Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    ఆచార్య (కథ)

    By Telugu GlobalFebruary 26, 202312 Mins Read
    ఆచార్య (కథ)
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    “ఏరా…. ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావు?”

    రేవంత్ పక్కన కూర్చుంటూ అడిగాడు అఖిల్. ఇద్దరికీ

    పదిహేనేళ్ళ వయస్సు వుంటుంది. ఎందుకో రేవంత్ చాలా

    ఉదాసీనంగా వున్నాడు. వాడి ఎదురుగా వున్న సముద్రం

    వీడిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. తన కాళ్ళ దాకా

    వచ్చి పోతూ దోబూచులాడుతోంది. రేవంత్ కూడా అలల

    వైపే చూస్తున్నాడు. ఒక్కో అల ఒక్కో పాఠం చెప్తున్నట్టుంది.

    ఒకటి బాగా ఎత్తుగా ఎగిరి వెంటనే క్రింద పడుతుంది. ఎక్కువ

    దూరం ముందుకు రావడం లేదు. మరొకటి క్రిందనే ఎక్కువ

    దూరం ముందుకు వస్తోంది. ఇంకోటి సుడులు తిరుగుతూ.

    వస్తోంది. కొందరు ఆ అలలతో కేరింతలు కొడుతూ

    ఆడుతున్నారు. మరికొందరు అలలు చూసి బయపడి ఒడ్డుకి

    పరిగెడుతున్నారు.

    రేవంత్ పక్కనే కూర్చున్న అఖిల్ కూడా గంభీరంగా

    వున్న సముద్రం వైపే ప్రశాంతంగా చూస్తూ కూర్చున్నాడు.

    ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. కాసేపటికి మౌనం విడిచి

    “పరీక్షల ఫలితాలు చూసి ఇంట్లో వాళ్ళు బాగా తిట్టారు” అని

    రేవంత్ చిన్నగా అన్నాడు. “నువ్వు పాస్ అయ్యావు

    కదా….” అని తన వైపే చూసాడు అఖిల్. వాడి ప్రశ్నకి.

    సమాధానం చెప్పకుండా “నీకు ఏ సబ్జెక్టు లో ఎక్కువ

    మార్కులు వచ్చాయి?” అని తిరిగి ప్రశ్న వేసాడు రేవంత్.

    “నాకు గణితంలో తొంభై మార్కులు వచ్చాయి” బుజాలు

    ఎగరేస్తూ అన్నాడు అఖిల్. “నాకు తెలుగులో తొంభై

    మార్కులు వచ్చాయి” తలదించుకుంటూ అన్నాడు రేవంత్.

    “తొంభై మార్కులు వచ్చి కూడా అలా తల దించుకుంటావు

    ఏంటి రా?” అని అయోమయంగా చూసాడు. రేవంత్ ఇంకా

    తల దించుకొనే వున్నాడు.

    “గణితంలో లో తొంభై మార్కులు పది మందికి వచ్చాయి. కానీ తెలుగులో తొంభై నీకు ఒక్కడికే వచ్చాయి.

    మా అందరికన్నా నువ్వు చాలా గొప్ప రా రేవంతు” బుజం పై

    చెయ్యి వేస్తూ మెచ్చుకున్నాడు అఖిల్. “తెలుగులో మంచి

    మార్కులు వస్తే ఎందుకు పనికి రావంటూ మా ఇంట్లో వాళ్ళు

    బాగా తిట్టారు రా” అని బాధ పడుతూ చెప్పాడు.

    వీళ్ళకి కొంచెం దూరంలో ముప్పై యేళ్ళ ప్రసాదు

    కూర్చొని వున్నాడు. ఈ పిల్లల మాటలు విని చిన్నగా

    నవ్వుకున్నాడు. వాళ్ళ వైపే ఆసక్తిగా చూస్తున్నాడు. “ఒక

    పని చేద్దాం… నువ్వు నాకు తెలుగు నేర్పించు. నేను నీకు

    లెక్కలు నేర్పిస్తాను” అని తన ఉపాయం చెప్పాడు అఖిల్.

    “అయితే నాకు ఆ జీళ్ళు కొనిపెట్టు” అని నవ్వుతూ అన్నాడు.

    రేవంతు. అక్కడ నుంచి లేచి వెళ్ళి జీళ్ళు కొన్నారు. సరదాగా

    మాట్లాడుకుంట, జీళ్ళు పంచుకొని తింటూ, ఈ ఇద్దరు బాల్య

    స్నేహితులు రోడ్ వైపు వెళ్ళి పోయారు. వీళ్ళ నుంచి

    సముద్రం వైపు మారింది ప్రసాదు మనస్సు.

