Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    ఆపన్నులు

    By Telugu GlobalJanuary 17, 20239 Mins Read
    ఆపన్నులు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్ ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజు కిక గుడి ద్వారంమూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా లేదాననిచూశాడు పూజారి తిరువనంతాచార్యులు.

    లైట్లన్నీ ఆర్పి ఆలయపు ఆవరణ లోనే మిద్దెపై నున్ననివాసానికి వెళుతూ చావడి మూలన ఏదో ఆకారం కదిలినట్లనిపించి లైట్ వేశాడు.

    ఎవరో వ్యక్తి మూలగా గోడను ఆనుకుని కాళ్ళుజాపి కూర్చుని జోగుతున్నట్లనిపించి ‘ఎవరదీ?’ గద్దించిఅడిగాడు పూజారి.

    అతని నుంచి సమాధానమేమీ రాలేదు.

    “గుడి మూశాను … ప్రసాదం అయి పోయింది.అందరూ వెళ్లారు. మీరు కూడా వెళితే బయట తలుపులు మూస్తాను” అన్నాడు పూజారి.

    అతనిలో కదలిక లేదు. మనిషి మాట్లాడ లేదు.పూజారి కంగారుగా నాలుగంగల్లో అతన్ని చేరి మసకవెలుతురులో పరికించాడతణ్ణి. మధ్య వయస్కుడు.

    వయస్సుసుమారు ఏభై ఐదు, అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి.

    పొట్టి లాల్చీ, జీన్స్ ప్యాంటులోఉన్నాడు.

    చేతికి ఖరీదయిన వాచీ, ఉంగరపు వేలుకి వజ్రపు టుంగరం. పక్కనే బ్యాక్ ప్యాక్.

    ఉన్నవాడిలా కన్పించాడతను. తక్షణం పూజారి తిరువనంతాచార్యులు అతని చేయి నందుకుని ‘నాడి’ పరీక్షించాడు. మెల్లగా కొట్టుకుంటోంది. ఆయుర్వేద వైద్యంలో ప్రవీణుడయిన ఆయనకు స్పష్టమయింది ఆవ్యక్తి ఆహారం తినక నీరసంతో పృహ కోల్పోయాడని.

    భార్య పారిజాతంను కేకేసి “త్వరగా గ్లాసెడు మంచినీళ్లు తీసుకురా” బిగ్గరగా అరిచాడు పూజారి మిద్దెపైనున్న భార్యకు వినిపించేలా .

    పరుగున మంచినీళ్ళు తెచ్చిందావిడ.

    నీళ్లు చిలకరించాడతని మొహాన పూజారి .అతని కనురెప్పలు కదిలాయి. మెల్లగా కదిలాడు. కదులుతున్న కనుగుడ్ల ఆనవాలు కనురెప్పల పై నుంచి పసిగట్టి, గట్టిగా తడుతూ అతన్ని స్పృహలోనికి రప్పించే ప్రయత్నం చేశాడు పూజారి.

    నీరసంగా కళ్లు తెరుస్తూనే పూజారి వంక చూస్తూ “అనంతూ” అన్నాడతను హీన స్వరంతో.

    ఆ పిలుపుకు అనూహ్యంగా స్పందించింది అనంతు హృదయం.

    మనసు ఉత్తేజితమయింది. ఒళ్ళు గగుర్పాటు చెందింది. వివశుడయ్యాడతను.

    ముప్ఫై అయిదు సంవత్సరాల పైమాటే అతనా పిలుపువిని.

    “ప్రకాశం…నువ్వా..? ఒళ్ళు తెలియని ఉద్వేగంతో లేచి ఒంగుని ప్రకాశం భుజాలు పట్టుకుని కుదుపుతూ మోకాళ్ళ మీద నిలిచి, తలవెనకాలగా ఎడమచేతిని ఊతంగా చేర్చి కాసిన్ని మంచినీళ్లు పట్టాడతనికి. మిద్దె పైన తనింటికి తీసుకెళ్లాడు తిరువనంతాచార్యులు కొద్దిగా తేరుకుని కళ్ళు తెరిచి కొద్దిగా వెనక్కి జరిగి నీరసంతో గోడకు చేరగిలబడ్డాడు ప్రకాశం .

    భార్య పారిజాతంను కేకేసి “పారిజాతం కొద్ది పంచదార వేసి త్వరగా వేడిపాలు తీసుకురా” అని భార్యకు చెప్పాడు తిరువనంతాచార్యులు.

