Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    ఏరిన ముత్యాలు: పేరడీ సూరీడే కాదు అసాధారణ పాండిత్య ప్రతిభామూర్తి – జరుక్ శాస్త్రి

    By Telugu GlobalSeptember 10, 20233 Mins Read
    ఏరిన ముత్యాలు: పేరడీ సూరీడే కాదు అసాధారణ పాండిత్య ప్రతిభామూర్తి - జరుక్ శాస్త్రి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పేరడీ సూరీడు – జలసూత్రం గురించి ఆ తరం రచయితలకూ, సాహితీవేత్తలకూ బాగానే తెలుసు. సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో చక్కని పాండిత్యం ఉంది. చదవని గ్రంథం లేదు. తెలియని లోకజ్ఞత లేదు. రణపెంకిగా అనిపించినా కట్టె విరిచినట్లు మాట్లాడినా, ఎరాటిక్ గా కనిపించినా – ఈ బోళాతనం , ఆత్మీయతా – ఆ తరహాయే వేరుగా ఉండేది. దిగ్ధంతులతో కుస్తీ పట్టినా ఎప్పుడూ ‘‘ఫౌల్ గేమ్స్’’ ఆడలేదు. తనకు తెలియనిది తెలియదు అనేవాడు. తెలిసిన దాన్ని చెప్పడం కుండబద్దలుకొట్టడమే! అయినా సహచరుల్ని నవ్వించటం, తాను నవ్వడం అనే కళ తెలిసిన సాహితీ వైద్యుడు. ఆయనదొక ప్రత్యేక జీవనశైలి.

    బారలు మూరలుగా ఏమీ రచనలు చేయలేదు రుక్మిణీనాథ శాస్త్రి. ఆయన మేధాశక్తిలో ఒక సన్నని వెలుగువాక మాత్రమే అక్షరబద్ధమైంది. కవితలూ, కథలూ విశ్లేషించి పేరడీలు వ్రాశారు.

    రుక్మిణీనాథ శాస్త్రిగారు రాసిన 20 కథల్ని కె.వి.రమణారెడ్డిగారి ద్వారా సేకరించుకొని ‘శరత్ పూర్ణిమ’ పేరిట సంపుటంగా తెచ్చారు నవోదయవారు. తెలుగు సాహితీ ప్రియులు వారికి నిజంగా రుణపడి ఉండాలి.

    కథకుడుగా జలసూత్రం – చతుర్ముఖ బ్రహ్మ. ఇతివృత్త సృష్టి. శిల్పసృష్టి, శైలి సృష్టికాక తన కథల్లో నేటివిటీని సృష్టించిన ప్రయోశీలి ఆయన.

    ఈ నాల్గవ అంశమే నిజానికి జలసూత్రం కథల్లోని అంతస్సూత్రం.

    సూర్యనారాయణుని ‘సూర్నాణ’ అనగలడు ఆయన. కోస్తావారు ఆ పేరుతో ఉన్న తమ మిత్రుల్ని అలాగే పిలుస్తారు. ప్రతిదీ అని విడమర్చి పలకరు. ‘ప్రద్దీ’ అనే అంటారు. జలసూత్రమూ అందుకనే అలాగే రాస్తారు. బళ్లదారి ఎండి, గాడిపడి , నల్లరేగడి మట్టిపెళ్ళలు పెళ్లలుగా, గడ్డలు గడ్డలుగా అవుతుంది – వేసవిలో. గతుకులు గతుకులుగా ఉంటుంది. వాటిని కత్తిర గడ్డలు అంటారు. ఆ పదాన్ని అలాగే రాస్తాడు. తాషామరఫా , రాంఢోళ్లు – పెళ్లి హడావిడిలో కాళ్లు విరగతొక్కుకోవడం – ఇవన్నీ ఆయన కథల్లో సజావుగా ఒదిగిపోతాయి. వాటిలో జనసమ్మర్థం ఉంటుంది.

    శాస్త్రిగారి కథలన్నీ దేనికదే ఒక ప్రత్యేకత కలిగింది. ‘వివాహ మంగళం’ – శరత్ పూర్ణిమ వంటి అద్భుతమైన కథలు ఉన్నాయి. అయితే ‘హోమగుండం’ కథ ఒక్కటీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

    ఈ కథకి శీర్షిక కిందనే వరాహమహిరుడి సూక్తి ఉంది.

    స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా ఉందా? నిజం చెప్పండి. ‘భార్య చితాగ్ని నుంచే వీడు రెండో పెళ్ళి హోమానికి నిప్పు తీసుకొచ్చాడన్న నిందను హనుమంతరావు నిబ్బరంగా భరించాడు’ అని మొదలవుతుంది కథ. రెండో భార్య నరసమ్మ కథ.

