Telugu Global
Arts & Literature

విశాల (చిన్న కథ)

విశాల (చిన్న కథ)
X

సీతమ్మ కన్ను మూసింది. 87 ఏళ్లు. ఆవిడ పిల్లలు అందరూ

అమెరికాలో ఉంటారు.

ఇక్కడ ఆవిడని చూడడానికి

హెూమ్ నుంచి విశాల అనే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు.

నాలుగేళ్ల నుంచి ప్రేమగా సీతమ్మకు సేవ చేసింది విశాల.

అందుకు బదులుగాఆవిడ పిల్లలు విశాలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు

జీతం నేరుగా హెూమ్ కి ఇవ్వాలి.

విడిగా విశాల కోసం ఎన్నో బహుమతులు కొంటారు. సీతమ్మ

కర్మ కాండలు కాగానే ఇక నేను హెూమ్ కి వెళ్ళిపోతాను అన్నది విశాల.

మనకు ఇంత మేలు చేసిన విశాల జీవితం ఒక గాడిలో పడేలా చూడాలి. పెళ్లి చెయ్యాలి.

అనుకున్నారు. సంబంధం కోసం వెతికారు. ఒక గవర్నమెంట్ ఆఫీసులో అటెండెర్ గా పనిచేస్తున్న

అబ్బాయి సంబంధం కుదిరింది. 50,000 కట్నమిచ్చి లారీడు సామాను (సీతమ్మగారు వాడు

కొన్నవే) ఇచ్చి కాపురానికి పంపించారు.

సంతోషంగా అమెరికా వెళ్లిపోయారు.

అదృష్టవంతురాలు విశాల. ఇక వృద్ధుల సేవలోమగ్గిపోనక్కరలేదు. మంచి ఉద్యోగం వున్న మొగుడు, సంసారం ఎంత సామాను మహారాణిగాఉంటుంది అనుకున్నారు చుట్టుపక్కలవారు.

విశాల భర్త కుమార్ కి స్వంత ఇల్లు వుంది. అతనికి వేరే ఊళ్లో ఉద్యోగం. స్వంత యింట్లోయెనభై ఏళ్ల నాయనమ్మ, డెబ్బై ఏళ్ల మేనత్త 65 ఏళ్ల తల్లి వున్నారు. వీళ్ళందర్నీ తీసుకునిఊరూరూ తిరగటం కష్టం అని వాళ్లని సొంత ఇంట్లోనే వుంచాడు.

"నావల్ల కావడం లేదు రా ఎవరైనా మనిషిని మాట్లాడు "అని

సణుగుడు మొదలు పెట్టింది.

తల్లి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అదృష్టవశాత్తు విశాల దొరికింది. నెలకి ఒకసారి వచ్చి

భార్యను చూసి పోతూ ఉంటాడు. చాలా ప్రేమ భార్య అంటే. ఈ బాధ్యతలు తీరాక నాతో

తీసుకుపోతాను. ఈలోగా ట్రాన్సఫర్ కోసం ప్రయత్నం చేస్తాను అని ఒట్టేసి చెప్తాడు.

వయసులో ఉన్నవాడు కాబట్టి ఏదో అక్కడ తన తంటాలు తాను పడుతూ ఉంటాడు.

ఇక విశాల తిండికి బట్టకు లోటు లేదు. కాలక్షేపానికి కరువు లేదు. గతంలో హెూమ్ లో

ఉన్నప్పుడు మూడు నాలుగు చోట్లకు వెళ్లి పని చేసింది. జీతం వుండేది. ఇప్పుడు స్థిరంగా ఒకే

చోట పని. జీతం లేదు.

అది ఉద్యోగం.

ఇది కాపురం.

- పొత్తూరి విజయలక్ష్మి

First Published:  22 Jun 2023 5:20 PM IST
Next Story