    అది విశాలమైన విశాఖపట్నం బీచ్. అక్కడ చాలా

    కోలాహలంగా వుంది. చిరు వ్యాపారుల హడావుడి. “సారు …

    యేడి యేడి పల్లీ” అని ఒకడు అరుస్తున్నాడు. “పదికి

    నాలుగు సమోసా. యేడి యేడి సమోసా” అని మరొకడు ఒక

    జంట చుట్టూ తిరుగుతున్నాడు. వాడిని తప్పించుకోడానికి

    సమోసా తీసుకోక తప్పలేదు ఆ జంటకి. అది చూసి ప్రసాదు.

    చిన్నగా నవ్వుకున్నాడు. అలలతో ఒడ్డున చిన్నపిల్లల

    అల్లరి. ఇసుకలో కూర్చొని ప్రేమికుల చిలిపి కబుర్లు. చేతిలో

    చెట్టి వేసుకొని ఒడ్డున తిరుగుతున్న భార్యాభ ర్తల అనుబంధం

    గడిచిన జీవితాన్ని నెమరేసుకుంటూ వృద్ధ దంపతుల ముచ్చట్లు. సరదాగా గడపడానికి బీచ్ కి వచ్చిన స్నేహితుల

    పరాచకాలు. ఇలా ఆ ప్రాంతం అంతా చాలా సందడిగా వుంది.

    దూరంగా వెళ్ళిపోయిన ఆ రేవంత్, అఖిల్ వైపే చూస్తూ

    ముప్పై నిండిన పెళ్లికాని ప్రసాద్ సముద్రం ఒడ్డున కూర్చొని వున్నాడు. వాళ్ళు కనుమరుగవ్వగానే

    తనకి కొంచెం దూరంలో ఎగిసిపడుతున్న కెరటాల వైపే

    తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. మౌనంగానే కొంచెం

    సమయం గడిచింది.

    తన చేతికి వున్న వాచ్ చూసుకున్నాడు. సాయంత్రం

    అయిదు అయ్యింది. సరిగ్గా అప్పుడే పెళ్ళిళ్ళ బ్రోకర్ మూర్తి

    దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. “బాబు ప్రసాదు…. మీ

    వాట్సాప్ కి పెళ్ళి వాళ్ళ లొకేషన్ పంపించాను. అమ్మాయి

    పేరు శ్రావణి. వాళ్ళ నాన్నగారు పేరు శర్మ. తెలుగు టీచర్ గా

    ఈ మధ్యనే పదవీ విరమణ చేసారు. మీ గురించి కూడా

    వివరాలు వాళ్ళకి పంపించాను. రేపు పదకొండు ఘంటలకి

    ముహూర్తం బాగుంది. వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి

    “వెళ్ళండి” అని చెప్పి మూర్తి ఫోన్ కట్ చేసాడు. ఫోన్లో

    లొకేషన్ ఓపెన్ చేసి అలానే చూస్తూ కూర్చున్నాడు..ఇంతకు ముందు ఆ ఇద్దరు పిల్లలు తెలుగు బాష గురించి..మాట్లాడుకోవడం గుర్తుకు వచ్చింది. వెంటనే తన బాల్యం:

    తాలూకు ఆలోచనలు మూకుమ్మడిగా కమ్మేసాయి.

    గతం గిర్రున తిరిగింది….ర

    అప్పుడు తనకి కూడా ఈ పిల్లల వయస్సే వుంటుంది.

    పుస్తకాల సంచి సంకలో వేసుకొని పరిగెడుతూ వున్నాడు.

    |బడికి సమయం మించిపోతోంది. తను ఇంకా బడి చేరుకోడానికి పావు కిలో మీటర్ దూరంలో వున్నాడు.

    అప్పుడే రెండో ఘంట మ్రోగింది. ఇంకో రెండు నిమిషాల్లో

    మూడో ఘంట కొడితే మొదటి పీరియడ్ మొదలవుతుంది.

    |ఆ విషయం గుర్తుకు వచ్చి ప్రసాదు కూడా తను పరిగెత్తేవేగం పెంచాడు. బడి దగ్గరకి వచ్చేసాడు. కానీ సమయం మించిపోతోంది. అందరూ వెళ్ళే ముందు గేట్ నుంచి వెళ్ళాలి.

    అంటే ఆలస్యం అవుతుంది. అందుకే మధ్య దారి లో సగం

    విరిగిన బడి గోడ దూకేసాడు. అడ్డదారిలో తన తరగతి గది

    వైపుగా పరిగెట్టాడు. ఇంత సాహసం ఎందుకంటే? ఈ రోజు

    మొదటి పీరియడ్ తనకి ఇష్టమైన తెలుగు.

    అంత ప్రయత్నం చేసినా అప్పటికే… తన తరగతి కి మొదటి పీరియడ్ తెలుగు టీచర్ శర్మ వచ్చేసారు. తరగతిలో పిల్లలు అందరూ లేచి నిలబడ్డారు. “నమస్తే ఆచార్యదేవ….”.

    |అని ఒకేసారి వందనంగా అందంగా పలికారు. కూర్చోండి అని

    బెత్తంతో చూపించాడు. “ఏదీ నిన్నటి పద్యం అందరూఒకసారి గట్టిగా చెప్పండి” అంటూ శర్మ కూడా మెల్లగా తనకు ర్చీ లో కూర్చున్నాడు.

