Telugu Global
Arts & Literature

రెక్కలు విరుస్తున్న సమాజం (కవిత)

రెక్కలు విరుస్తున్న సమాజం (కవిత)
X

అక్కరకు చేర్చుకుని

అరచేతిలో పెంచాల్చిన బంధాలు

సమాజం దృష్ట్యా

నియమ నిబంధనల పేరుతో

రెక్కలు విరచి

మూలన కూర్చోమంటున్నారు

కలలోనైనా ఇలలోనైనా

ఒక్కరి మార్గ నిర్దేశకంలో

నడవాలే కానీ

స్వీయ ఆలోచనలకు తావు లేదు

స్వవిజయాలకు విలువుండక

ఆడదని అలుసు ఈ సమాజానికి

సమాజంలో ఎత్తిపొడుపులు

గృహంలోన గడపలేని క్షణాలు

ఆశయాలు చంపుకోలేక

ఎదురు నిలిచి ఎదిరించలేక

అన్యాయంగా అంధకారంలో ఉండిపోతున్నాయి ఆడజన్మలు

అవకాశం ఇచ్చి చూడండి

అవధులు దాటి

అడ్డంకులను అధిగమించి

విజయపతాకాన్ని ఎగురవేసి

చిరస్థాయి గా పేరుప్రఖ్యాతులు నిలుపగలరు ఈ నారీమణులు....!!

-కిడాల శివకృష్ణ

(వెంగళ్ళాంపల్లి,నంద్యాల )

First Published:  12 March 2023 10:31 PM IST
Next Story