Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    జ్యోత్స్న (కథానిక)

    By Telugu GlobalJanuary 23, 20233 Mins Read
    జ్యోత్స్న (కథానిక)
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ‘ఈకలా గాలిలో తేలుతూ,

    అంత మంచి జారుతూ, వేగంగా

    నేలని తాకబోతూ పెట్టిన పెనుకేక…

    ఏ చేతులు తనని పడకుండా పట్టుకున్నాయి?

    ఏ దేవుడు తనని ప్రమాదం నుండి రక్షించాడు?’

    ఉలిక్కిపడి, నిద్రలో నుండి బయట పడింది.జ్యోత్స్న పళ్ళంతా చెమటలు. ఎడమముంజేతితో ముదురు తుడుచుకుంటుంటే,

    చూపు అక్కడున్న లోతైన మచ్చను

    పలకరించింది.

    ఏమిటో ఈ కల? అర్థం తెలియదు..

    బుద్దెరిగినప్పటి నుంచీ వస్తూనే ఉంది…… కల

    ఈకలా తేలిపోతుంది

    కలవరం చాలాసేపటి

    దాకా కలత పెడుతూనే ఉంటుంది.

    ఎన్ని సార్లు వచ్చి ఉంటుంది? చిన్నతనంలోతరచుగా… తరువాత అరుదుగా…..

    మొత్తానికి పదులు పదులుగా… ఎన్నిసార్లో… అర్ధ శతం పూర్తయిందేమో.కూడా!’ నిట్టూర్చింది జ్యోత్స్న

    ఈ సారి మాత్రం, ఏళ్ళు దాటింది. దాదాపుతను మర్చిపోతున్న తరుణంలో, ఈవేళ, ఈ

    టూర్లో, ఈ గెస్ట్ హౌస్లో మళ్ళీ వచ్చింది. తలవిదిలించుకుని లేచి, కొద్దిగా మంచి నీళ్ళు త్రాగి,పక్క మీద వాలింది.

    మొదటిసారి ఆ కల వచ్చినప్పుడు,

    అయిదారేళ్ళ వయసు ఉందేమో ఉలిక్కిపడిలేస్తే, తల్లి దగ్గరకు తీసుకుని, వెన్ను నిమిరి జో కొట్టింది.

    ఏడెనిమిదేళ్ళ వయసులో వచ్చినప్పుడు,భయం కన్నా అయోమయం బాధించింది.

    బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద తల్లిని అడిగింది జ్యోత్స్న

    “ఎందుకమ్మా, ఈ కల ఇలా వస్తూనే

    ఉంటోంది నాకు?

    “చూడు బేబీ, కలలకు అర్థాలు ఉండవు..వాటిని, నిద్రలోనే మరిచిపోవాలి.” కసిరేసింది.

    మంగళ

    “నా ఎడమ చేతికి ఈ ఫ్రాక్చర్ ఎప్పుడయింది.నాన్నా? ఇంత మచ్చ ఎందుకు పడింది?” ఎడమ

    చేయి ముందుకు చాపి, ఈ సారి తండ్రినిఅడిగింది. ఇరిటేట్ అయ్యాడు శంకరం.

    “ఇదివర కొకసారి చెప్పాను. చెట్టు మీదనుంచి కిందపడి, చేతికి ఫ్రాక్చర్ అయ్యి,ఆపరేషన్ చేస్తే మచ్చ పడింది. “

    “ఏ చెట్టు? నేను చెట్టు ఎందుకు ఎక్కాసు?”అయోమయంగా అడిగింది జ్యోత్స్న.

    మతి తప్పిన కోపంలో, గతి తప్పిన మాట.గమనించుకున్న శంకరం, దాని కప్పి పెట్టే ప్రయత్నంలో గద్దించాడు,

    “నీ కలకీ, ఆ ప్రశ్నకీ, ఈ మచ్చకీ ఏమీ.

    సంబంధం లేదు. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర కబుర్లు ఆపు. స్కూల్ టైమై పోతోంది.”కటువుగా అన్నాడు.

    తల దించుకుంది జ్యోత్స్న. తన

    చేతికీ, వస్తున్న కలకీ సంబంధం

    ఉందని, తండ్రపరోక్షంగానైనా ఒప్పుకున్నాడని ఆ లేత బుర్రకి

    అర్ధమయిపోయింది. ఆ సంబంధ మేమిటోమాత్రం ఎన్నిసార్లు అడిగినా తల్లి కూడా జ్యోత్స్నకు చెప్పలేదు. ఎంత బుర్ర చించుకున్నా, ఏదో లీలగాతప్ప జ్యోత్స్నకు తట్టలేదు.

    ఆలోచనలను వదిలించుకుని, పక్క మీదనుంచి లేచింది జ్యోత్స్న. ఆ రోజు తన కార్యక్రమంగుర్తు చేసుకుంది. అక్కడికి నలభై కిలోమీటర్ల

    దూరంలో ఉన్న పల్లె బతుకుబండ్లలో ఇవాళపరిచయ ప్రచార కార్యక్రమం ప్రారంభించతల్చుకుంది. ఆమెతో పాటు ఇక్కడినుంచి, ఆ ఊరి

    ఆనుపానులు తెలిసిన ఇద్దరు కార్యకర్తలు వస్తారు.ఆ పల్లెలో మరో నలుగురు స్థానికులు కలుస్తారు.

    రెండు రోజుల క్రితం జ్యోత్స్న ఆ నగరానికి వచ్చి,గెస్ట్ హౌస్ లో దిగితే, స్వంత పనిమీద వచ్చిందనుకున్నారు స్థానిక నాయకుడు, కార్యకర్తలూ

    ఆమె ఆ సాయంత్రం సమావేశం ఏర్పాటుచేసి చెప్పిన సమాచారం విని, విస్తుపోయారు.

