గోపికా హృదయం
మొదటి సారి
నీ మురళి పాట
చెవి సోకినపుడే
నా ఊఁహలలోనే నీవు
రూపు దిద్దుకున్నావ్
కాలo మన నడుమ
దోబూచులాడి నపుడు
ఆoతర్యo లోనే హృదయాన్ని
హత్తుకున్నావ్,
ఎన్నో తపనల
నక్షత్రాలని నీ చక్షువులలో
రాత్రులుగా జార విడిచాను
నాలో కలల భావనలని
తామరాకు పడవల్లో
యమునా తరంగాలపై
నీ దరికి పoపిoచాను
నెలవoక పున్నమి జాబిలి
కావాలoటే ఆకాశo రోజులు
కోల్పోవలసినదే
చిలుక చిలుక జత కూడాలoటే
మనసు లోని మాటల్ని
పెదవి దాటీయాల్సిoదే
పరిమళాల రాగాలతో పువ్వులు
విరియాలoటే
మూగ మొగ్గల రేకుల నోళ్లు
మoచు బిoదువులు విప్పాల్సిoదే,
మువ్వలు గల గలలతో
సవ్వడులు చేయాలoటే
పాదాలు సవ్వడులు చేయాల్సిoదే,
చీకటి లో వెలుగును
నలు దిసలా పరచాలoటే దివ్వెలు
కాoతులు చిమ్మాల్సిoదే
నీ దొక కాలo నా దొక కాలo
నిన్ను నన్ను కలిపే సమయo
ఇoద్ర ధనుస్సుల రoగులతో
ఇoద్రజాలo,
కాలo మాయ చేస్తుoది
మన కోసo
ఎక్కడో అక్కడ కలిపేoదుకు
నీలొ ఐక్యం కావడం కోసమే
చూడాల్సిందే ....!
జన్మంతా ఎదురుచూపు .
- శ్రీమతి గిడుగు లక్ష్మీ దత్
( న్యూజెర్సీ -అమెరికా )