    ఆమె తెచ్చిన వేడి పాలు త్రాగి తేరుకున్నతను “అనంతూ… నీలో పెద్ద మార్పేమీ లేదు. వయస్సు ఛాయలు కనబడుతున్నాయి. అంతే తేడా. నువ్వునన్ను గుర్తించలేదు” రహస్యం చెబుతున్నట్లుగా మెల్లగా అన్నాడు ప్రకాశం.

    “తరువాత మాట్లాడదాం ప్రకాశం! ఎప్పుడు తిన్నావు?” ప్రశ్నించాడు తిరువనంతాచార్యులు.

    “నిన్న ఉదయం భోజనం చేశాను. తరువాత ఏమీ తినలేదు. గుడిలోనికి వస్తూనే కళ్ళు తిరిగినట్లనిపించింది.

    ఈ మూలకు వచ్చిగోడకు అనుకుని కూర్చున్నాను తరువాత ఏమయిందో తెలియదు” అన్నాడు ప్రకాశం, “నీరసంగా ఉన్నావు. కొద్దిగా తిని, విశ్రాంతితీసుకుందువుగాని. ఉదయాన్నే మాట్లాడు కోవచ్చు” అంటూ ప్రకాశానికి చేతినందించి మిద్దెపైని తన ఇంటికితీసుకువెళ్లాడు తిరువనంతా చార్యులు

    తెల తెలవారుతూనే లేచేసరికి గుడి గంటలు,సుప్రభాత మంత్రాలు వినబడ్డాయి ప్రకాశానికి, లుంగలు చుట్టిన పాత దూది పరుపుమీద,చిరుగుల తెల్లటి చలువ దుప్పటి, కొసలువ్రేలాడుతున్న తెల్లటి గలీబులో గట్టి పల్చని దిండు. పేదరికం తాండవిస్తూ కనిపించిందా ప్రదేశం.పక్కనే ఇంకొక పరుపు చుట్టేసి ఉంది.

    ‘ఓరాత్రి అనంతు ఇక్కడే పడుకుని లేచి వెళ్లినట్లుంది’ అనుకుంటూ రాత్రి జరిగినదంతా మననం చేసుకుని, లేచికూర్చుని పరిసరాలు పరికించి చూశాడతను.

    గోడలకి తాపడం చేసిన చైనా పింగాణీ టైల్స్, బెల్జియం అద్దాలతో నిగలాడుతూ ఉండే ఆ అద్దాల చావడిని శిథిలావస్థలో చూసి చలించిపోయాడు ప్రకాశం.

    పురాతన కట్టడం. జీవంపోయి, సున్నపుతాపడం పెచ్చులు ఊడిన గోడలు, నెర్రెలు బాసిఎర్రటి తారసు బిళ్ళలు జారి ఊడి పడేట్లుగా ఉన్న పైకప్పు ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగావుంది. మాసిన చావడిలో మూసివున్న రెండుపడక గదులు, ఇంకొక పక్క నల్లమద్ది భోషాణం, పాత ఎఱ్ఱమద్ది పందిరిమంచం, చేతులు విరిగినటేకు కుర్చీల కుప్ప ఆ మిద్దె శిథిలావస్థకు సాక్షీ

    భూతంగా పడివున్నాయి. కిటికీ నుంచి కనిపించేపూలతోట, తులసివనం, పెద్ద నందివర్ధనచెట్టు మాయమయ్యాయి.

    తోటచుట్టూవున్న ప్రహరీ గోడ ఆనవాళ్లు లేవు. పిల్లల ఆటస్థలమైనట్లుగావుంది. వేప,

    రాగి, ఉసిరి వృక్షాల ఉనికే లేదు.

    బాల్యంలో అదే ఆవరణలో తిరుగాడిన జ్ఞాపకాలు దొంతర్లుగా ప్రకాశం బుర్రలో తిరుగాడాయి.

    **

    “అనంతూ! ఈ రోజు సినిమాకెళదాం”

    సంవత్సర చివరి పరీక్షవుతూనే అన్నాడుప్రకాశం.

    “వెళదాం గాని ఏమైంది మీ నాన్నగారితిరుగు ప్రయాణం?” అన్నాడు అనంతు.

    “అదే అనంతూ! ఎలా చెప్పాలో అర్ధంగావడం లేదు. నాన్నగారొక్కరే వెళతారనుకున్నాను.

    వారం రోజుల్లో అందరం బయలుదేరాలట.

    మొత్తం కుటుంబం ఇండియా నుంచి వెళుతున్నామట. నా చదువక్కడే. మళ్లీ వస్తామో,

    రామో… తెలీదు. అనంతూ!” అంటూ అతన్నిచుట్టుకుని బావురుమన్నాడు ప్రకాశం.

    ప్రకాశం మాటలు విన్న అనంతు ముఖంఒక్కసారిగా వివర్ణమైంది.

