Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    మరోకోణం

    By Telugu GlobalDecember 9, 20223 Mins Read
    మరోకోణం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    “హాయ్! అత్తా! ఎప్పుడొచ్చావు? అంతా కులాసాయే కదా?” అంటూ వచ్చిన మేనకోడలు ప్రతిమ వైపు చూసింది సుధ. అధునాతనం అనే ముసుగులో పూర్తిగా మునిగినట్లు అడ్డదిడ్డంగా ఉన్న ఒక డ్రెస్లో, అరంగుళందాకా మేకప్ తో, లిప్ స్టిక్ తో, షేప్ చేసిన కనుమబొమలతో, చక్కటి పెద్ద తలకట్టుని సగందాకా కత్తిరించుకుని, మిగిలినదానిని గాలికి అప్పజెప్పి, శాంపూ, కండిషనర్, ఇతర సెంట్ల పరిమళాలతో వచ్చిన ప్రతిమ తన చేతిలో పెరిగిన పదహారణాల ఆడపిల్లేనా అని ఆశ్చర్యపడింది సుధ. సహజ సౌందర్యంతో అమెరికాకి వెళ్ళి, ఇలా కృత్రిమంగా తిరిగి వచ్చిన ప్రతిమ తన చేతికిచ్చిన కాగితాన్ని చూసి ఏంటి అన్నట్లు చూసిన సుధతో, ” ఇది నా జీవన సహచరుడికి ఉండవలసిన అర్హతల చెక్ లిస్ట్ అత్తా!” అంటూ నవ్వింది. ఆ లిస్ట్ ని చూసిన సుధ “మరి ఆ అబ్బాయికి నీవు నచ్చాలిగా?” అనడిగింది. ” అసలు అమ్మాయిల చూపు తమవైపు యెప్పుడు పడుతుందా అని అల్లాడిపోతున్న అబ్బాయిలకి ఇన్ని అర్హతలున్న నేను ఓకే చేస్తే అంతకన్నా అతగాడికి కావాలిసిందేముందత్తా. నేను కాస్త షాపింగ్ కి వెళ్ళె పనుంది. తర్వాత వచ్చి మాట్లాడతాను “నిర్లక్ష్యంగా అన్న ప్రతిమ మాటలకి నోటమాటరాక మౌనంగా ఉండిపోయింది సుధ.

    ప్రతిమ బి.టెక్. చేశాక, ఎమ్.ఎస్. అమెరికాలో చేసింది. అక్కడే ఉద్యోగం చేస్తూ, బాగానే గడిస్తోంది. ప్రస్తుతం ప్రతిమ నెలరోజుల శెలవుపెట్టి, పెళ్ళితంతు ముగించుకుని వెళదామని చెన్నైకి వచ్చింది.

    · కనీసం ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్

    · అమెరికా/ కెనడా/ ఆస్ట్రేలియా సిటిజెన్, ఆడంబరమైన జీవితాన్ని గడిపేవిధంగా సంవత్సర ఆదాయం కనీసం 15 లక్షలు

    · 2 – 3 యేళ్ళ వ్యత్యాసంతో, మేనిరంగు తెలుపు, ఎత్తు 5.7 దాటని, అందమైన, చురుకైన వాడు

    · చెడు అలవాట్లు, దుష్ట సహవాసాలుండరాదు

    · బట్టతల ఉండరాదు. కళ్ళజోడు అసలే ఉండకూడదు.

    · అబ్బాయి పూర్తిగా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడన్న డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి.

    · అబ్బాయి ఇంటివారి చరిత్రలో యెవరికైనా బీ.పీ, మధుమేహం, ఫిట్స్, హార్ట్ అటాక్, పిచ్చి లాంటివి ఉన్నాయేమో ముందుగానే తెలపాలి.

    · కూడా పుట్టినవారుండాలి కానీ వీరితో కలిసి ఉండకూడదు

    · అతని పేరిట సొంత ఇల్లు, కారు ఉండాలి, కానీ అప్పులు అతనే కట్టుకోవాలి.

    · తలిదండ్రులుండాలి కానీ వారి బాధ్యత ఉండరాదు. వాళ్ళు తమ ఇంటికి దగ్గరలోనే వేరే ఇంట్లో ఉండాలి. తమ అవసరాలకి వారి సహాయ, సహకారాలుండాలి. తమ వైవాహిక జీవితంలో ఇతరుల ముఖ్యంగా అబ్బాయి ఇంటివారి జోక్యం ఉండరాదు.

    · భార్య జీతంపై ఆధారపడకూడదు. అది పూర్తిగా ఆమె ఇష్టం. అతని జీతంతోనే ఇల్లు గడవాలి. సెలవులలో భార్యకి మందుపార్టీలలో పాల్గొనడానికి పూర్తి స్వేచ్ఛ నివ్వాలి.

    · కట్నాలు, కానుకలు, లాంఛనాలు వగైరాలు అడగరాదు. పెళ్ళి నిరాడంబరంగానే జరపబడుతుంది. ఆడంబరంగా చేయాలంటే, పెళ్ళిఖర్చును ఇరువైపులవాళ్ళు సమానంగా పంచుకోవాలి.

    · పెళ్ళి చూపులప్పుడు వరుడు, వధువు విడిగా, స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. కొన్ని రోజులు తమ అభిరుచులు, భవిష్యత్తు గురించి సంభాషించుకున్నాక, ఇద్దరి అంగీకారంతోనే పెళ్ళి జరుగుతుంది.

