Telugu Global
Arts & Literature

నవయుగ మహావీర త్రిశoకు స్వర్గo

నవయుగ మహావీర త్రిశoకు స్వర్గo
X

ఎక్కడ చూసినా

నవయుగ విశ్వా మిత్రుడు

తాoడవ నృత్యo చేస్తూ

యువతని ఆనందపరుస్తున్నాడు చూస్తున్నారా!

సర్వ వేదాలూ, సకల వైదిక శాస్త్రాలూ, ధర్మాధర్మ సూత్రాలూ

సర్వం మూఢ నమ్మకాలే అంటూ వాటన్నింటినీ గాలికొదిలేసి

వికృతంగా మోర విరుచుకుని పట్టపగలే స్వయoనిర్మిత

స్వప్న సరోవరంలో మునిగి తేలుతున్నాడు

నవయుగ మహావీర విశ్వామిత్ర మానవుడు!

తానొక పరాశక్తి నిర్మిత

స్వయo సంచలన

ఆత్మశక్తి సoయుత మహాయంత్రo అనికూడా గ్రహించలేని

అహoకారమే అలంకారంగా

మెళ్లో వేసుకొని తిరుగుతున్న కుక్కమూతిపిందే వాడు!

మనoతట మనమే నడుస్తూ పనులన్నీ చేసుకోగల,

ప్రకృతి దయదలిచి మనకిచ్చిన, మహాయంత్రాలమే

మనమందరం!

వొళ్లు బలిసి వొళ్లు మరిచి సంచరిస్తున్నాo కదా

విశ్వమంతా బిగ్ బ్యాంగ్ నిర్మితమే అని మూర్ఖoగా నమ్ముతూ విర్రవీగుతూ

ఆ చెవిలో పెట్టుకుని వినగల చూడగల యంత్రంతో

ప్రపంచం అంతటినీ అరక్షణoలో అతిసునాయాసంగా

చుట్టిరా గలుగుతున్నాననేగా

నీ ఈ గర్వo అంతా!

అడ్డూ ఆపూ లేకుండా

మాదక ద్రవ్యాల వినియోగంతో స్వాప్నిక త్రిశంకు స్వర్గాన్ని నిర్మించుకొని

నొప్పి నివారణ నిర్వహణ కోసం అంటూ

అన్ని రకాల విషతుల్యమైన

సాంకేతిక మందుల్నీ సేవిస్తూ

ఆనందిస్తున్న

అధునాతన మహావీర

విశ్వామిత్ర మహర్షీ!

నీకో నిర్మల నిర్భయ వికృత నమస్కారం!

పూర్వ కాల విశ్వామిత్ర మహర్షి ఆకాశoలో విహరిస్తూ

ఆశీర్వదిస్తున్నాడు

మిమ్మల్నoదరినీ ఇలా ---

నీ స్వయంకృత స్వార్థ పూరిత ఒంటరితనపు

మహావీర త్రిశంకుస్వర్గాన్ని

మనసారా ఆహ్వానించు

ఆనందించు

విజయo నీదే యంత్రమిత్రమా అధ్భుతమైన శారీరక మహదానందమూ నీదే!

అనుభవించు రాజా - అనుభవించు!

-సుమనశ్రీ (హైదరాబాద్)

First Published:  18 Dec 2022 11:15 AM IST
Next Story