    ప్రాణ స్నేహితుడు తనని వదలి వెళ్లిపోతున్నట్లుగా అర్ధమయింది. కాళ్లక్రింద భూమి

    కదిలిపోతున్నట్లనిపించిందతనికి. తన చదువంతటితో ముగిసినట్లేనా…? ఇన్నాళ్లు ఖర్చు

    భరించి చదివించిన స్నేహితుని తండ్రి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తు అర్ధం కావడంలేదు.

    “కలిసి బి. ఇ చేద్దామనుకున్నాం కదా! చదువక్కడే అంటావేంటి? ఊరికి తిరిగి రావడంలేదా? మరి ఆస్తి, ఇల్లు, గొడ్లు?” తిరిగి వస్తా

    మని చెబుతాడేమోనన్న గంపెడాశతో అన్నాడుఅనంతు.

    మౌనంగా నేలచూపులు చూస్తున్న ప్రకాశాన్ని చూసి “అవును కదా! ఆవిషయాలునీకెలా తెలుస్తాయి? మన చేతిలో ఏముంది.

    పెద్దవాళ్ళ నిర్ణయం. మనమేం చేయగలం”అన్నాడు అనంతాచార్యులు నిట్టూరుస్తూ.

    “నిజంగా ఆవిషయాలు నాకు తెలియవు అనంతూ! నాన్నగారినడిగాను, నీ చదువు

    గురించి ఫీజులగురించి…” మొహమాటంగాఅన్నాడు ప్రకాశం.

    “ఆయనేమన్నారు ?”

    “నీ వెంతవరకు చదివితే అంతవరకూ తనేచదివిస్తానన్నారు. వెళ్ళేలోపు కొంత డబ్బు మీ నాన్నగారికిచ్చి నీ చదువు విషయం మాట్లాడతా నన్నారు” అన్నాడు ప్రకాశం.వింటూనే అనంతు ముఖం వికసించింది.

    ఆ వారం రోజులు సినిమాలు,

    షికార్లు ఒకర్నొకరు వదలకుండా తిరిగారిద్దరు స్నేహితులు.

    ప్రకాశం వెళ్లే రోజు రానే వచ్చింది. తిరువనంతాచార్యుల చదువుకయ్యే మొత్తం ఖర్చు తనేభరిస్తానని భరోసా ఇచ్చి, చదువు ఎట్టి పరిస్థితు

    ల్లోనూ ఆపవద్దని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వెళ్లారుప్రకాశం నాన్నగారు.

    చిన్ననాటి నుంచి కలిసి

    చదుకున్న ప్రాణ స్నేహితులు అలా విడిపోయి’చికాగో’ వెళ్ళిన ప్రకాశం ఇప్పడిలా ప్రత్యక్షమయ్యాడు దేవాలయంలో.

    ప్రకాశం నిద్రలేచాడో లేదో చూద్దామని

    అక్కడికొచ్చిన పారిజాతం “లేచారా బాబూ!గుడి వెనకాల చేద బావి ఉంది. బ్రష్ చేసుకుని

    రండి. కాఫీ ఇస్తాను” అని చెప్పి వెళ్ళింది పారిజాతం.

    “అలాగేనమ్మా” అంటూ లేచి పక్కబట్టలుమడత బెట్టి బ్యాగ్ లో కిందకు వచ్చి చేద బావి

    దగ్గర బ్రష్ చేసుకుని, మొండి గోడల బాత్రూమ్ లో స్నానం చేసి పైకి వచ్చేసరికి గుళ్లో పూజ

    ముగించుకుని వచ్చాడు తిరువనంతాచార్యులు.

    దగ్గరిగా ఒకరినొకరు చూసుకున్నారు స్నేహితులు.రాని వయస్సు ముఖంలో కనబడుతున్నా

    తరగని ముఖ వర్చస్సు, చెరగని చిరునవ్వు.ఉంగరాలు తిరిగి నిగనిగలాడుతు భుజాల

    మీదకు జారిన వత్తైన నల్లటి జులపాల జుట్టు,నిగ నిగలాడే నల్లటి విగ్రహం, తిరునామాలు!

    అతన్ని చూస్తూనే లేచి నిలబడి అప్ర

    యత్నంగా తలవంచి రెండుచేతులు జోడించినమస్కారం చేశాడు ప్రకాశం.

    ప్రతి నమస్కారం చేసి రెండుచేతులు పైకెత్తి”ఆయుష్మాన్ భవ” అని అలవాటుగా దీవించి,

    ప్రకాశం చేతిని పట్టుకుని పరీక్షించి “నాడినిక్షేపంలా వుంది. ఇక చెప్పరా… ప్రకాశం!”

