నై వాషా రోజులు
BY Telugu Global24 Nov 2022 11:55 AM IST
X
Telugu Global Updated On: 24 Nov 2022 11:55 AM IST
నై వాషా రోజుల ముందు
ఈగలతో, ఎండతో యుద్ధం చేసేవాళ్ళం
బుల్లెట్ కన్నాల గుడిసెలో
పాలు, తేనెల కోసం వుండేవాళ్ళం.
గొ రెల్లా దళాలతో పంచుకొనే యత్నం
ఆశనిరాశల మధ్య వూగిసలాట వాళ్ళది
దొ రికితే రొట్టెముక్క లేకుంటే తీరని దాహం
టైరుముక్కల చెప్పులు, చిరిగిన అంగీలు.
ఒక్కటి చేశాయి ఒప్పందాలు
అవును! జవానుని, జనాన్నీ
ఆస్త్రిచ్ ఈకలతో దేహం అందగించుకున్నాం
ఆడి పాడేము, నవ్వుకున్నాం
కలిసి తిన్నాం, కలిసి తాగేము
అమరుల శాంతికి.
కలిసి మా విముక్తిని ధార పోసాం.
మా కొత్త దుమ్ముపట్టిన పాత్రలోకి
V-8 వాహనాలు నడిపేరు
నాయకులైన గెరిల్లా జనరల్స్
అశాంతి సంపదలో ఈదులాడేరు
జూబా వేడిని యైర్కండీషన్లు లాగేసాయి
కొత్తగా వచ్చిపడ్డాయి బంగళాలు, సౌధాలు.
నైవాశా రోజుల తర్వాత...
అటకల్లేని, కిటికిల్లేని పూరి గుడిసెల్లో
మా యుద్ధం ఈగలతో,
వేడిమితో
ఇ మాన్యియల్ మొనికొల్, (కెన్యా)
(తెలుగుసేత :లలిత్ ప్రసాద్ )
Next Story