Telugu Global
Arts & Literature

ఉమ'ఋక్కులు' (వాచవిగా కొన్ని)

ఉమఋక్కులు (వాచవిగా కొన్ని)
X

పుట్టింట

కార్బన్ కాపీలానూ

మెట్టినింట

ఫొటోస్టాట్ కాపీలానూ

సమాజంలో

సైక్లోస్టైల్డ్ కాపీలానూ

బతకొద్దు

(22.7.95)

'పోత' లెందరో

'పూత' లెందరు ?

(23 .7.95 )

అందరిలోనూ

అవే ముడి జీవ సరుకులు

కానీ -

ఎవరి జీవన రసాయనాన్ని

వారే తయారు చేస్కోవాలి.

(27.7.95)

జీవనయానం అంటే -

జననం నించి మరణం వరకూ

సాగేది కాదు

తెలియని తనం నుంచి

తెలిసేతనానికి సాగేది

(25-7-95)

`పుత్తడి'ని తూచేది

'ఇత్తడి'

(26.7.95)

మనసు కోరుతుంది.

మెదడు ఆలోచిస్తుంది

మేధ సృష్టిస్తుంది.

(31.7.95)

మూలమూలల కెడితే చీకటి

మూలాల మూలాల కెడితే వెలుగు

(1-8-95)

- పిశుపాటి ఉమామహేశ్వరమ్

First Published:  11 July 2023 6:30 PM IST
Next Story