    అన్నాడు తిరువనంతాచార్యులు .

    ఇంతలో పారిజాతం కాఫీ తేవడంతో ఇద్దరుకాఫీ ముగించుకుని హాలులో కూర్చున్నారు.

    “నోరు జారాను. ఏమీ అనుకోవద్దు?

    ఏమిటీ రాక? ఎక్కడనుంచి? ఎక్కడ దిగావు?అమెరికా నుంచెప్పుడొచ్చావు?” అన్నాడు తిరువనంతాచార్యులు చొరవగా,

    “ఏం ఫరవాలేదు. నువ్వెలా పిలిచినా నాకీబ్బంది లేదు. అలాగే పిలువు! మనసుకు హాయిగా

    ఉంది. అమెరికా నుంచి ఇండియా వచ్చి రెండువారాలైంది.

    కాశీ నుంచి కన్యాకుమారిదాకా తిరిగి

    చివరిగా తిరుపతి నుంచి వచ్చాను. నా సంగతలా ఉంచు. నేను వెళ్లిన దగ్గరినుంచి నీచదువు, పెళ్లి,

    పిల్లలు… అన్ని విషయాలు చెప్పు”

    అన్నాడు ప్రకాశం.

    ఒక్కడివే వచ్చావా? భార్యా పిల్లలెవరూ నీతో రాలేదా? ఎలావున్నారు వారంతా? నువ్వేమీ బాధల్లో లేవుకదా?” ప్రశ్నార్థకంగా చూశాడు తిరువనంతాచార్యులు.

    “నేనొక్కడినే వచ్చాను. నాకు ఒక అమ్మాయి,ఒక అబ్బాయి. భార్య తెలుగమ్మాయే. అందరూ

    బావున్నారు. బాగా సంపాదించాను. ఎలాటిబాధలూ లేవు. ఒక పని మీద వచ్చానిక్కడికి.నీ కథ అంతా విన్నాక నావిషయాలన్నీ చెబుతాను. ముందుగా నీ వంతు!” అన్నాడు

    ప్రకాశం.

    “ఇన్ని సంవత్సరాలు మాతృదేశానికి,

    మాతృభాషకు దూరంగా అమెరికాలో

    తెలుగుభాషా ఉచ్చారణలో ఏమాత్రం తేడారాలేదే!”… నవ్వి ఊరుకున్నాడు ప్రకాశం.

    “నాచదువుకి మీనాన్నగారిచ్చిన డబ్బుఇంటి అత్యవసరాలకి ఖర్చు చేశారు. బి. ఇలో సీట్ వచ్చింది. చేర్పించలేదు. నా మాట వినే వారు లేకపోయారు.చదువాగిపోయింది.పూజాదికాలుమొదలెట్టాల్సివచ్చింది.

    మామయ్య కూతురు పారిజాతంతో పెళ్లయింది.వరుసగా ఇద్దరు మగపిల్లలు. వారిద్దరూ ఇంటర్ తో చదువు ఆపేశారు. ఈ వృత్తి వద్దుచదువుకొమ్మని చెప్పినా ఇద్దరికీ చదువబ్బలేదు.ఇద్దరూ పూజారులే.

    పట్నంలోవారి బ్రతుకులు వారీడుస్తున్నారు.ఇక నా సంగతి కొస్తే … అదిగో! ఆయన,

    మేము ఒకలాగే ఉన్నాము” అన్నాడు తిరువనంతాచార్యులు గుడివైపు చూపిస్తూ.

    అతని కళ్ళలో, మాటల్లో చెప్పలేని, వ్యక్తికరించని లోతైన వైరాగ్య భావన, బాధ ప్రస్ఫుటంగా కన్పించాయి. విన్పించాయి.

    “సంపాదన గురించేకదా నువ్వలా అన్నది… ఎందుకలా అన్నావు? నాకర్ధం కాలేదు. వివరంగా చెప్పు”

    “కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదు. వస్తున్నది, భగవంతుడు ఇస్తున్నదంతేనని నమ్మకం.

    అది తప్పో, ఒప్పో తర్కించే తత్వంకాదునాది! ఈ మాట నా నోట మొదటిసారిగా బయటకన్నాను. బ్రతుకీడ్చడానికి సరిపుచ్చుకునే

    సంపాదన.ఇంగ్లీషులో అంటారుగా ‘స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’… అదే మా పరిస్థితి!ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆ వైద్యాన్ని,నన్ను నమ్మేవారు ఒకరో, ఇద్దరో రోగులు.వారేమైనా ఇస్తే పుచ్చుకుంటాను.దేవుడి మాన్యం రెండెకరాల పొలం కౌలువస్తే వచ్చినట్లు. చేతికొచ్చిందాకా గండమే.