    పిల్లలు అందరూ గట్టిగా ఒకేసారి పద్యం చెప్తున్నారు.

    ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. కాకి గోలలా

    వుంది. శర్మ చాలా చిరాకు పడుతున్నాడు. అప్పుడే

    ఒగరుస్తూ ప్రసాదు తరగతి దగ్గరకి వచ్చేసాడు.ముచ్చెమటలతో ముఖ ద్వారం దగ్గర నిలబడి పద్యం

    చెప్పడం మొదలు పెట్టాడు. శర్మకి బాగా తెలుసు. ప్రసాదుగొంతులో మాత్రం ఆ పద్యం తీయగా పలుకుతోంది. ఇలాతెలుగు పద్యం కమ్మగా వినిపించడంతో హాయిగా

    కూర్చున్నాడు శర్మ.

    తన్మయత్వంలో కాసేపటికి కానీ…ప్రసాదు పద్యం పలికే

    శబ్దం ద్వారం దగ్గర నుంచి వస్తూ వుంది అని తెలుసుకోలేక

    పోయాడు. తన వైపీ కోపంగా చూసాడు. “ఏరా ప్రసాదు?

    మళ్ళీ ఆలస్యం… ఎందుకు?” అని కోపంగా అడిగాడు.పద్యం ఆపేసి ప్రసాదు మౌనంగా నిలబడ్డాడు. “నీ గొంతులో తెలుగు తీయగా పలుకుతోంది అని ఆలస్యంగా వస్తున్నాపోనీలే అని ప్రతీ రోజూ వదిలేస్తున్నా. నువ్వేమో అదే

    అదనుగా ప్రతి రోజు ఆలస్యంగా వస్తున్నావు” అని మరింత

    కోపంగా అన్నాడు. వాడు మళ్ళీ ఏం పలక లేదు.

    కోపంతో ఊగిపోతూ “ఇలా దగ్గరకిరా….” అనిగద్దించాడు. మెల్లగా ముందుకు వచ్చాడు. శర్మ బెత్తంఅందుకున్నాడు. “చేయి చాపు….” అని కళ్లెర్ర చేస్తూ

    అన్నాడు. “ఆచార్య….. చేతి మీద కొట్టకండి” అనివేడుకున్నాడు. ఆ మాటతో శర్మ చెయ్యిలో సత్తువ

    పోయింది. నీరస పడిపోయాడు. “నువ్వు ఇలా ఆచార్య….

    అని చక్కగా తెలుగు లో పిలిస్తే నిన్ను ఎలా రా కొట్టడం?”

    అని అటు ఇటు చూసాడు. ఇవేమీ పట్టించుకోని ప్రసాద్కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా చేతులు ముందుకుచాచాడు. వాడి చేతుల మీద అప్పటికే ఎర్రని వాతలు

    వున్నాయి. తను ఇంకా కొట్టనే లేదు. వాడి చేతి పై ఆ ఎర్రని

    వాతలు చూసి శర్మ కళ్ళు కూడా ఎర్రగా మారి చెమ్మగిల్లాయి.

    “ఏంటి రా ఆ వాతలు?” అని చేతుల వైపే చూస్తూఅడిగాడు. వాడేం పలకలేదు. “నీ నోరు తెలుగు పద్యాలు

    తప్ప ఏం పలకవా….” అని కోపంగా అన్నాడు. ఇప్పుడునువ్వు నోరు విప్పలేదు అంటే నీకు తెలుగు నేర్పించడంమానేస్తాను అని బెదిరించాడు. తెలుగు మీద మాటొచ్చాక. వీడికి మాటలొచ్చాయి.

    “మా అయ్య బడి వద్దు కూలీకి పొమ్మంటున్నాడు. నేను

    బడికి పోతాను అంటే ఇలా వాతలు పెట్టాడు. నాకు చదువుకోవాలని వుంది. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం.నేను తెలుగు బాగా చదువుకుంటాను అని మా అయ్యతో

    చెప్పాను” అని అమాయకంగా అన్నాడు..

    వాడి మాటలు విని శర్మకి నవ్వొచ్చింది. ఎందుకంటే.బడికి వెళ్ళి తెలుగు బాగా చదువుకుంటాను అని చెప్పిన

    మొదటి విధ్యార్థి ప్రసాదు. అందరూ ఇంగ్లీష్ చదువుల కోసం

    తాహతు మించి నిచ్చెనలు వేస్తూ వున్నారు. వీడు తెలుగుకోసం తండ్రి దగ్గరే దెబ్బలు తింటున్నాడు. ఆ అమాయకపుమాటలు విని శర్మ కూడా మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు.

