Telugu Global
Arts & Literature

మనిషే మాధవుడు (గేయం)

KVS Gouripati Sastrys Telugu Song Manishe Madhavudu
X

మనిషే మాధవుడు (గేయం)

మాయ మవుతున్నాడమ్మా మడిసన్నవాడు

మానవత్వపు ఛాయలు మరిచి

మనిషి మనిషిలో స్వార్థం రగిలి

మాయ మాటల కోటలు కట్టి

మనసున మమతలే చంపుకొని

మనిషి మనిషి లో ద్వేషం పెరిగి.

ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో

ఈ మనిషి జన్మయని తలచి

సమాజ హితమే మరచి

స్వార్థ పరత్వము మరిగి

సాటి జీవుల పొడయే గిట్టక

సాధు జనుల నాదరించలేక ..

ధర్మ తత్త్వము బాట విడిచి

అధర్మ మార్గమున నడిచి

ఆకసానికి నిచ్చెనలు వేసి

అందని ఫలములకు వగచి

ప్రాకృతిక ధర్మములు విడిచి

ప్రపంచ సుఖములను వలచి..

తానే అధికమని తలచి

తర తమ భేదములు మరిచి

తనువే శాశ్వతమని తలచి

తనువిచ్చు అమ్మలను చెరచి

వయసు భేదములు మరచి

వలచిన వారిని హతమార్చి

మనిషి లోన మనిషే లేచి

మానవత్వమే చాటు కొని

సమాజ హితమే కాంక్షించి

సాటి జీవుల మనసు గెలిచి

మమతల దీపాలు వెలిగించి

మనిషి మనిషిగ మేల్కొన్న

మాయమైన మనిషి తిరిగొచ్చిన

మనిషే మాధవుడు కదరన్నా....

- KVS గౌరీపతి శాస్త్రి (విశాఖ)

First Published:  4 May 2023 8:09 AM GMT
Next Story