పరాశర్యుడయ్యె
పరాశరుని యశమందు
బదరికవమునందు జన్మనొంది బాదరాయణుడయ్యె
సాత్యవతేయుడతడు
సత్యవతీ సుతుడు
వ్యాసుడు వేదవేదాంగాలను వచించిన వేదవ్యాసుడు..
విశ్వగురువాయెను వేదర్షి వ్యాసమహర్షి !!
అష్టాదశ పురాణముల
నందించెను
మహాభారతపర్వాలను
రచించెను
గీతోపనిషత్తులన్నియు
నిర్వచించెను
వేదాలను విభజించి
అందించెను లోకములెల్ల పావనమౌనటుల
వేదవ్యాస మహర్షి !!
వెలుగొందె విశ్వమునందు గురుతుల్యుడై
విరాజిల్లుచుండె
సప్త చిరంజీవులందు
యొకరై వేదర్షి
వ్యాసమహర్షి !!
-పేరిశెట్టి బాబు, భద్రాచలం