    “నువ్వు రోజు బడికి రావాలి. బాగా చదువుకోవాలి. అన్నీసబ్జెక్టులు చదవాలి. ఒక్క తెలుగు మాత్రమే చదువుకొని ఏంచేస్తావు? నాలాగా బడి పంతులు అవుతావా?” అని చిన్నగామందలిస్తూ నవ్వాడు. అది చూసి మిగతా పిల్లలు కూడా

    విరగబడి నవ్వారు.

    ఆ నవ్వుల శబ్దం నుంచి అలల శబ్దం వినిపించింది.అప్పుడే వచ్చిన ఒకటి తన పాదం తాకడంతో అలా

    గతం నుంచి బయటకి వచ్చాడు ప్రసాదు. తను కూడా చిన్నగా నవ్వుకున్నాడు. సముద్రం కి వీడుకోలు చెప్పిఅక్కడ నుంచి వచ్చేసాడు.

    మరుసటి రోజు పొద్దున….ప్రసాదు పెళ్లి చూపులకి సిద్ధం.

    అద్దం ముందు నిలుచోని తనని తాను చూసుకున్నాడు. చాలా

    చక్కగా రాజకుమారుడులా వున్నాడు. కాసేపటికి బయట

    నుంచి తన పిఏ వచ్చాడు. “సార్…. మీ కార్ రెడీ” అని

    చెప్పాడు. “పదండి వెళ్లాం” అని అన్నాడు. పిఏ ముందు

    వెళ్తున్నాడు. ప్రసాద్ పిఏ వెనుకే వెళ్ళాడు. ఇద్దరూ కారు ఎక్కారు.

    కార్ వెనుక సీట్లో హుందాగా కూర్చున్నాడు ప్రసాద్.

    “ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లమంటారా సర్….” అని పిఏ

    అడిగాడు. “కాదు కాదు…. నీ వాట్సప్ కి నేను వేరే లొకేషన్

    పంపించాను. అక్కడకి పోనివ్వు” అని తనతో చెప్పాడు.

    “కానీ సర్…. పదకొండు ఘంటలకి ప్రొడ్యూసర్ గారితో

    మీటింగ్ వుంది కదా?” అని పిఏ అనుమానంగా అన్నాడు.

    “ఇప్పుడు నాకు పెళ్లి చూపులు వుంది. సాయంత్రం వస్తాను.

    అని ప్రొడ్యూసర్ కి ఆల్రెడీ మెసేజ్ చేసాను. పర్లేదు…. నువ్వు

    నేను చెప్పిన లొకేషన్ కి పోనివ్వు” అని పీఏతో అన్నాడు.

    ప్రసాదు. పెళ్ళి చూపుల మాట వినడంతో పిఏ షాక్ అయ్యాడు.

    పిఏ గా ప్రతీదీ తానే ప్లాన్ చేస్తాడు. పెళ్ళి చూపుల గురించి

    తనకి ఎందుకు చెప్పలేదు? ఇలా పీఏ ఆలోచనల వేగం కన్నా కార్ ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంది. కిటికీ నుంచి బయటకి చూస్తున్నాడు ప్రసాదు.

    వెనక్కి వెళ్తున్న చెట్ల వైపే చూస్తూ మళ్ళీ తను కూడావెనక్కి బాల్యంలోకి తొంగి చూసాడు…..

    ఆ రోజు పరీక్ష పేపర్లు ఇచ్చారు. ప్రసాదు మార్క్స్ చూసుకుంటూ వున్నాడు. ఒక సబ్జెక్టు దగ్గర తన కళ్ళు

    మెరిసాయి. మిగతా అన్నిటిలో జస్ట్ పాస్ మార్కులువచ్చాయి. తెలుగులో మాత్రం తొంభై వచ్చాయి. ఆ మార్కులుచూసుకొని ప్రసాద్ చాలా మురిసిపోతున్నాడు. ” ఆరే

    బడుద్దాయి! తెలుగులో మాత్రమే మంచి మార్కులువచ్చాయి. మిగతా వాటిలో చచ్చీ చెడి పాస్ మార్కులు

    వచ్చాయి. ఇలా తెలుగునే నమ్ముకుంటే ఎందుకు

    పనికిరాకుండా పోతావు రా” అని క్లాస్ టీచర్ ముకుందం..

    ముకుందం లెక్కలు చెప్తాడు. లెక్కల్లో ప్రసాదు జస్ట్ పాస్ అయ్యాడు అంతే…. ప్రసాదు వైపు కోపంగా చూస్తూ బాగా చీవాట్లు పెట్టాడు ముకుందం.

    ఒక సిగ్నల్ దగ్గర డ్రైవరు సడన్ బ్రేక్ వెయ్యడంతో గతంనుంచి మళ్ళీ బయటకి వచ్చాడు.

