Telugu Global
Arts & Literature

గంగకే కన్నీళ్లు (కథానిక)

గంగకే కన్నీళ్లు (కథానిక)
X

ట్రాఫిక్ లోంచి తప్పించుకుంటూ పరుగు పరుగున వచ్చింది గంగ.

పేవ్ మెంటు మీద చెట్టుకింద

తండ్రి కనబడలేదు. చెమట తుడుచు కుంటూ చుట్టూ చూసింది. బువ్వ తినే టయిం అయిపోయిందని పరుగెట్టు కొచ్చింది తను. అసలే

నాయిన ఆకలికి ఆగలేదు. ఎక్కడికి పోయిండో...

కొంచెం దూరంలో కూర్చుని వచ్చి పోయే వాళ్ళని ధరమం చెయ్యండి బాబయ్యా! అంటూ అడుక్కునే గుడ్డి తాత దగ్గరకెళ్ళి తండ్రి గురించి

అడిగింది గంగ.

“ఏమో గంగమ్మా! నాకూ తెల్వదే..."

అన్నాడు తాత.

“ఏడికి పోయినా ఈ పాటికి తిండికి వచ్చె త్తాడు. తాతా! అన్నం తినకుండా అస్సలు ఉండలేడు. అసలే ఆడికి బిపి రోగ ముండాది

గదా.. ఏలకి తినక పోతే కల్లు తేలేత్తాడు. సర్లే నేనే చూసుకుంటా.." అంటూ గంగ చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీయసాగింది.

“పొద్దున ఏదో పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడున్న కొందర్ని తీసుకెళ్ళారు. మీ నాయిన కూడా ఎళ్ళేడు గంగా!" పాన్ డబ్బా కొండయ్య చెప్పాడు.

“పనొదిలేసి అట్టిట్టా పోయిండు బాబాయ్!" తల గోక్కుంటూ అడిగింది గంగ.

పార్టీ మీటింగుకి జనాలు కావాలని తీసుకు పోయారు. ఒక్క రోజుకి ఐదు వందలు, బిర్యానీ పేకెట్టూ, ఇంకా మందూ ఇస్తారంటే మీ నాయిన

పరుగెత్తాడు.. సాయంత్రానికి వచ్చేస్తాడులే నువ్వెళ్ళు" చెప్పాడు కొండయ్య,

అన్నం పెట్టుకొచ్చిన బాక్స్ తీసుకుని

ఇంటికి బయలు దేరింది గంగ.

గంగకి నాలుగేళ్ళ వయసప్పుడు తల్లి కల్తీ కల్లు తాగి చనిపోయింది. అప్పట్నించీ తండ్రిసాంబయ్యే లోకం అయ్యాడు గంగకి, మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు సాంబయ్య. పాతికేళ్ళుగా చెప్పులు కుట్టుకుంటూ, పిల్లని దగ్గరే కూర్చోబెట్టు కుని అవస్థలు పడ్డాడు సాంబయ్య. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. పిల్ల ఈడేరింది.

దాన్ని తన దగ్గర చూసి చాలా మంది చొంగ కార్చుకోడం చూసిన సాంబయ్య కూతుర్ని గుడిసె కాడే ఉండమని పక్కనే ఉండే లచ్చు మమ్మకి సూస్తుండమని చెప్పి పొద్దున్నే చెప్పులు కుట్టే సామాన్లు తెచ్చుకుని ఆ పేవ్మెంటు మీద కూర్చుంటాడు.

"ఫేషన్ చెప్పులు కొంటున్న ఈ రోజుల్లో

సాంబయ్య తోలు చెప్పులు ఎవరో గానికొనరు. ఐనా ఆ పనే చేస్తాడు సాంబయ్య.

రాతి మీద కత్తి నూరడం, కుట్టడానికి సన్నగా దారం తియ్యడం బాగానే నేర్చుకుంది గంగ. చెప్పులు

కుడతానంటే మాత్రం వొప్పుకునేవాడు కాదుసాంబయ్య ,

తండ్రి కుట్టిన చెప్పులు రకరకాల

పేర్లు చెప్పి అమ్మేది.

తల్లి అండ లేని గంగకితొందరగా పెళ్ళి చెయ్యాలని సాంబయ్య ఆరాటపడుతున్నాడీ మధ్య ,గంగ ఇంటికొచ్చింది. పదమూడేళ్ళకే పెద్దఅరిందా అయిపోయింది గంగ. తండ్రి గురించిఆలోచిస్తూ కూర్చుంది.

సాయంత్రం అవుతున్నా తండ్రి జాడలేదు.గుబులు మొదలయ్యింది. ఉండలేక మళ్ళీ తండ్రికూర్చునే పేవ్ మెంటు దగ్గరికి వెళ్ళి చూసింది.

అక్కడ సామాన్లు ఉన్నాయి గానీ తండ్రి లేడు.

కొండయ్య తన వైపు చెయ్యి పెట్టి పిలుస్తుంటే వెళ్ళింది గంగ.

“మధ్యాహ్నం మీటింగుకెళ్ళినోళ్ళు.. చాలా మంది ఆసుపత్రిలో పడున్నారంట .. బేగ ఎల్లు

గంగా!" కొండయ్య మాట పూర్తవ్వకముందే పరుగెత్తింది గంగ.

గవర్నమెంటు ఆసుపత్రి ముందు జనాలరోదనలు . ఏమయ్యిందో తెలియక గంగ కూడా వాళ్ళతో పాటు ఏడుస్తోంది.శవం ముఖంపై గుడ్డ కప్పి బైటకు తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పి అరుస్తున్నాడు వార్డు

బోయ్. ఏడుపులుపెరిగిపోతున్నాయి. తీసుకు పోయిన వాళ్ళు మాత్రం పత్తాలేరు.

సాంబయ్య పేరు రాగానే పరుగెత్తింది గంగ.

“ఏటయ్యిందన్నా!?” ఏడుస్తూ

అడిగింది.గంగ ప్రశ్న విననట్టే మరో వైపుకు వెళ్ళి పోయాడతను.

బేగొచ్చేస్తాను గంగమ్మా అని

పొద్దున్న చెప్పెళ్ళిన నాయిన మాటలు

రానట్టు చూస్తున్నాడు. తండ్రిని పట్టుకుని ఏడుస్తోంది గంగ.

పార్టీ వాళ్ళు ఎవరో వచ్చి శవానికి ఇంతని వెలకట్టి డబ్బు ఇస్తూ వాళ్ళ పార్టీ జెండాలను పంచి పెడుతున్నారు.

గంగ ఏడుస్తోంది. ఉన్న నాన్నని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ జెండా

ఆ చిన్నారి చేతిలో పెట్టారు.

గంగ కన్నీరు తుడవలేక ఆ

జెండా సిగ్గుతో కుంచించుకు

పోయింది.

- జాస్తి రమాదేవి

First Published:  10 Jan 2023 1:28 PM IST
Next Story