Telugu Global
Arts & Literature

త్యాగమూర్తి (కవిత)

త్యాగమూర్తి  (కవిత)
X

మానవత్వానికి మరోపేరు

దైవత్వానికి ప్రతిరూపం

మంచితనానికి అపురూపం వనిత

దుష్టులు, దుర్మార్గులపాలిట

మూర్తీభవించిన మృత్యు దేవత

తనవాళ్ళ కోసం

నిత్యం శ్రమించే శ్రామికురాలు

ఏ ప్రతిఫలం ఆశించక

నిస్వార్థ సేవతో ప్రేమను పంచే

ఆమె త్యాగం అమూల్యం

మహిళ లేకుంటే స్వర్గమైనా నరకమే

ఆమె ఉంటే నరకమైనా స్వర్గమే

ఆమె ప్రేమ ఆకాశమంత ఎత్తు

సముద్రమంత లోతైనది

లాలించే తల్లిగా..

ప్రేమను పంచే అర్థాంగిగా ..

నేటి సమాజానికి స్పూర్తి

రేపటి సమాజానికి వెలుగు

అందుకే ఆమె త్యాగమూర్తి!

-కాయల నాగేంద్ర

First Published:  1 April 2023 8:23 AM IST
Next Story