    బాగుందమ్మా. కేంద్ర మంత్రి అయిన మీరు,ఇంత దూరం వచ్చి, మా నియోజక వర్గం లోపని చేయటం మాకు సంతోషమే. కానీ, ఇప్పుడు

    మనం పడే శ్రమ నాలుగేళ్ల తరువాత వచ్చే ఎన్నికలదాకా ప్రజలు గుర్తు పెట్టుకుంటారనుకోను.

    అంతకన్నా ఓ రెండేళ్ల తరువాత మొదలు.పెడితే… “

    మధ్యలోనే అతడిని ఆపింది జ్యోత్స్న

    “పార్టీ దృక్కోణం మారిపోయింది మల్లయ్యగారూ! ప్రజలకి మనం గుర్తుండే పనులు కాదు,

    చిరకాలం ప్రజలకి గుర్తుండే పనులు చెయ్యాలి.ప్రజలకి మనం కనబడగానే ఎలక్షన్లు వచ్చాయని

    గుర్తు వచ్చే పరిస్థితి మారి, ఎలక్షన్లు రాగానే,మనం గుర్తుకు వచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీచేయటానికి, నాలుగేళ్లు చాలక పోవచ్చు. పై

    ఎన్నికల్లోనూ మనం నెగ్గకపోవచ్చు. గెలుపుఓటములకి అతీతంగా మన కార్యక్రమాలుసాగాలి. అదే ఇప్పుడు మన పార్టీ లక్ష్యం.”

    పాతికేళ్ళ వయసులోనే, ఆమె కేంద్ర స్థాయిలోమంత్రి పదవికి ఎలా ఎదగ గలిగిందో బోధపడింది మల్లయ్యకి, ఇతర కార్యకర్తలకీ

    ******

    మట్టి రోడ్డు మీద కారు వెళుతుంటే మేఘాలలాగా దుమ్ము రేగుతోంది .దూరదూరాలకి కూడా

    పచ్చదనం కనబడటం లేదు. ఇలాంటి ఊళ్ళుదేశం నిండా ఎన్నెన్నో…” నిట్టూర్చింది జ్యోత్స్న,

    గ్రామం సమీపిస్తూనే, జన సంచారం

    మొదలయింది. “ఇదేనా బతుకుబండ్ల?”అడిగింది జ్యోత్స్న

    “కాదమ్మా. ఇది వలసబావులు, బతుకుబండ్లకన్నా చిన్న ఊరు వెయ్యి గడప దాటదు.”

    “ఇక్కడ ఆగుదాం !సర్పంచి గారింటికి

    పోనియ్.” వింతగా చూశాడు మల్లయ్య.

    “వీళ్ళంతా అపోజిషన్ వాళ్ళే. ఆయన మరీ మొరటు మనిషి”

    ‘మనం పార్టీ పనిమీద వెళ్ళటం లేదు. ప్రజలపని మీద వెళ్తున్నాం.”.

    ‘నీ ఖర్మ’ అన్నట్టు చూసి, కారు అటు

    పోనిచ్చాడు. మల్లయ్య.

    అక్కడ వెటకారమే ఎదురయింది ఆమెకి.కేంద్రం నుంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని వచ్చానని చెప్తే, నిరసనగా నవ్వాడు.’మా రాజ్యంలో ఎందుకు, మీ నియోజక వర్గాల్లోచేసుకోండి, చాల’న్నట్టు.

    జ్యోత్స్న తానే ఊళ్ళోకి నడిచింది. ఇల్లిల్లూతిరిగింది. తను కేంద్ర మంత్రినని పరిచయం

    చేసుకుంది. వారి బాగోగులు అడిగింది. రెండురోజుల పాటు వలసబావుల లోనే పర్యటన

    చేసింది. రాత్రికి నగరం చేరటం, ఉదయాన్నే తిరిగి రావటం… ఇదే దినచర్య చేసుకుంది.

    రెండవ రోజునుంచే, స్థానిక నాయకుడిని వదిలేసి,

    ఇద్దరు కార్యకర్తలను మాత్రం వెంట తీసుకువెళ్ళటం మొదలు పెట్టింది.

    ఆ విధంగా, చుట్టుప్రక్కల అయిదు గ్రామాలు ఒకటొకటిగా చుట్టేసింది. ఒకో గ్రామంలో రెండేసి, మూడేసి రోజులు, ఆ ఊరి జనాభాని బట్టి,

    లభిస్తున్న స్పందనని బట్టి గడుపుతూ, ప్రజలఅవసరాలని ఆకళింపు చేసుకుంటూ, అక్కడి

    భూసార పరిస్థితులు, నీటి వనరులు, బావులు,చెరువుల వివరాలు అన్నీ పరిశీలిస్తూ, ఒక రీసెర్చ్ విద్యార్ధిని లాగా, నోట్స్ తయారు చేసుకుంటూ

    సాగింది. మొదట్లో, ‘ఏదో మంత్రిగారి సుడిగాలి.పర్యటన’ అనుకున్న ప్రజలు, ఆమె తీరుని, శ్రద్ధనీ,

    ముఖ్యంగా ఒక్క కెమెరా కూడా ఆమె వెంట లేకపోవటాన్నీ చూసి, క్రమంగా ఆమెకి సహకరించారు.

    – పి .వి .ఆర్ .శివకుమార్

    PVR Shivakumar Telugu Kathalu
    Previous ArticleTollywood Movies: టాలీవుడ్ బంగారు బాతుగుడ్డు సంక్రాంతి
    Next Article Chiranjeevi: అబ్బో.. చిరంజీవి వెటకారం మామూలుగా లేదుగా..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.