    ఇలా సాగిన జాబితాను చూస్తూ, సాలోచనగా కాస్సేపు ఉండిపోయింది సుధ. సాయంత్రం ముఖం కడుక్కుని, అల్పాహారం తీసుకుంటున్న సమయంలో షాపింగ్ కి వెళ్ళిన ప్రతిమ తిరిగి వచ్చింది. అత్త పక్కనే కూర్చుని, ఆమె ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుంటూ, “అత్తా! నీవు, మామయ్య వచ్చి, నాతో కొన్నాళ్ళు ఉండరాదూ అమెరికాలో? అక్కడ ఉన్న వసతులు, శుచి, శుభ్రతలు, వెడల్పాటి రహదారులు, ప్రశాంతమైన, అందమైన పరిసరాలు నీకు చాలా నచ్చుతాయి. అసలు ఒకసారి అక్కడి సుఖాలని అనుభవిస్తే, మళ్ళీ తిరిగి రాబుద్ధి కాదు. తెలుసా?” అంటూ నవ్వింది. “మరి నీకు ఇక్కడ పనిచేసే అబ్బాయే భర్త ఐతే, నీవిక్కడే ఉండాలికదా?” అన్న సుధతో ప్రతిమ “అత్తా!అందుకేగా నా చెక్లిస్ట్ లో అన్ని నిబంధనలని పెట్టాను… అతడు నేనున్న ఊర్లోనే ఉండేట్లయితే, పెళ్ళి అక్కడే సింపుల్ గా చేసుకుంటాం. అక్కడే ఉండేటట్లయితే మిగిలిన నిబంధనలన్నీ హుష్ కాకి ఐపోతాయి.. ఐనా నేనొకరిని యెంపిక చేసుకున్నాను. ఇదుగో అతడి వివరాలు ” అంటూ గలగలమని హాయిగా నవ్వుతూ తన మొబైల్ లోని వివరాలను చూపించి, అందులో ఉన్న మొబైల్ సంఖ్యకి ఫోన్ చేసి, అత్తని మాట్లాడమంటూ “నేను రావడానికి ఆలస్యమవుతుంది. నా స్నేహితురాలికి వచ్చేవారం పెళ్ళి కనుక మాకందరికీ మందు పార్టీ ..అంటే బాచిలర్స్ పార్టీలాంటిదనమాట ఇస్తోంది. కనుక రాత్రి నీవు డిన్నర్ తినేసెయ్ అత్తా! మనం రాత్రో, రేప్రొద్దునో తీరికగా మాట్లాడుదాం. బై, అమ్మా! బై” అంటూ స్టైల్ గా ముఖం పై పడుతున్న జుట్టుని వెనక్కి సుతారంగా తోసుకుంటూ , హైహీల్స్ ని టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయిన ప్రతిమ వంకే చూడసాగింది సుధ.

    సుధ అలాగే అతనితో మాట్లాడటం చేసింది. గబ గబా పక్కనే ఉన్న కాగితంపై యేదో రాసుకుంది. పదినిమిషాల తరువాత ఫోన్ ఆపుచేసి, ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాక మౌనంగా ఆ కాగితాన్ని ప్రతిమకి అందించింది సుధ. అందులోని విషయాన్ని చదివిన ప్రతిమ అవాక్కైంది. విషయం అర్థంకాని రమ కూతురి చేతిలోంచి జారిపడిన కాగితాన్ని చదివి ‘ఇప్పుడేమంటావ్? ‘అన్నట్లు ప్రతిమవైపు చూసింది. ఇంతకీ అందులోఉన్నదేమిటంటే అమెరికాలో ఆరేళ్ళు బాగా సంపాదించిన ఆ అబ్బాయి ఆర్జించింది చాలనుకుని, ఇక్కడికి వచ్చేసి స్వగ్రామంలో కొత్తగా ఒక కంపెనీ పెట్టి, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధినీయాలనుకుంటున్నాడు. కలిసి ఉంటే కలదు సుఖమనే భావనతో ఉమ్మడికుటుంబంలో సర్దుకుపోయే, ఆరోగ్యమైన, తనకు అన్నివిధాల సహాయసహకారాలందించే, డిగ్రీ చదువుకున్న, కాస్మెటిక్ వాడని, చెడు అలవాట్లు లేని, చిరునవ్వు, ఓపిక, సర్దుకుపోయే గుణాలున్న, మన సంప్రదాయాలపై అవగాహన, మనదేశంపై భక్తి, పెద్దలయందు గౌరవం ఉన్న అమ్మాయిని నిరాడంబరంగా వివాహం చేసుకుంటాడట.”

    అంతదాకా నిబంధనలని తను మాత్రమే వేయవచ్చు అనుకున్న ప్రతిమకి ఎదుటివారు కూడా నిబంధనలు వేస్తారని అర్థమై, యేమి చేయాలా అన్న ఆలోచనలో పడింది, ఆ అబ్బాయి చెక్ లిస్ట్ పెట్టిన ‘చెక్’ తో.

    డా. తిరుమల ఆముక్తమాల్యద, (చెన్నై)

    Dr Tirumala Amuktamalyada Marokonam
    Previous Articleమహిళా ఉద్యోగుల్ని టార్గెట్ చేసిన మస్క్.. ట్విట్టర్ పై మళ్లీ కేసులు
    Next Article మానవత్వమే చిరునామా…!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.