    “సర్! మీరు చెప్పిన లొకేషన్ కి దగ్గరగా వచ్చేసాం” అని

    పి ఏ అనడంతో కిటికీ నుంచి బయటకి తొంగి చూసాడు. కార్

    ఒక గల్లీలో లోపలికి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది. ప్రసాదు

    మెల్లగా కార్ దిగాడు. “నేను చెప్పిన బ్యాగ్ ఎక్కడ?” అని అన్నాడు. పిఏ ఒక నల్లటి బ్యాగ్ ప్రసాదు కి అందించాడు. ఆ బ్యాగ్ తీసుకొని “మీరు ఇక్కడే వెయిట్ చేయండి…..” అని చెప్పి ప్రసాదు మెల్లగా ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు.

    అది ఒక పాత ఇల్లు. వరండాలో అరవై అయిదేళ్ళ శర్మవాలు కూర్చీలో దిగాలుగా పడుకొని వున్నాడు. ఎదురుగా పెళ్లి వయస్సు దాటిన తన ఒక్కగానొక్క కూతురు శ్రావణి….

    మౌనంగా కన్నీళ్లతో మాట్లాడుతూ నిలబడి వుంది. “అసలు

    నాకు పెళ్లి వద్దు నాన్నా !ఎప్పటికి మీ దగ్గరే వుండి పోతాను”

    అని బాగా ఏడుస్తూ అంది.

    “ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాలి. పుట్టినింటిని వదిలి

    మెట్టినింటికి పోవాలి” అని మెల్లగా నచ్చ చెప్తూ అన్నాడు.

    “వచ్చిన ప్రతీ ఒక్కరూ ఎంత కట్నం? అని మొదటఅడుగుతున్నారు” అని బాధ పడుతూ అంది. “కట్నం

    గురించి అడిగితే…. నీకు ఎందుకు? ఈ ఇల్లు అమ్మి నీ పెళ్లి చేస్తాను. తెలుగు టీచర్ ని కూతురు పెళ్లి చేయలేను అని వాళ్లందరి అనుమానం. నేను చేసి చూపిస్తాను” అని కూతురికి ధైర్యం చెప్పాడు.

    “ఈ ఇల్లు అమ్మి నాకు పెళ్లి చేసి పంపించేస్తారు. మరి మీరు

    ఎక్కడ వుంటారు ?” అని కోపంగా చూస్తూ నిలదీసింది.

    “రేపో మాపో పోయే ముసలి ప్రాణం నాది….” అని చిత్రమైన

    సమాధానం చెప్పాడు. “మీరు ఇంకోసారి అలా మాట్లాడారు

    అంటే…. నేను మీతో మాట్లాడ్డం మానేస్తాను” అని రెట్టించిన

    కోపంతో అంది.

    ఆ గదిలో వాతావరణం మరింత వేడెక్కక ముందే…..ప్రసాదు ద్వారం దగ్గర నిలబడి పద్యం అందుకున్నాడు. అది

    చిన్నప్పుడు బడిలో చెప్పిన పద్యం. ఆ వైపు చూసి శర్మ, శ్రావణి నిశ్రేష్టులైపోయారు. పద్యం అంత మాధుర్యంగా వినగానే

    శర్మ కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదు.

    ఆ కన్నీళ్ళ వెనుక ఇన్నాళ్లు దాగిన గతం మళ్ళీ బయటకి వచ్చింది…

    పన్నెండేళ్ళ శ్రావణి బడికి వెళ్తూ వుంది. తన వెనుకనే

    నడుస్తూ వున్నాడు ప్రసాదు. “ఓయ్ శ్రావణి…. నన్ను పెళ్ళి

    చేసుకుంటావా?” అని అడిగాడు. తనకి వాడి అమాయకత్వం

    అర్ధం కాలేదు. అర్ధం చేసుకొనే వయస్సు లేదు. పెళ్ళి అనే ఆ

    మాట విని ఏడవడం మొదలు పెట్టింది. అలా ఏడుస్తూ తను

    ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయింది.

    జరిగింది మొత్తం వాళ్ళ నాన్న శర్మకి చెప్పింది. శర్మ కి

    ప్రసాదు పై చాలా కోపంగా వచ్చింది. మరుసటి రోజు బడిలో…..

    ప్రసాదుని తన గదికి పిలిపించాడు. “ఏరా! నా కూతుర్ని పెళ్ళి

    చేసుకొనే ధైర్యం వచ్చిందా?” అని కోపంగా అన్నాడు. చేతి లో

    పొడవాటి బెత్తం వుంది. అయినా కూడా బయపడ్డం లేదు.

    “ఆచార్య…. మీ అమ్మాయి శ్రావణి ని పెళ్లి చేసుకుంటే మీకు

    అల్లుడ్ని అవుతాను. మీ ఇంట్లోనే వుండొచ్చు. అల్లుళ్లు ఏం

    అడిగితే అది మామలు అది ఇస్తారు అని మా గుడిసి పక్కనే

    వుండే నరసమ్మ అత్త చెప్పింది. అప్పుడు మీరు కూడా నేను

    అడిగింది ఇస్తారు కదా…. అందుకే అలా చేసాను. శ్రావణి కి

    ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అని…..” అని బయం లేకుండా

    తన చిన్ని మనసులో మాట చెప్పాడు.

