వృద్ధాప్యం
ఏ గుండె తలుపు తట్టిన
అనుభవాల-జ్ఞాపకాలు సముద్ర తరంగాల్లా
ఉప్పొంగుతాయి.
వినే శ్రోతలే ఉండరు.
ముడతలు పడ్డ శరీరం
ఎన్ని పార్లర్లు తిరిగిన తరలిరాని యవ్వనం.
యవ్వనంలో ఖర్చు చేసిన వయస్సు
సత్తువ తగ్గిన ఎముకలు .
బ్రతుకంతా దేనికో దాని కోసం నిరీక్షణ.
నిరీక్షణ తో చూపు తగ్గిన నిర్జీవపు కన్నులు.
అదే జీవితపు ఆఖరి దశ వృద్ధాప్యం.
రాత్రి పగలు కాలచక్రం
పగలు తర్వాత రాత్రి
యవ్వనం తదుపరి వృద్ధాప్యం.
దీన్ని ఆపడం ఎవరి తరం.
వీరికి సహకరించాలి యువతరం.
వృద్ధాప్యము అనుభవాల గని.
భావితరాలకు ఆదర్శంగా నిలిచే పందిరి.
రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి వెళ్ళిపోతే
రెక్కలుడిగిన జటాయువులా పరమాత్ముని చూపుకై
అన్నీ ఉన్నా ఒంటరితనమే మానసిక రోగo
కాలాన్ని భారంగా గడిపే కర్మయోగి .
మనీ ఉంటుంది మాట్లాడే మనిషి ఉండడు.
అనుభవాలు పంచుకుందాం అంటే అందరూ ఆమడదూరం. సెల్ఫోన్ శరణ్యo.
విపులంగా మాట్లాడదామంటే బిల్లుల మోత.
ఎలా అవుతుంది కాలక్షేపం వృద్ధులకి.
అందుకే తనలో తాను మాట్లాడుకుంటారు.
డబ్బుతో కొనలేనిది బంధం
మాటతో దగ్గర చేర్చెది అనుబంధం.
వృద్ధాప్యం లో కావాలి ఆసరా.
అనుబంధమే నీకు వసారా.
పంచభక్ష పరమాన్నం కోరడు పట్టెడన్నం హద్దు.
పన్నీర్ అక్కరలేదు పలకరింపు చాలు.
పట్టు పరుపుల మాటే లేదు పద్దతులు బాగుంటే చాలు.
ఆత్మ పరిశీలన అనుక్షణం ముఖ్యం.
వయసుడిగిన తర్వాత అదే మనకు సదా రక్షణo.
బాగున్న క్షణం గురించి సంతోషించు.
మరుక్షణం నీది కానప్పుడు ఆలోచించకు.
చేసిన పాపపుణ్యాలు లెక్క మనకు తెలియదు.
నీ సంపదల లెక్క చూసి కాలం వృధా చేయకు.
సంపదలన్నీ ముందుగానే సర్ది పెట్టు.
డబ్బుకి దాసోహం లోకం తీరు.
లోకం తీరు మనకి కనువిప్పు.
పైసాయే పరమాత్మ పక్కన పెట్టు
పరమాత్మ పాదాలని గట్టిగా పట్టు
ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే ప్రయాణం.
మనసు అందుకు సంసిద్ధంగా పెట్టు.
నేను నిన్ను భయపెట్టలేదు నా మీద ఒట్టు.
నిత్యం మనం చూస్తున్నది అదే చోద్యం.
అబ్బాయి అమెరికా ప్రయాణం అమ్మ వృద్ధుల ఆలయం
ఎటు పోతుంది సమాజం. చోద్యం చూస్తోంది దైవం.
పెంపకమే లోపo . పరిస్థితుల మీద నెపం.
ఇది కూడా ఒక సామాజిక రుగ్మతo.
కన్యాశుల్కం కథ అయిపోయింది.
ఆ పుణ్యం గురజాడ వారిదే.
ఆడపిల్ల దొరకడం అంబరం
వరకట్నం ఆల్మోస్ట్ ఖతం.
అనాధలకు కావాలి అనాధ శరణాలయం.
వృద్దులకు కాదు. అది తెలుసుకోవాలి ప్రజానీకం.
తెలియ చెప్పే వాడు ఎక్కడో పుట్టి ఉంటాడు.
అది నా ఆశావాదం.
రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
(సామర్లకోట)