    తుఫాన్లు మింగుతాయో తెలియదు. కౌలుదారుఎంతిస్తాడో, ఎగొడతాడో తెలియదు.అది తప్ప వేరే చెప్పుకోతగ్గ ఆదాయం లేదు.

    పారిజాతం ముప్పూటలా కష్టపడుతుంది.

    ఎంబ్రాయిడరీ, టైలరింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. పిండి వంటలు చేస్తుంది. నిజంచెప్పాలంటే తన సంపాదనే సంసారానికి అక్కర.

    ఈ ఊళ్ళోనే కాదు. ఎక్కడో ఒకటి, అరా

    తప్ప గ్రామాలలో దేవాలయాల పరిస్థితి, పూజారుల పరిస్థితిదే !” అన్నాడు తిరువనంతాచార్యులు.

    “అంటే ఆర్ధికంగా పరిస్థితి గొప్పగా లేదనే కదా… నీవనేది”

    “అవును! తరాలు మారాయి. నమ్మకాలుసడలాయి. విశ్వాసాలు మారాయి. మారుతున్నాయి.

    ఇదివరలో రైతులు కూరగాయలతో సహాఇంటికి సంబారాలు పంపేవారు. అన్నీ ఆగిపోయాయి.

    దీప, ధూప నైవేద్యాలకే నెలకు రెండు వందలన్నారు. ఇప్పటికి ఏడేళ్లుగా అదీ రాలేదు.పూజార్లకు జీత భత్యాలంటూ లేవు. హారతి

    పళ్లెంలో కానుకలు అరుదే.

    తరచూ దేవాలయానికి వచ్చే మనిషి ఇంటనేదణ్ణం పెట్టుకుంటున్నాడు. గుడికి రావడంతగ్గింది. పుట్టినరోజునో లేక పండగకో, పబ్బానికో మాత్రమే గుడికి రావడం. అదీ సమయం

    దొరికితే! గుళ్లోనుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు ఊళ్ళోకెళ్ళి పదేళ్ల పైగా అయింది.

    ఇకముందు వెళతాయన్న నమ్మకం లేదు. దానికితోడు ఏదో ‘అంటు’ రోగంతో మేటి ప్రపంచమే

    ముడుచుకు కూర్చుంది. ఇక మా బోటివారెంత?”

    “అంటే జనాలలో మార్పు వచ్చిందనా

    నువ్వనేది?”

    “పూజారిగా నేను ఆ విశ్లేషణ చేయ తగనేమో !”

    “అనంతూ ! నాకో ఇల్లు కావాలి ” హఠాత్తుగా టాపిక్ మారుస్తూ అన్నాడు ప్రకాశం,

    “ఇల్లేమిటి? అద్దెకా… కొనడానికా? ఆమెరికా తిరిగి వెళ్లడం లేదా?” ఆశ్చర్యంగా అన్నాడు తిరువనంతాచార్యులు.

    “ఇప్పుడే వెళ్ళను. కొన్నాళ్లపాటిక్కడే, ఈ ఊళ్ళోనే

    ఉందామనుకుంటున్నాను”

    “మీ నాన్న పాలికి వచ్చిన పాత పెంకుటిల్లుఎన్నో ఏళ్లుగా తాళం వేసిఉంది. నువ్వుండ

    డానికి బాగుండదేమో! ఆస్తి పంపకాలలోమీ తాతగారు మీ నాన్న పేరిట విల్లులోవ్రాసిన ఇల్లది.

    ఆలనా పాలనా లేక పాడుబడింది.

    బాగు చేయించుకుని ఆ ఇంటే ఉండొచ్చేమో”

    “అలాగా! నాన్నగారనలేదు. నాకు తెలియదు. తాతగారు లేరుగా? మా పెదనాన్న,చిన్నాన్న వాళ్ళెవరూ ఆ ఇంటిని అట్టేపెట్టుకోలేదా? ఇల్లు మాపాలికి వచ్చినా సరే.

    ఖాళీగా ఉంటేనే చూద్దాం. ఎవ్వరినీ

    నొప్పించవద్దు. ఇబ్బంది పెట్టవద్దు”

    “మీ వారెవరూ ఆ ఇంట ఉండడం లేదు.వారందరు భవంతులు కట్టుకున్నారు. అతిథుల

    కోసం ప్రత్యేకించిన ఇల్లట”

    “అలా బయటకెళదాం!” అన్నాడు ప్రకాశంఇంటి వివరం వినడం ఇష్టం లేనట్లుగా

    “టిఫిను చేసి వెళదాం” అంటూ లోనికి వెళ్ళాడు తిరువనంతాచార్యులు.