    శర్మకి ఏం అర్ధం కాలేదు. తల పట్టుకొని కూర్చున్నాడు.

    “నువ్వు నాకు అల్లుడు అయితే…. నువ్వు అడిగింది నేను

    ఇస్తానా? అసలు నీకు ఏం కావాలి ఏంటి?” అని కోపంగా తన

    వైపే చూసాడు. “పెద్దగా ఏం లేదు ఆచార్య…. మీకన్నాకూడా…. నేను గొప్ప తెలుగు పండితుడ్ని కావాలి అంతే!!అని అమాయకంగా చెప్పి తన చేతులు ముందుకు చాపాడు.

    అది చూసి చేతిలో బెత్తం క్రింద పెట్టేసాడు శర్మ.

    వాడి మాటలు విని శర్మకి వచ్చిన కోపం పోయింది.చిన్నగా నవ్వుకున్నాడు. కాసేపు ఏదో ఆలోచించాడు.ఒక్కసారిగా ఆపకుండా ఒక పెద్ద పద్యం చెప్పాడు.

    ప్రసాదు గురువు శర్మ వైపే చూస్తున్నాడు. పద్యం పూర్తి అయ్యింది.శర్మ ప్రసాద్ వైపే చూస్తూ “ఆరే ప్రసాదు…. ఈ పద్యం తప్పు

    పోకుండా నువ్వు చెప్పు చూద్దాం. నువ్వు అలా చేస్తే….అప్పుడు సంతోషంగా నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను”అని అన్నాడు. ఆ పద్యం రాసిన పుస్తకం వాడి చేతిలో

    పెట్టాడు. అది తీసుకొని “అలాగే ఆచార్య….” అంటూఆనందంగా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోయాడు.

    మరుసటి రోజు ప్రసాదు బడికి రాలేదు. తెలుగు బాష మీద

    ప్రసాద్ కి వున్న ఆసక్తిని చూస్తే శర్మకి వాడంటే చాలాముచ్చట. ప్రసాదు కోసం తరగతిలో అందరి పిల్లల వైపు

    చూసాడు. వాళ్ళలో ప్రసాదు లేడు. “ఏరా ప్రసాదు రాలేదా?”

    అని శర్మ మిగతా పిల్లల వైపు చూస్తూ అడిగాడు. “వాడు ఇంక ఆ

    బడికి రాడు. ఊరు వదిలి వెళ్లిపోతున్నాడు. వాళ్ళ అయ్యకి

    పట్నంలో కూలీ కుదిరింది అంట” అని ఒక గడుగ్గాయి టకటక

    అని చెప్పాడు. ప్రసాదు ఇక బడికి రాడు అనే మాట శర్మని

    బాధించింది. కమ్మగా రోజు పద్యం వినిపించే ప్రసాదు గొంతు

    ఇక వినిపించదు. తెలుగు బాష గురించే ప్రతీ రోజూ పొగిడే

    ప్రసాదు ఊరు వదిలి పోతున్నాడు. ఈ నిజం తట్టుకోలేక

    పోయాడు. “అయ్యో….” అంటూ శర్మ హడావుడిగా లేచివెళ్లిపోయాడు.

    ప్రసాదు ఇంటి వైపు వడివడి గా నడుస్తున్నాడు. ఎందుకో

    తెలీదు…. శర్మ కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు జారాయి.

    ప్రసాద మీద ఏదో తెలియని అభిమానం. అది తెలుగు మీద

    తనకి కూడా వున్న అభిమానం వల్ల కలిగిన అభిమానం కాబోలు దారి మధ్యలో ప్రసాదు కుటుంబం వస్తున్న ఎడ్ల బండి ఎదురయ్యింది. శర్మ ని చూసి ప్రసాదు బండి దిగి

    పరిగెట్టుకుంటూ వచ్చాడు. శర్మ ప్రసాదు ని ఆప్యాయంగా

    కౌగిలించుకున్నాడు.

    “ఏరా నేను ఇచ్చిన పద్యం చెప్పకుండానే పోతున్నావా?”

    అని కోపంగా చూసాడు. “పద్యం బాగా కంఠత చేసాను.

    కానీ నోరు సరిగా తిరగడం లేదు. మధ్య మధ్యలోమరచిపోతున్నా కూడా….”. అని అమాయకంగా చెప్పాడు.తెలుగు మీద వాడికి వున్న శ్రద్ధ చూసి మెచ్చుకోలుగా బుజం

    తట్టాడు. “అయినా ఆచార్య…. నేను ఊరు వదిలి వెళ్లిపోతున్నా కదా…. ఇక మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం.కుదరదు” అని బాధగా అన్నాడు. ఆ మాటలు విని వాడి

    అమాయకత్వంకి మనసారా నవ్వుకున్నాడు. తన దగ్గర

    సంచీలో నుంచి ఒక నాలుగు పుస్తకాలు తీసి వాడి చేతిలో

    పెట్టాడు. ఆ పుస్తకాలు చూసి వాడి కళ్ళు మెరిసాయి. శర్మకాళ్ళ మీద పడిపోయాడు. పెద్ద మనస్సుతో ఆశీర్వదించి మరోసారి గుండెలకి హత్తుకున్నాడు.