    నరసమ్మకి భర్తపోయాడు. మరిది లాలించి దగ్గరికి తీశాడు. గర్భవతి అయింది. అత్తా ఆడబిడ్డా, ఆ మరిదీ కలసి, ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. శరణాలయం చేరింది. అష్టకష్టాలు పడింది. ఇవన్నీ తెలిసి తెలిసి, విని, కావాలని చేసుకున్నాడు హనుమంతరావు. అతనికో కొడకు, ఆ తర్వాత అతని మనసుకు తెగులు పుట్టింది. ‘‘నీవు అన్నిందాలా చెడిన ముండవు. వాళ్ళెవరో అన్నట్లు ఏదో ఇంత గూట దీపం పెడతావని చేసుకున్నాను గానీ, నాకు పెళ్లేమిటి? నీకు పెళ్లేమిటి’ అంటాడు. ఏడుపు నవ్వు నవ్వింది నరసమ్మ. ‘సరేలెండి’ అంది. గుండెల్లో పలుగు పెట్టి పొడిచినట్లయింది. బందిలి దొడ్లో పడ్డ ఆవులా అయింది.

    ‘దేవుడి పటాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చనిపోయిందిట- అనుకున్నారు!’ అంటూ హోమగుండం కథ ముగుస్తుంది!

    ఈ కథ మార్చి 1945 రూపవాణిలో వచ్చింది. ఆనాటి సామాజిక వాస్తవికతని కళాత్మకంగా, సరళగంభీర శైలిలో గ్రంథస్థం కావించిన కథకుని ప్రతిభా వ్యుత్పత్తులకి తప్పకుండా ‘జయహో’ అంటాము!

    ఈ పేరడీ సూరీడు ప్రతిభ గురించి ఒక్క ఉదాహరణగా చెప్పాలంటే – కొ.కు. ఈయన్ని విశ్వనాథ ధోరణి ఏమిటని అడిగితే, మొహం గంభీరంగా పెట్టి ‘ధర్మారావు వచ్చెను’ అన్నాట్ట! అలాగే, ‘ఒకసారి అతను రైల్లో మద్రాసు వస్తూ

    పై బెంచీమీద పడుకున్నార్ట. కింది బెంచీమీద కూర్చున్న వాళ్ళెవరో ఏదో పత్రిక చదువుతున్నారుట. రెండు మూడు వాక్యాలు చెవినపడగానే అతను కిందికి తొంగి చూసి ‘‘అది రాసింది కుటుంబరావు’’ అన్నాట్ట! నిజమేట్ట’!! అదీ జరుక్ శాస్త్రి సారస్వతజ్ఞానంలోని నిగ్గు!!

    వ్యక్తిగానే కాదు, రచయితగా కూడా తనకు ఎలాంటి మనస్సంకోచాలు (inhibitions) వున్నట్టనిపించదు. ఆరుద్ర ప్రయోగం ‘సిజరెట్’ పొగనే ధూపంచేసి స్త్రీ విద్యోపాసన చెయ్యగల యీ ఆహితాగ్నికి ఆంక్షలూ ఆజ్ఞలూ వర్తిస్తాయా అని అనుమానం. తాను సాంప్రదాయికులలో నవ్వుతూ నవ్వులతో చివరనైనా సాంప్రదాయికుడు, రుక్కులు రాయించుకున్నాడు. రుక్కాయి అనిపించుకున్నాడు, జలాలుద్దీన్ రూమీ అనిపించుకున్నాడు. కాని తాను తానుగా లోపల్లోపల అంటీ అంటనంత ‘తనీ’గా వుండిపోయాడు.’ అన్నారు కె.వి.రమణారెడ్డి.

    జరుక్ శాస్త్రి గారిని వారి వార్థక్యంలో- బందర్లో చూశాను నేను. రేడియో ఆర్టిస్టుగా కూడా రచనలు చేయటం లేదు అప్పుడు. వారి కొడుకు శివప్రసాద్ ఆకాశవాణి కడప ఉద్యోగి. మా కుటుంబానికి చాలా సన్నిహితంగా మెలిగినవాడు. జనవరి ఒకటివస్తే చాలినన్ని డైరీలు తీసుకువెళ్లేవాడు. తండ్రి లాగానే భోళామనిషి. ‘విదూషకుడి ప్రవర్తనా?’ అనేట్టు ఉండేవాడు. అదేంకాదు నిష్కల్మషమైన మనస్సు.

    జరుక్ శాస్త్రి గారి ‘తనలో తాను’ చదివిన ఏ సాహితీపరుడైనా వారి పాండిత్య గరిమకూ, ఉపజ్ఞకూ ‘దాసోహం’ అనకమానడు. ఆ వ్యాసాల్లోని

    పాఠ్యఫణితి, శైలిలో ఉన్నది ఆ శక్తి.

    నిజానికి ఈనాటి సాహిత్య విద్యార్థులు ఆ వ్యాస భాగాల్ని నిశితంగా విశ్లేషించుకొని కంఠస్థం చేసుకొంటే సంస్కారవంతమైన భాషపై తిరుగులేని పట్టుని సాధించవచ్చు! నేను అలా దాన్ని ఏ వందసార్లో చదివి ఆనందించిన వాడిని. ఇప్పటికీ అది నా రాతబల్లపై ఎడమవైపు అంచునే వుంటుంది! చదివిచూడండి.అది కొత్త సాహిత్య గవాక్షాల్ని తెరచి మరో ప్రపంచంలో సంచరింపజేస్తుంది!  

    – విహారి

    Jaruk Sastry Vihari
    Previous Articleమా మంచి మామయ్య…ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం
    Next Article రిలేషన్‌షిప్ ప్రమాదకరంగా మారకూడదంటే..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.