Telugu Global
Arts & Literature

నిజంగా నాలుగు అద్భుతాలు

నిజంగా నాలుగు అద్భుతాలు
X

(ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకాలు)

*****

ఒక నేల వెలుగుపూలు పూయిస్తూ వెలుగు దివ్వెలు వెలిగిస్తూ వెలుతురు తోవల్లో నడిపిస్తూ అనేక ఆకాశాలను అందించింది

* A Soil gave birth to glowing flowers that bloomed along the lustrous path which led to the beaming lights of the infinite Skies*

**********

క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దపు తక్షశిల విశ్వవిద్యాలయమైనా గాని క్రీస్తు శకం అయిదవ శతాబ్దపు నలంద విశ్వవిద్యాలయమైనాగాని ఎందరో చరితార్ధులనుతయారుచేసివుండవచ్చు. అయితే ఆ విజ్ఞానకేంద్రాలను గురించి ఎవరో ఒకరు పూనుకొని వాటిని అక్షరరూపం లో భద్ర పరిస్తే తప్ప అవి చరిత్రలో నిక్షిప్తం కావు. ఇటువంటి ఎంతో ఉన్నతమైన కార్యాన్ని తాను చదువుకున్న బాపట్ల వ్యవసాయ కళాశాలకు సంభందించి వినూత్న రీతిలో చేశారు వలేటి గోపీచంద్.

బాపట్ల వ్యవసాయ కళాశాల చరిత్రను ఆ కళాశాలలో విద్యనభ్యసించి వివిధ సంస్థల్లో కీలక పదవుల్లో వుండి సమాజానికి స్ఫూర్తిదాయక సేవలందించిన / సేవలందిస్తున్న కొందరిని ఎంచుకొని వారి స్ఫూర్తి దాయక జీవన రేఖలను మనకి పరిచయం చేస్తూ… స్వయంగా వారితోనే కళాశాల విషయాలను విశేషాలను చెప్పిస్తూ ఒక క్రొత్త అనుభూతికి గురిచేస్తారు ఈ పుస్తకాలలో గోపీచంద్ బృందం .బాపట్ల వ్యవసాయ కళాశాల 75 సంవత్సరాల చరిత్ర తో పాటు అది సృష్టించిన పలువురు మేధావులను గురించి నాలుగు సంపుటాల్లో భావయుక్తంగా భావోధ్వేగభరితంగా ఈ గ్రంధాలలో పొందుపరచారు. ఒక నేల అనేక ఆకాశాలు, వెలుతురు తోవలు, వెలుగు పూలు, వెలుగు దివ్వెలు ఇలా ఈ నాలుగు పుస్తకాలూ ఒక సంస్థ యొక్క భాగస్వామ్య స్వీయ చరిత్ర గ్రంధాలుగా చరిత్రలో నిలిచిపోతాయి.


ఈ పుస్తకాలలో ముద్రించిన పెయింటింగ్స్ , పెద్దల మాటలు మనల్ని కొత్త ప్రపంచం లోకి తీసుకు వెళ్తాయి. అందమైన ముద్రణ పుస్తకాలకు అదనపు విలువ అందించింది. తెలుగు సినిమాల లో రైతు సాహిత్యం, తెలుగు సాహిత్యం లో రైతు కవితా వికాసం పేరుతో ముద్రించిన వ్యాసాలు కళ్ళ ముందు చరిత్రను చెప్తాయి. పుస్తకాలను మధ్య,దిగువ మధ్యతరగతి రైతు,రైతు కూలీల బిడ్డల విజయ కేతనాలుకు సంకేతం అని చెప్పవచ్చు. ఒక్కో విజయ గాధ ఒక్కో చరిత్ర చెప్తుంది. సమాజం లోని అన్ని రంగాలను వీరు ప్రభావితం చేసిన తీరు గొప్పగా అనిపించింది. అందువల్ల చెప్పటం కంటే వాటిని చదివితే వంద రెట్ల అనుభూతి కలుగుతుంది. అందరికీ స్ఫూర్తినిచ్చే వి. కలలను సాకారం చేసుకునే దిశగా కదిలిస్తాయి.


సమాజ నిర్మాణంలో విద్యాసంస్థలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. మరి అటువంటి ప్రధానమైన సామాజిక వ్యవస్థల చరిత్రలను రికార్డు చేసి వాటి తాలూకు విజయగాధలను పుస్తక రూపంలో పొందుపరిస్తే అవి మరెందరో విద్యార్ధులకు మరెన్నో విద్యాసంస్థలకు స్ఫూర్తి గా నిలబడతాయి. అలాంటి వినూత్న నవోజ్వల సాహిత్య ప్రక్రియకు శ్రీకారం చుట్టి తనకు విజ్ఞానాన్ని ప్రసాదించిన కళాశాలను చరితార్ధం చేసిన గోపీచంద్ కు వారి బృందానికి అభినందనలు.

మరొక ఆసక్తి కరమైన విషయం - Care taken for maintaining the Quality of the Book : పుస్తకాల నాణ్యత, చిత్రాల presentation, feel of the paper. అత్యున్న త నాణ్యతతో కూడిన కాగితాలు మన వేలికి హాయినిస్తాయి. సొంపైన చిత్రాలు కళ్ళను ఆకట్టుకుంటాయి. అయితే చాలా నామమాత్రమైన వెలకే పుస్తకాలను అందుబాటులో వుంచారు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకాలివి.

ఈ పుస్తకాలను తప్పక చదవండి.ఆ స్ఫూర్తితో మీరు చదువుకున్న కళాశాలలు, విద్యాసంస్థల గురించి మననం చేసు కోండి.

పుస్తకాల ప్రతుల కోసం:

--------------

శ్రీ వి. గోపీచంద్, 9441276770 ను సంప్రదించండి

లేదా

హైదరాబాద్ ఖైరతాబాద్ లోని

దక్షిణ భారత హిందీ ప్రచార సభ

కాంప్లెక్స్ లోని

రైతు నేస్తం కార్యాలయం

శ్రీ చక్రధర్‌ని సంప్రదించవచ్చు.

4 పుస్తకాలు

కేవలం 1000 రూపాయలకే

సొంతం చేసుకోవచ్చు .

పోస్టల్ ఛార్జీలు అదనం.

-కర్రే సందీప్.

First Published:  9 April 2023 4:26 PM IST
Next Story