    “ఈ పస్తకాలు తెలుగులో గొప్ప పుస్తకాలు. ఇవి చదివి

    అర్ధం చేసుకో. తల్లిని గౌరవించే వాడు. తల్లిలాంటి తెలుగు

    – భాషని గౌరవించే వాడు తప్పకుండా గొప్పవాడు అవుతాడు”

    అని గురోపదేశం చేసాడు. “గొప్పవాడిని అయ్యాక మళ్ళీ

    కలుస్తాను ఆచార్య…..” అంటూ చెమర్చిన కళ్ళతో ప్రసాదు

    మరోసారి శర్మ కాళ్ళకి నమష్కారం చేసి ఎడ్లబండి ఎక్కేసాడు. శర్మ బండి వెళ్తున్న వైపే చూస్తూ కాసేపు నిలుచున్నాడు. తనచెమర్చిన కళ్ళలో ప్రసాదు కనుమరుగైపోయాడు. ఎందుకో గుండెల్లో బరువుగా అనిపించింది. ఆ బరువు మోస్తూ బడివైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. బండిలో ఆ తెలుగు

    పుస్తకాలను గుండెలకి హత్తుకొని కూర్చున్నాడు ప్రసాదు.

    అలా కన్నీళ్ళ ని దాటి మళ్ళీ గతం నుంచి బయటకివచ్చాడు.

    తన గుమ్మం దగ్గర ప్రసాదు వున్నాడు. శర్మ కి ఆశ్చర్యం

    వేసింది. ” ప్రసాదు…. నువ్వేనా? చాలా గొప్పవాడివిఅయ్యావని విన్నాను. అలాంటి నీకు ఈ పేదవాడి ఇంట్లో ఏం పని…. నువ్వు ఇక్కడ ఏంటి?” అని ఆప్యాయత నిండిన

    కళ్ళతో మెల్లగా దగ్గరగా వచ్చాడు. ప్రసాదు కూడా ముందుకు

    వచ్చి శర్మ కాళ్ళ మీద పడిపోయాడు.

    “ఆచార్య…. మీరు చిన్నప్పుడు నేర్పించిన తెలుగే నన్ను

    గొప్పవాడిని చేసింది. మీరు ఇచ్చిన గొప్ప పుస్తకాల్లోని జ్ఞానమే

    నన్ను పెద్ద సినిమా రచయితని చేసింది” అని ఆనందంగా

    చెప్పాడు. వాడి మాటలు వింటూ శర్మ చాలా ఆనందపడిపోయాడు. “తెలుగు నేర్చుకొని ఏం సాధిస్తావు రా

    అందరూ హేళనగా అడిగితే…. అదే తెలుగుతో సాధించి చూపించాడు” అని ప్రసాదుని గర్వంగా గుండెలకి

    హత్తుకున్నాడు.

    ప్రసాదు తన దగ్గర వున్న నల్ల బ్యాగ్ నుంచి తెల్లగా మెరిసేనోట్ల కట్టలు తీసి గురువు ముందు వచ్చాడు. “ఇది మీ

    |శిష్యుడు మీకు గౌరవంగా ఇస్తున్న చిరు కానుక” అని నమష్కారం చేసాడు. “శిష్యుడు గొప్ప వాడవ్వడమే గొప్పకానుక. ఈ వేరే కానుక ఏం వద్దు….” అని శర్మ చిరు నవ్వుతో

    తిరష్కరించాడు. శ్రావణి తండ్రి వైపే గర్వంగా చూసింది.

    ద్వారం వైపు పదే పదే చూస్తున్నాడు శర్మ. “ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా ఆచార్య?” అని

    అనుమానంగా అడిగాడు. “అమ్మాయిని చూసుకోడానికి

    ” అబ్బాయి వస్తాడు” అని గుమ్మం వైపు వెళ్తున్న శర్మ చెయ్యిపట్టుకొని అపాడు. “మీరు ఎదురు చూస్తున్న పెళ్ళికొడుకుని కూడా నేనే ఆచార్య….” అని నవ్వుతూ అన్నాడు.

    శర్మ ఆశ్చర్యంగా చూసాడు. శ్రావణి వైపు ప్రేమగా చూసాడు. “మీరు చిన్నప్పుడు ఇచ్చిన పద్యం కూడా కంఠతా అయిపోయింది” అని పద్యం అందుకున్నాడు. చాలామధురంగా పద్యం చెప్తున్నాడు. శర్మ తన కూతురు వైపుచూసాడు. శ్రావణి సిగ్గుతో ముగ్గు వేసింది. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఇష్ట పడ్డంతో శర్మ ఆశీర్వదించేసాడు.

