లక్ష్మీ కరమౌ దీపావళి (గేయం)
BY Telugu Global12 Nov 2023 2:18 PM IST

X
Telugu Global Updated On: 12 Nov 2023 2:18 PM IST
దివ్య దివ్య దీపావళి
దివ్యంగా వెలిగే దీపావళి
కన్నుల పండుగ దీపావళి
మిన్నును తాకును దీపావళి
రంగురంగుల దీపావళి
రమణీయమైన దీపావళి
తారాహారం దీపావళి
తళుక్కున మెరిసే దీపావళి
ఆనందసాగరం దీపావళి
అలరించే ధామం దీపావళి
మహోన్నతమౌ దీపావళి
మనోజ్ఞ రూపం దీపావళి
సులక్షణ తేజం దీపావళి
లక్ష్మీకరమౌ దీపావళి.
కవిత మరియు చిత్రరచన : పి.పి.నాయుడు.
Next Story