Telugu Global
Arts & Literature

నేను నేనుగా ఉందామంటే..!

నేను నేనుగా ఉందామంటే..!
X

నేను నేనుగా ఉందామంటే..!

నేను నేనుగా ఉందామంటే సాగనీయవు గదా

సామాజిక మాధ్యమాలు

ఇటు వాట్సాప్ నుండి

ఓ వాయింపు

అటు ఫేస్ బుక్ నుండి మరోటి

పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే సమూహాల సందడి

అడగక ఇచ్చిన ముద్దేమో కానీ

అడగకుండా చేర్చిన

బృందాలతోనే తంటా

వాటి నుండి

బయట పడదామంటే

మొహమాటం అడ్డు వస్తుంది.

కవితల ధార కూడా

నయగారా జలపాతాన్నిమించుతుంది

ఒకే కవిత ఎన్నో బృందాల్

లో సందడి చేస్తుంది.

అవి డిలీట్ చేసి చేసి

వేళ్లు ఉబ్బి పొంగి పొర్లుతాయి

వాట్సాప్ లో సూక్తుల ప్రవాహం

బ్రహ్మపుత్ర నదికంటే ఉధృతం

అసలు ఆచరణకు వస్తే

బీడు వారిన పొలాలు

ఎత్తిపోతల హెూరు ధాటికి

ప్రాణం బేజారు

తోక లేని కోతి పోస్టులకు స్పందించాలని పట్టు

అన్యథా పొగరుమోతు ఎద్దని

విసుర్ల జలపాతాలు

"మేము వాడికి ఆనుతామా?"

అన్న సన్నాయి నొక్కులు

అన్ని పోస్టింగులూ

తీసివేయతగినవి కాకపోయినా

తొంభై తొమ్మిది శాతం

పనికి మాలిన చెత్తవే

ఆ చెత్త భరించలేక

మొబైల్ మొరాయిస్తుంది.

సందేశాలకు

స్పందన లేకపోయేసరికి

ఫోన్ గణ గణ

సంజాయిషీ ఇచ్చుకోలేక

పడే పాట్లు ఇక్కట్లు

ఇక ఫేస్ బుక్ కష్టాలు

వేరే రకం

వాళ్ల జ్ఞానాన్నంతా ఒలకబోసి స్పందించ మంటారు

ఆస్సలు పసలేని వాటిపై

ఏం చెప్పమంటారు?

ఈ సామాజిక మాధ్యమాల నుండి విముక్తి చెయ్ దేవా!

అని ప్రార్థించడం మినహా

మనం చేసేదేమీ లేదు

డా. అంబల్ల జనార్దన్

(ముంబయ్)

First Published:  20 Dec 2022 6:32 PM IST
Next Story