పాలు మురియు నన్న.
సీ .|| శ్రీరాము నంతటి స్థిర చత్తు నన్నగా పొందగల్గుటపూర్వ పుణ్య ఫలమె
నిస్వార్ధ బుద్ధితో నిరతము కృషి సల్పు -మా యన్న విధిగమా మంచి నెంచు
అన్నయ్య బోధించు కన్నయ్య వలె నింక మంచి చెడుల గీత ఖచ్చితముగ
ఆత్మ బంధువు మాకు ఆత్మీయుడగు అన్న సన్నిధిన్ తలతుము
పెన్నిధి గను
తే.గీ .|| తల్లిదండ్రుల యెడభక్తి తరగనీక -అలుక నెరుగక,మా యన్న అలుపు లేకసాకు కుశలమ్ముగ కుటుంబ సారధిగను కొండ వలె నుండు మా అన్న అండ మాకు.
శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,మచిలీ పట్నం)