    “తెలుగు గెలిచింది. గెలిపించింది” అని శర్మకి గర్వంగా వుంది. అప్పుడే తన క్రింద వాటాలో వుండే రేవంత్ వచ్చాడు.రేవంత్ ని ఇక్కడ చూసి ప్రసాదు కి ఆశ్చర్యం వేసింది. బీచ్ లో

    వీడి మాటలు గుర్తుకు వచ్చాయి. “ఆచార్య! నాకు తెలుగులో

    మాత్రమే తొంభై మార్కులు వచ్చాయి. తెలుగు ఒక్కటే వస్తే జీవితంలో ఎలా పైకి వస్తావు అని మా అమ్మానాన్నఅంటున్నారు ” అని ఏడుస్తూ వున్నాడు. ఆ మాటలు విని

    ప్రసాదు వైపు చూసి గట్టిగామనసారా నవ్వాడు శర్మ.

    శర్మ ని, శ్రావణి ని తీసుకొని కార్ దగ్గరకి వచ్చాడు. ప్రసాదు. పిఏ ఎదురుగా వచ్చి వాళ్ళ బ్యాగ్ అందుకున్నాడు.

    ” ఈయన మా గురువు శర్మ గారు. శ్రావణి వాళ్ళ అమ్మాయి.

    తనతో నా పెళ్ళి” అని ప్రసాదు పీఏ తో చెప్పాడు. పిఏ రెండు చేతులు దగ్గర చేర్చి శర్మకి నమష్కారం చేసాడు. కానీ శర్మ పక్కన శ్రావణి లేదు. అసలు ఎవరూ లేరు. పీఏ జుట్టు పీక్కుంటూ దిక్కులు చూసాడు. శర్మ కార్ ఎక్కి “అమ్మాశ్రావణి…. జాగ్రత్తగా ఎక్కు” అని అన్నాడు. శ్రావణి ఎక్కాక డోర్ వేసాడు ప్రసాదు.

    ప్రసాద్ ముందు సీట్లో కూర్చున్నాడు. “శ్రావణి తో నా పెళ్ళి రేపే. గుడిలో ఏర్పాట్లు చేయించు. ఇక శర్మ గారు కూడా మాతోనే వుంటారు” అని పిఏ తో అన్నాడు. వెనుక సీట్లో శర్మ

    ఒక్కరే వున్నారు. పక్కన సీట్ ఖాళీ వుంది. బుర్ర వేడెక్కిపోయింది. “సరే సారు… నేను ఏర్పాట్లు చేయిస్తాను”

    అని అన్నాడు.

    “బుర్ర వేడెక్కిపోయింది. పక్కనే ఒక దాయ్ తాగి వస్తాను”అని కార్ రోడ్ పక్కనే అపాడు. ప్రసాదు సరే అన్నాడు.

    “ఆచార్య…. మీరేం తీసుకుంటారు?” అని అడిగాడు. “నాకు

    అల్లం చాయ్. శ్రావణి కి వేడి వేడి పాలు” అని నవ్వుతూ.

    చెప్పాడు. ప్రసాదు, పీఏ ఇద్దరూ కార్ దిగారు.

    ప్రసాదు కి పిఏ బాధ అర్ధమయ్యింది. “శర్మ గారు జీవితాంతం సంపాదించిన దానితో ఒక్కగానొక్క గారాల కూతురు శ్రావణి పెళ్ళి వైభవంగా చేసాడు. వున్నది ఊడ్చి

    కట్నంగా ఇచ్చాడు. పెళ్ళి అయిన మరుసటి రోజే తెలిసింది.

    పెళ్ళి కొడుక్కి ఇది పదో పెళ్ళి అని… అదే రోజు శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. కూతురు చావు చూసి శర్మ గారుకోమాలోకి వెళ్ళారు. ఈ మధ్యనే కోలుకున్నారు. కానీ, తను

    శ్రావణి ఇంకా బ్రతికే వుంది అనే

    భ్రమలో వున్నారు. ఈవిషయం ఈ మధ్యనే నేను పేపర్ లో చదివాను. నా జీవితం ఇచ్చిన గురువుకు ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. తన

    మిగిలిన జీవితమైన సరే సంతోషంగా గడపాలి. అందుకోసం మనం చెయ్యగలిగినంత చేద్దాం” అని పీఏ బుజం తడుతూ నిజం చెప్పాడు. పిఏ కార్ లో వున్న శర్మ వైపే చూసాడు. కార్ లోపల శర్మ తన పక్కనే వున్న ఖాళీ సీట్ తో కూతురు శ్రావణి తో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడు తున్నాడు. గురువు బరువు బుజం పైకెత్తుకున్న ప్రసాదు అల్లంత ఎత్తులో కనిపించాడు సిఏకి…

    – కాకు శివకుమార్

    Kaku Sivakumar Telugu Kathalu
    Previous Articleరెండు రాష్ట్రాల్లోనూ ఒకటే డిమాండా?
    Next Article తెల్లని చీకటి కల…!!(కవిత)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.