    “ఇదే ఆ ఇల్లు ! ఇంటి తాళంచెవి ఉందేమోమీ అన్నగారింట్లో కనుక్కుందాం, అలాగే వారిం

    టికి వెళ్లినట్లుంటుంది. నువ్వు వారిని పలకరించినట్లుంటుంది” అంటూ దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఇంటి గేటు తీసి పెద్ద భవంతిలోకి

    నడిచాడు తిరువనంతాచార్యులు. అతన్ననుసరించాడు ప్రకాశం.

    పలకరింపులు, కాఫీలయ్యాక “ఏరా తోట,ఇల్లమ్ముతానా?” అన్నాడు ప్రకాశాన్ని ఉద్దేశించి పెదనాన్న కొడుకు

    “ఇంటి తాళం చెవి ఉందా? ” అన్నాడు ప్రకాశంఅతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.

    “అదిగో! ఆ మేకుకి తగిలించి వుంది. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. నువ్వేఅందుకో !” అన్నాడు తేలికగా

    “ఇంటి పేపర్లు ఉన్నాయా?” అన్నాడుప్రకాశం

    “ఉంటావా రెండ్రోజులు … ఎప్పుడొచ్చావు.ఎక్కడ దిగావు?

    రాత్రి భోజనానికి ఇక్కడికే రా!

    ఏదైనా ఎవ్వారం ఉంటే మాట్లాడుకోవచ్చు. పేపర్లు తీసిఉంచుతాను. మీనాన్న పాలికి రెండెకరాల మావిడితోట కూడా వచ్చింది. దానితాలూకూ డబ్బు, లెక్క నాదగ్గరే ఉన్నాయి. పట్టుకెళ్ళు” అన్నాడు అన్న.

    “వస్తాను…” తాళంచెవి తీసుకుని బయటకువచ్చి పక్కనే ఉన్న లోగిలి తుప్పుపట్టిన పాతగేటు తీసుకుని లోనికి నడిచారు వారిద్దరు.

    “వస్తానన్నావు?” అన్నాడు తిరువనంతాచార్యులు ప్రకాశం మొహంలోకి సాలోచనగా

    చూస్తూ,

    “భోజనానికి”

    ఇంటి తాళం తీసి “లోపల, వెనకాల పెరడుచూస్తూవుండు. పాతిల్లు, జాగ్రత్త. చూసి నడువుపురుగు, పుట్ర ఉండగలవు. కూలి మనుషుల్ని,

    సుతారిని పిలుచుకొస్తాను. ఇల్లు శుభ్రం చేయించినివాసయోగ్యంగా మరమ్మత్తులు చేయిద్దాము”

    అంటూ బజారుకెళ్ళాడు తిరువనంతాచార్యులు.

    **

    ఇంటి మరమ్మత్తులు వేగంగా అదే రోజు మొదలయ్యాయి.

    ముందుగా ఇంటావరణలో ఉన్న పెద్ద వేప చెట్టు చుట్టూ నెర్రెలు బాసిన అరుగు మరమ్మత్తుపూర్తయింది. ఇంటికప్పుపూర్తిగా తిరగవేశారు.

    గోడల మరమ్మత్తులయ్యాయి. పడకగదులకు ఎ.సి లు బిగించారు. వంటిల్లు నూతనంగా తయారయింది. బావికి మోటార్, కుళాయిలు ఏర్పాటయ్యాయి. చూస్తుండగానే రెండు వారాల్లో ఇల్లంతా హంగులతో కళకళ్ళాడింది.

    ఇంటిబయట సున్నం, లోన రంగులు అయ్యాయి

    ‘డబ్బుంటే కొండ మీది కోతైనా దిగి వస్తుందనే నానుడి కర్ధం ఇదేనేమో! పాడు పడిందనుకున్న ఇల్లు వసతులతో కళకళలాడుతోంది’

    అనుకున్నాడుతిరువనంతాచార్యులు

    “ఇంటి పనులన్నీ అయ్యాయి. ఇల్లు నివాసయోగ్యమే. నువ్వు, చెల్లాయి ఈ ఇంట్లో గృహప్రవేశం చేయాలి అనంతూ!” అన్నాడు

    ప్రకాశం

    “మేమా? ఎందుకు? ఇంటిపై బోలెడంతఖర్చుచేశావు. అంత ఆడంబరం భరించే శక్తి

    నాకు లేదు” నిరాసక్తిగా, ఒకింత ఆశ్చర్యంగాఅన్నాడు తిరువనంతాచార్యులు.

    “నిన్నీ ఇంట్లోకి రమ్మనడానికి కారణం

    ఒకటి కాదు. మూడున్నాయి. తరువాత చెబుతాను”

    “నాకు గుడి, మడి, ఆచారం ఉన్నాయి”

    “ఎప్పటిలానే పాటించు! ఎవరు కాద

    న్నారు?”

    “గుడి నెవరు చూస్తారు ?”

    “పూజారులంతా ఆలయావరణలలో నివసిస్తున్నారా? అందరికీ వసతుల్లేవే. అలాగేనువ్వు. గుడి కాపలా నీ బాధ్యతెలా అవుతుంది?”

    ఆలోచనలో పడ్డాడు తిరువనంతాచార్యులు.

    “నాకయోమయంగా ఉంది. ఇప్పటికిప్పుడేనిర్ణయం తీసుకోలేను. ఊహకందని మార్పు!

    పూర్వా పరాలు ఆలోచించుకునే అవకాశమివ్వు నీకు ముందే చెప్పాను. కాలంతో పరుగెత్తడం

    నేర్చుకోలేదని”

    “నీకు నువ్వుగా పరుగెత్తడం లేదే! కాలమేమార్పులను తీసుకొస్తుంది. మన ప్రమేయంలేకుండానే కొన్ని అమరుతుంటాయి. కొన్ని

    అంది పుచ్చుకోవాలి. కొందరికి కర్మఫలం సఫలం, మరికొందరికి విఫలం! అదేమిటో, ఎందుకో అర్ధమయిన్నాడు మనిషికి పగ్గాలుండవుకదా! నీ శుశ్రూషకు ఫలంగానీ రాజగోపాలస్వామే ప్రసాదించాడనుకోవచ్చు

    గదా? ఇలాటి మాటలు భక్తులెందరితోనో నువ్వనుంటావు… నీ సిద్ధాంతమే నీకు వర్తించదా?”

    “ప్రకాశం! కొద్ది సమయమివ్వు. మాటలతోమభ్యపెట్టకు, మానసిక దౌర్బల్యానికి గురిచేయకు” అని గుడి వైపు వడి వడిగా అడుగులేశాడు తిరువనంతాచార్యులు.

    రాత్రి ఎనిమిదిన్నర గంటలు. గుడికి

    వచ్చాడు ప్రకాశం. ఇద్దరు గుడి చావడిలోకూర్చున్నారు.

    “ప్రకాశం! ఏమిటిదంతా…? అసలు

    నువ్వెందు కొచ్చావు? కారణం చెబుతావా ?మన స్నేహితం మీద ఆన! దేవాలయంలోకూర్చున్నావు. నిజం చెప్పు !”

    “నువ్వా ఇంట్లోకి మారతావా లేదా?

    ముందుగా చెప్పు!”

    “ఇదేదో నాకు గోపాలస్వామి పెట్టిన పరీక్షలా ఉంది ప్రకాశం! చూశావుగా ఆలయ పరిస్థితి. శిధిలావస్థలో ఉంది. ఉద్ధరణకు నడుం

    కట్టే మహానుభావుడెవరో రావాలి! ఆనాటి దాకాదేవాలయాన్ని వదిలి నా స్వసుఖం కోసం నీ యింటికి రావడం అసమంజసం, అనైతికం.

    భక్తుల విశ్వాశాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయను.దేవునికే గాదు, నామనః స్సాక్షికీ సమాధానం చెప్పుకోలేను. నువ్వు గొప్ప స్నేహితుడివి.

    దైవ కార్యకర్మలకంకితమైన నన్నాయనముందు దోషిగా నిలబెట్టకు. కుచేలుని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీ కృష్ణు

    నిలా వచ్చావని అర్ధమైంది.నన్ను క్షమించు. నేనీ మార్పు నాకాంక్షించ

    లేదు. అంగీకరించలేను” అతని గొంతు గాద్గగమైంది.

    ప్రకాశం దగ్గరిగా జరిగి స్నేహితుడి భుజం చుట్టూ చేయివేసి ఆప్యాయంగా వీపురాస్తూ

    “అనంతూ! ధర్మాధర్మచింతన గురించి నీకుచెప్పేంత వాడి ఉన్నవాడిని గాను. అయినా అవ

    సరం, సమయం, సందర్భం వచ్చింది కాబట్టి గీతలో శ్లోకం ఒకటి గుర్తుచేస్తాను.

    ‘సహజం కర్మ కౌంతేయ సదోషమపి

    న త్యజేత్ |

    సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని

    రివావృతా ||

    దోషముతో కూడినదైనా సహజ కర్మను త్యజింపరాదు. నిప్పుని పొగ ఆవరించినట్లు మన ప్రతి కర్మలోను ఏదో ఒక దోషము ఉంటుందనే కదా శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది.

    మనం చేస్తున్నది అసహజ కర్మ కాదని నాఉద్దేశ్యం!”

    తిరువనంతాచార్యులు చకితుడై చూస్తూమౌనంగా ఉండిపోయాడు.

    “ఇప్పుడు సమయం వచ్చిందనంతూ! నువ్వా ఇంట్లోకి ఎందుకు మారాలో మూడు కారణా

    లున్నాయన్నాను కదా…

    చెబుతాను. విను!

    మొదటిది-గత కొన్నేళ్లుగా, మనం బాల్యంలోతిరుగాడిన ఈ దేవాలయం, మిద్దె పైన అద్దాల

    గది నన్ను కలలోవెంటాడుతున్నాయి. గర్భగుడిలో పై గుమ్మటం నుంచి సున్నం, ఇటుక పెల్లలు రాలుతూ కనిపించేవి. నువ్వు వాటిని

    శుభ్రం చేస్తూ కన్పించేవాడివి.

    నేనిక్కడికొచ్చిన రోజు అద్దాలగదిలో నేను పడుకున్న చోట తెల్లారేసరికి సున్నం పెచ్చులు,

    ఇటుక పెల్లలు పైకప్పునుంచి రాలి పడ్డాయి.అదే దృశ్యం నాకు కలలో పదే పదే కన్పించేది. ఈ దేవాలయాన్ని, నువ్వుండే మిద్దెను పునర్మించడానికే వచ్చాను. నేనెవరినీ ఉద్ధరించడం లేదు. నా కల అంతరార్ధ దైవేచ్ఛను అంద

    రనుమతితో నెరవేరుస్తాను.

    మిద్దె పునర్మితమయ్యాక నువ్వు, గ్రామపెద్దలు కలిసి దాన్ని కళ్యాణ మంటపంగానో లేకమరేవిధంగానైనా గ్రామ ప్రయోజనానికి

    ఉపయోగించండి.

    ఇది భగవత్ప్రేరిత నిర్ణయం.”

    “రెండవది. ముఖ్యమైంది. నేను మరమ్మతులు చేయించిన

    ఇల్లుమాది కాదు. మీదే !

    సరిగ్గా ఆరవై సంవత్సరాల క్రితం శార్వరినామ సంవత్సర విజయదశమి రోజున ఆ

    ఇంటిని రాజగోపాలస్వామి దేవాలయ పూజారి

    పేరిట వ్రాసిన దస్తావేజు దఖలు పత్రం నాదగ్గర ఉంది. ఈ గుడి పూజారుల నివాసం కోసం ప్రత్యేకంగా మా తాతగారు నిర్మించిన ఇల్లది. ఇన్నేళ్లు ఈ విషయం ఎందుకు, ఎవరి స్వార్ధంతో మరుగున పడ్డదో, ఆ ఇల్లు మా స్వాధీనంలో ఎందుకు ఉందో కారణాలు నాకు తెలియవు. రాత్రి అన్న ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రంతో పాటు ఆ ఇంటి పాత దఖలు దస్తా వేజు కూడా ఉంది. దీన్ని చూడు! తాత, తెలిసీ స్వార్ధపూరితంగా ఇల్లు నాన్న పేరిట వీలునామా వ్రాశారు. ఆవిషయమిప్పుడు అప్రస్తుతం !

    ఈ క్షణంలో స్వామివారి సమక్షంలో మీకు చెందిన ఆ ఇంటిని నీకు దఖలు చేస్తున్నాను” అంటూ ఆ పాత పత్రాలు, స్నేహితుని పేరిట వ్రాసిన కొత్త పత్రాలు తిరువనంతాచార్యుల చేతిలో పెట్టాడు ప్రకాశం.

    “ఇక మూడవది, చివరిది స్నేహధర్మం! ఈ పత్రాలు లేకున్నా ఆ ఇల్లు, మామిడి తోట నీపేరిట చేసేవాడిని. నాన్నగారితో మాట్లాడాను.సంతోషపడ్డారు.

    ఆయన తన అంగీకారాన్ని తెలియచేశారు.సహజ కర్మలను గీతానుసారం త్యజించ రాదు కదా!” అన్నాడు ప్రకాశం అనునయంగా సందర్భాన్ని అన్వయిస్తూ.

    రెండు చేతులు జోడించాడు తిరువనంతాచార్యులు అశ్రునయనాలతో

    – కేశిరాజు వెంకట వరదయ్య

    Kesiraju Venkata Varadaiah Telugu Kathalu
    Previous Articleపందెం బరి
    Next Article లేత‌గా.. బూడిద రంగులో చెమ‌ట‌ క‌నిపిస్తే.. గుండెపోటు రాబోతోంద‌ని సంకేతం..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.